• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

క్రికెట్ గ్రౌండ్ అభివృద్ధికి విరాళం

AKP: ఎస్ రాయవరం మండలం రేవు పోలవరంలో క్రికెట్ గ్రౌండ్ అభివృద్ధికి మాజీ సర్పంచ్ చోడిపిల్లి బంగారి రూ.1,11,101 విరాళం ప్రకటించారు. ఈ మేరకు విరాళాన్ని నక్కపల్లి క్యాంపు కార్యాలయంలో ఆదివారం హోం మంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా గ్రామ నిర్వాహకులకు అందజేశారు. విరాళం అందజేసిన మాజీ సర్పంచ్‌ను మంత్రి అభినందించారు.

February 22, 2026 / 04:16 PM IST

‘ఇల్లు లేని ప్రతి నీరు పేదలకు ఇల్లు కట్టించి ఇస్తాం’

SRCL: ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టించి ఇస్తామని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టించి ఇవ్వడమే తమ లక్ష్యమని MLA అన్నారు.

February 22, 2026 / 04:16 PM IST

రైళ్లలో ఏడీఆర్ఎం ఆకస్మిక తనిఖీలు

విశాఖ నుంచి బయలుదేరే ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏడీఆర్ఎం (ఆపరేషన్స్) శ్రీ కె. రామారావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బెడ్ షీట్లు, శుభ్రతను పరిశీలించి ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం సిబ్బంది, సూపర్వైజర్లు, హెల్త్ ఇన్‌స్పెక్టర్లతో నిర్వహించిన కౌన్సెలింగ్లో సేవా ప్రమాణాలు పెంచాలని, ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు.

February 22, 2026 / 04:15 PM IST

నరసింహారెడ్డికి అన్నమయ్య పోలీసుల ఘన నివాళి

అన్నమయ్య: రాయచోటి పోలీస్ కార్యాలయంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ యం. వెంకటాద్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశభక్తి, ధైర్యసాహసాలను స్మరించుకున్నారు. నేటి తరానికి ఆయన జీవితం స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

February 22, 2026 / 04:14 PM IST

‘ఉయ్యాల ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకం’

VZM: జిల్లా పోలీసు కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆదివారం ఘన నివాళులు అర్పించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన తొలి యోధుల్లో ఒకరైన ఆయన ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకమని తెలిపారు.

February 22, 2026 / 04:13 PM IST

పొన్నలూరులో అగ్ని ప్రమాదం

ప్రకాశం: పొన్నలూరులో ఆదివారం పొగాకు బ్యారన్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రూ. 5 లక్షల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పొగాకు బ్యారన్ మొద్దుగొట్టంపై కర్ర జారి పడటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే సమయానికి పూర్తిగా దగ్ధమైంది. బ్యారన్ యజమానులు తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.

February 22, 2026 / 04:13 PM IST

ఆదోనిలో 99వకు చేరుకున్న దీక్షలు

KRNL: ఆదోని జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో సాగుతున్న ఉద్యమ దీక్షలు ఆదివారానికి 99వ రోజుకు చేరుకున్నాయి. ‘మేము సైతం’ అంటూ మాలదాసరి (హరిదాసుల) మాల మహానాడు నాయకులు, సభ్యులు రిలే నిరాహార దీక్షలో ఉన్నారు.కార్యక్రమంలో జేఏసీ నాయకులు రఘురామయ్య, అశోక్, నంద రెడ్డి, కృష్ణమూర్తి, కమతం వెంకటేశ్, గోపాల ఆచారి, కోదండ, గంగపుత్ర సంఘం ప్రకాష్, దస్తగిరి నాయుడు, పాల్గొన్నారు.

February 22, 2026 / 04:13 PM IST

నో హెల్మెట్ – నో పెట్రోల్.. యాదాద్రి కలెక్టర్ ఆదేశం

భువనగిరి జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు కలెక్టర్ హనుమంతరావు కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చారు. ఇకపై హెల్మెట్ లేని బైక్లకు పెట్రోల్ పోయకూడదని బంక్ యాజమాన్యాలను ఆదేశించారు. ప్రతి బంక్ వద్ద హెల్మెట్ ఆవశ్యకతపై అవగాహన బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు.

