• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

BREAKING: టాస్ ఓడిన భారత్

అహ్మదాబాద్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య T20 WC సూపర్-8 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన 7 T20 WC మ్యాచ్‌ల్లో భారత్ 5 విజయాలు సాధించి ఆధిపత్యం చాటుకుంది. ఇదే రికార్డును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాలని భారత్ పట్టుదలగా ఉంది. మరోవైపు SA కూడా పటిష్టంగా ఉండటంతో ఈ పోరు ఉత్కంఠగా మారింది.

February 22, 2026 / 06:30 PM IST

కోటగుళ్లు శిల్ప సంపద అద్భుతం: ఇంగ్లాండ్ దేశస్థులు

MHBD: కోటగుళ్ళు శిల్ప సంపద అద్భుతమని ఇంగ్లాండ్ దేశానికి చెందిన సిమన్, వాలేరీలు అన్నారు. ఆదివారం ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లను వారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను చరిత్రను రామప్ప గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వారికి వివరించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ఫోటోలు, వీడియలు తీసుకున్నారు.

February 22, 2026 / 06:29 PM IST

డ్రోన్ల ద్వారా పోలీసుల నిఘా..!

కడప: నగరంలో గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలు, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు జిల్లా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. ఎస్పీ ఆదివారం పాత బస్టాండ్, రైల్వే స్టేషన్, బుగ్గవంక వంటి ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో గాలింపు చేపట్టారు. స్పెషల్ పార్టీ పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు.డ్రోన్ల నిఘా ద్వారా దాడులు నిర్వహిస్తామన్నారు.

February 22, 2026 / 06:28 PM IST

రేపు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

BDK: కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేపు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని క్యాంప్ కార్యాలయం నుంచి ఆదివారం ప్రకటించారు. కొత్తగూడెం, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కూనంనేని అందజేస్తారని అన్నారు. అందరూ సకాలంలో హాజరు కావాలన్నారు.

February 22, 2026 / 06:27 PM IST

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో పలువురు చేరికలు

HNK: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 61 డివిజన్ చైతన్యపురి కాలనీలో తెలంగాణ రాజ్య అధికార పార్టీ లో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆదివారం చేరారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్న వ్యక్తులకు నగరాధ్యక్షుడు అయినవోలు మల్లికార్జున శాస్త్రి కండువాలు కప్పి ఆహ్వానించారు.

February 22, 2026 / 06:27 PM IST

తొమ్మిది మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

సత్యసాయి: పుట్టపర్తి రూరల్ పరిధిలోని గంగిరెడ్డిపల్లిలో పేకాటాడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐ సురేష్ పర్యవేక్షణలో ఏఎస్ఐ ప్రసాద్ ఈ దాడులు నిర్వహించారు. నిందితుల నుంచి రూ.44,250 నగదు, 8 మొబైల్ ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన సురేష్ అనే వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

February 22, 2026 / 06:25 PM IST

కలెక్టరేట్‌లో నరసింహారెడ్డి వర్ధంతి

అనకాపల్లి కలెక్టరేట్‌లో ఆదివారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలవేసి నివాళులర్పించారు. బ్రిటిష్ సైన్యాన్ని ముచ్చెమటలు పట్టించిన స్వతంత్ర సమరయోధుడు నరసింహారెడ్డి అని అన్నారు. ఆయన స్ఫూర్తితో ముందుకు నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.

February 22, 2026 / 06:25 PM IST

కొంతమంది కావాలని ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు: మంత్రి

MLG: కొంతమంది కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి విమర్శించారు. ఈరోజు కన్నయ్యగూడెం మండల కేంద్రంలోని దేవాదుల ప్రాజెక్టు వద్ద నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్టు పనులను వచ్చే ఏడాది డిసెంబర్ నెలలోపు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందుబాటులో ఉంచుతామని మంత్రి హామీ ఇచ్చారు.

February 22, 2026 / 06:25 PM IST

సంత్ రవిదాస్ విగ్రహావిష్కరణ.!

RR: హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని సాయినగర్ కాలనీలో సంత్ శిరోమణి గురు రవిదాస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మోచి సంఘం ఏర్పాటు చేసిన గురు రవిదాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్థానిక నాయకులు బోయిని మహేష్ యాదవ్, పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, రవిదాస్‌కు నివాళులర్పించారు.

February 22, 2026 / 06:25 PM IST

రజకులపై దాడి ఘటనను ఖండించిన నాయకులు

KRNL: ఏపీ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు నాగర్ కర్నూల్ జిల్లా కమ్మేర గ్రామంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా రజక కుటుంబంపై జరిగిన దాడిని ఇవాళ తీవ్రంగా ఖండించారు. దాడిలో పసిబిడ్డ మృతి చెందడం దుర్మార్గమని పేర్కొన్నారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి భద్రత, నష్టపరిహారం కల్పించాలని డిమాండ్ చేశారు.

February 22, 2026 / 06:25 PM IST

యువతకు నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమం

ASR: యువతకు నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమమే మన్ కీ బాత్ కార్యక్రమమని పాడేరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వనుము చిట్టబ్బాయి అన్నారు. ప్రధాని మోడీ మనసులో మాట కార్యక్రమాన్ని ఆదివారం లైవ్ టెలికాస్ట్ ద్వారా కళాశాలలో విద్యార్థులకు చూపించారు. దేశాభివృద్ధికి యువత భాగస్వామ్యం తదితర అంశాలపై కార్యక్రమంలో మాట్లాడడం జరుగుతుందన్నారు.

February 22, 2026 / 06:24 PM IST

బీసీలకు రూ. 25వేల కోట్లు కేటాయించాలి: ఆర్.కృష్ణయ్య

TG: అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో బీసీల అభివృద్ధికి, వివిధ పథకాల కోసం రూ.25 వేల కోట్లు కేటాయించాలని ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. అలాగే బీసీ కార్పొరేషన్‌కు రూ.5వేల కోట్లు కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానం ప్రకారం ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామన్నారని.. కానీ గత రెండేళ్లుగా కేవలం రూ. 10వేల కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు.

February 22, 2026 / 06:24 PM IST

కాణిపాకం వినాయకుణ్ణి దర్శించుకున్న కేంద్ర మంత్రి

SKLM: ప్రముఖ పుణ్య క్షేత్రం కాణిపాకం వరసిద్ది వినాయకుణ్ణి ఆదివారం కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో, పూర్ణకుంభతో కేంద్ర మంత్రికి కాణిపాకం వరసిద్ధి వినాయక దేవస్థానం అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆర్చక స్వాములు శేష వస్త్రం, ప్రసాదం ఆయనకు అందించి, ఆశీర్వదించారు.

February 22, 2026 / 06:23 PM IST

టీడీపీలో చేరిన 100 కుటుంబాలు

VZM: బొండపల్లి మండలంలోని గొల్లుపాలెం గ్రామంలో 100 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆదివారం ఆ గ్రామంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ పోతల రమణమ్మ ఆధ్వర్యంలో 100 కుటుంబాలు టీడీపీలో చేరాయి. పార్టీలో చేరిన వారికి రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాస్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

February 22, 2026 / 06:22 PM IST

కాసరబాదలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

SRPT: కాసరబాదలో జరిగిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి హాజరయ్యారు. పేదల సొంతింటి కల కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో పేదలకు ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వకుండా వంచించిందని విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం పేదలకు గృహవసతి కల్పిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు.

February 22, 2026 / 06:21 PM IST