• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సత్యసాయి: మడకశిర పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పాల్గొన్నారు. 104 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 75,72,911 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఆపదలో ఉన్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక పెద్ద అండగా నిలుస్తోందని తెలిపారు.

February 21, 2026 / 07:22 PM IST

16 మండలాల్లో స్వచ్ఛ రథాల ప్రారంభం

ATP: బుక్కరాయసముద్రంలో శనివారం ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా 16 మండలాల్లో స్వచ్ఛ రథాలను జిల్లా పరిషత్ సీఈవో శివ శంకర్, DPO నాగరాజ నాయుడు ప్రారంభించారు. గ్రామాల్లో పొడి చెత్త సేకరించి, దానికి బదులుగా నిత్యావసర సరుకులు అందజేసే వస్తు మార్పిడి విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసేలా ప్రోత్సహించడమే లక్ష్యమని తెలిపారు.

February 21, 2026 / 07:22 PM IST

ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేసిన ఎమ్మెల్యే

TPT: వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి వార్డులు పరిశీలించారు. రోగులతో మాట్లాడి చికిత్స, మందుల సరఫరాపై ఆరా తీశారు. అత్యవసర మందులు అందుబాటులో ఉన్నాయని, త్వరలో డయాలసిస్ సెంటర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆసుపత్రి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

February 21, 2026 / 07:20 PM IST

మంచినీటి అవస్థలు.. రోడ్డెక్కిన మహిళలు

NLR: ఉలవపాడు మండలం కరేడు పంచాయితీలోని రామకృష్ణాపురం గిరిజన కాలనీ మహిళలు శనివారం ఖాళీ బిందెలతో నిరసన గళం వినిపించారు. 10 రోజులుగా మంచినీటి సరఫరా లేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. BPCL కంపెని సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కరేడు నుంచి రామకృష్ణాపురానికి వచ్చే మంచినీటి పైప్ లైన్ ధ్వంసం అయిందని ఆరోపించారు.

February 21, 2026 / 07:20 PM IST

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

KMR: డోంగ్లీలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయం ఎంతో అండగా నిలుస్తుందన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

February 21, 2026 / 07:20 PM IST

అరకు ఆసుపత్రిలో పారిశుధ్యంపై దొన్ను దొర ‘అరా’

ASR: స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్రలో భాగంగా అరకు ప్రభుత్వ ఆసుపత్రిని RTC జోన్ ఛైర్మన్ దొన్ను దొర శనివారం తనిఖీ చేశారు. వార్డులన్నీ కలియ తిరిగి పారిశుధ్యం, వైద్య సేవలు, మందుల సరఫరాపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉండటంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, సర్పంచులు పాల్గొన్నారు

February 21, 2026 / 07:20 PM IST

నిధులు విడుదల చేయండి.. సీతక్క విజ్ఞప్తి

TG: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‍కు మంత్రి సీతక్క పలు వినతిపత్రాలు ఇచ్చారు. పంచాయతీ ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘం నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అలాగే మహిళా స్వయం సహాయక సంఘాలు స్థాపిస్తున్న సోలార్ ప్లాంట్లకు కేంద్ర రాయితీల గడువును పొడిగించాలని కోరారు. ఈ అంశాలపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.

February 21, 2026 / 07:18 PM IST

లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ లో ఫ్రూట్స్ డే వేడుకలు

MHBD: తొర్రూరు డివిజన్ కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో శనివారం ఫ్రూట్స్ డే నిర్వహించారు. విద్యార్థులు 102 రకాల పండ్లను ప్రదర్శించారు. మున్సిపల్ ఛైర్మన్ తూనం శ్రావణ్, వైస్ ఛైర్మన్ సోమ రజిని రాజశేఖర్‌ మాట్లాడారు. పకృతి మనకు ప్రసాదించిన అపురూప వరం పండ్లు అని, నిత్యం పండ్లు తీసుకోవడం వలన జబ్బులు దారి చేరవని అన్నారు.

February 21, 2026 / 07:18 PM IST

సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి

NZB: రాష్ట్రంలోని అన్నదాతల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న రైతు భరోసా నిధులను ఎకరానికి రూ.15 వేల చొప్పున వెంటనే జమ చేయాలని కోరారు.

February 21, 2026 / 07:17 PM IST

పిస్తా హౌస్‌ను ప్రారంభించిన మంత్రి కోమటి రెడ్డి

నల్గొండ: సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి కానున్న నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో పిస్తా హౌస్ ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని హైదరాబాదు రోడ్డులో పిస్తా హౌస్‌ను మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి వెంకట్ రెడ్డి ప్రారంభించారు.

February 21, 2026 / 07:17 PM IST

కృష్ణాజిగూడెంలో ‘రెడ్ బుక్’ డే

JN: చిల్పూరు మండలంలోని కృష్ణాజిగూడెం గ్రామంలో అంతర్జాతీయ ‘రెడ్ బుక్’ డే సందర్భంగా CPM నేతలు “కమ్యూనిస్టు ప్రణాళిక” అనే పుస్తకాలను చదివారు. ప్రతి ఒక్కరు కమ్యూనిస్టు ప్రణాళిక అనే పుస్తకాన్ని చదవాలని, పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టులు నిత్యం కృషి చేస్తారని మండల కార్యదర్శి సాదం రమేష్ అన్నారు.

February 21, 2026 / 07:16 PM IST

సేవాలాల్ జయంతి వేడుకలను విజయవంతం చేయాలి: RDO

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భారత్ ఫంక్షన్ హాలులో ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆర్డీవో హరికృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు, బంజారా సంఘాల నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని ఆర్డీవో పిలుపునిచ్చారు.

February 21, 2026 / 07:14 PM IST

కుమారస్వామి కుటుంబ సభ్యులకు మంత్రి పరామర్శ

MLG: మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి 3వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి మంత్రి సీతక్క పూలమాలవేసి నివాళులర్పించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వారు చేసిన సేవలు మరువలేని సీతక్క అన్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

February 21, 2026 / 07:12 PM IST

తెలంగాణపై వివక్ష లేదు: కేంద్రమంత్రి

TG: అభివృద్ది కార్యక్రమాల్లో ఎలాంటి రాజ‌కీయాల‌కు తావు ఉండ‌ద‌ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అన్నారు. తెలంగాణతో ఎటువంటి వివక్ష ఉండదని హామీ ఇచ్చారు. ఇవాళ హైదరాబాద్‌లోని హోటల్ కాకతీయలో జాతీయ ఆర్థిక సాక్షరత సదస్సులో పాల్గొన్న కేంద్రమంత్రి.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కలిసి వస్తుందన్నారు.

February 21, 2026 / 07:12 PM IST

దశలవారీగా అందరికీ ఇందిరమ్మ ఇళ్లు: ఎమ్మెల్యే

WGL: సంగెం మండలం కొత్తగూడెంలో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి ఇళ్లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల కళ్లలో ఆనందం నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం.

February 21, 2026 / 07:12 PM IST