February 22, 2026 / 04:13 PM IST

7 ఫిల్మ్‌ఫేర్స్‌తో సాయి పల్లవి అరుదైన రికార్డు

టాలెంటెడ్ నటి సాయి పల్లవి తన ఖాతాలో మరో అరుదైన రికార్డును వేసుకుంది. తాజాగా జరిగిన 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ‘అమరన్’ చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డును అందుకుంది. దీంతో ఆమె కెరీర్‌లో మొత్తం 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు చేరాయి. ప్రేమమ్, ఫిదా, శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ, గార్గి, విరాటపర్వం, అమరన్ సినిమాలతో ఆమె ఈ ఘనత సాధించింది.

February 22, 2026 / 04:13 PM IST

మార్చి 3 నాగులమ్మ జాతర.. సీతక్కకు ఆహ్వానం

TG: ములుగు జిల్లా మండపేటలోని రాజుపేట-లక్ష్మీ నర్సాపూర్‌లో 2026 మార్చి 3 నుంచి 7 వరకు జరిగే శ్రీ నాగులమ్మ మహాజాతరకు ప్రభుత్వ సహకారం ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. మంత్రి సీతక్కను కలిసిన ఆలయ అధికారులు కలిసి.. నాగదేవత జాతరకు రావాలంటూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించి ప్రసాదం అందించారు.

February 22, 2026 / 04:10 PM IST

మేయర్ గుమ్మడం మమతను సత్కారం

మహబూబ్ నగర్ మున్సిపల్ తొలి మేయర్ గుమ్మడం మమత శ్రీనివాసను పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా సన్మానించారు. మాజీ ఎంపీపీ లక్ష్మయ్య, బీసీ విద్యార్థి సంఘం నేత వెంకటేశ్ శాలువా, పూలమాలతో సత్కరించారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో కలిసి పని చేయాలని నేతలు చర్చించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

February 22, 2026 / 04:10 PM IST

వైసీపీ హయాంలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయి: ఎమ్మెల్యే

కోనసీమ: ఐదేళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. ఆయన మాట్లాడుతూ… తిరుమల పవిత్రతను కాపాడడంలో విఫలమైన వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. వైసీపీ నేతలు దేవుడిని కూడా రాజకీయంలో వాడుకుంటున్నారని ఆరోపించారు. భగవంతుడి ప్రసాదం విషయంలోనూ అబద్ధాలాడుతూ భక్తులను మోసం చేస్తున్నారన్నారు.

February 22, 2026 / 04:10 PM IST

‘పసిబిడ్డ మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి’

RR: పసిబిడ్డ మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి ముస్లిం మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి ముస్తఫా అన్నారు. SDNRలో వారు మాట్లాడుతూ.. కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్షతో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మరణించడం అమానుషమని అన్నారు. జాతరకు రజక దంపతులు వెళ్ళగా, వారిపై దాడి చేయగా దాడిలో పాప ప్రాణాలు కోల్పోవడం విచారకరమని అన్నారు.

February 22, 2026 / 04:10 PM IST

కాపవరంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

WG: పాలకొల్లు మండలం కాపవరంలో ఆదివారం రూ.15 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్, డ్రైన్ పనులకు మాజీ MLC అంగర రామ్మెహన్ రావు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాలకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ కోడి విజయభాస్కర్, సర్పంచ్ కోలాటి రాద, ఉపసర్పంచ్ అంగర చిన్న పాల్గొన్నారు.

February 22, 2026 / 04:10 PM IST

ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు

MNCL: కడెం మండలం దోస్త్ నగర్ గ్రామ సమీపంలో గల అటవీ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కడెం వైపు నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108లో అంబులెన్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 22, 2026 / 04:09 PM IST