టీమిండియా ప్లేయర్ హార్దిక్ పాండ్యా తన మాజీ భార్య నటాషా, కుమారుడు అగస్త్యకు ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును కానుకగా ఇచ్చాడు. గతేడాది ఈ జంట విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించినప్పటికీ, కుమారుడి బాధ్యతలను ఇద్దరూ కలిసి పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారి సౌకర్యం కోసం హార్దిక్ ఈ విలాసవంతమైన కారును బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం SMలో వైరల్ అవుతున్నాయి.
TG: కామారెడ్డికి వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఎంపీ ఈటల రాజేందర్ ఖండించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా తన పార్టీ ఎమ్మెల్యేకు సంఘీభావం తెలపడానికి వెళ్లడం కూడా నేరమా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఇదే తరహా హౌస్ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసిందని, ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే విధానాన్ని అనుసరిస్తున్నారని విమర్శించారు.
KRNL: దేవనకొండలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశంలో కర్నూలులో కాంగ్రెస్ కార్యాలయంపై జరిగిన దాడిని జిల్లా అధ్యక్షుడు మహేంద్ర నాయుడు తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగం, వాణిజ్య ఒప్పందాలపై ప్రశ్నిస్తే దాడులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. దాడులతో కాంగ్రెస్ శ్రేణులను భయపెట్టలేరని హెచ్చరించారు.
NLG: చిట్యాల మండలం ఉరుమడ్లలో పాత ముత్యాలమ్మ, మారమ్మ దేవాలయాల స్థలంలో నూతన నిర్మాణానికి తెలంగాణ డైరీ కార్పోరేషన్ ఛైర్మెన్ గుత్తా అమిత్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుత్తా దేవేందర్ రెడ్డి, సర్పంచ్ సాగర్ల భానుశ్రీ, ఉపసర్పంచ్ నరేష్, కోనేటి యాదగిరి, పల్లపు బుద్ధుడు, జనపాల శీను, దినేష్, హరి ప్రసాద్, పూలమ్మ పాల్గొన్నారు.
VKB: పరిగి-షాద్నగర్ వరకు నాలుగు లైన్‌ల రహదారి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రహదారి ఇరువైపులా యంత్రాలతో విస్తృతంగా పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రత్యేకించి రాత్రి సమయంలో వెలుతురు తక్కువగా ఉండే ప్రదేశాల్లో జాగ్రత్తగా వాహనాలు నడపాలని కోరారు. సూచిక బోర్డులను వాహనదారులు గమనించాలని తెలిపారు.
SKLM: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ నాగమణి పిలుపునిచ్చారు. ఆదివారం నరసన్నపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద సీఐటీయూ విస్తృత సమావేశం జరిగింది. అంగన్వాడి, ఆశా, మధ్యాహ్నభోజనం, వివోఏ, తదితర స్కీం వర్కర్లకు వేతనాలు వెంటనే పెంచాలన్నారు.
SRPT: కోదాడ పట్టణంలోని 13వ వార్డులో ఆదివారం దోమల మందు పిచికారి కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు ఆదేశాల మేరకు, వార్డు కౌన్సిలర్ గురవమ్మ సైదిబాబు యాదవ్ పర్యవేక్షణలో సిబ్బంది ఫాగింగ్ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.
ప్రదీప్ రంగనాథన్, దర్శకుడు అశ్వత్ మారిముత్తు కాంబోలో వచ్చిన ‘డ్రాగన్’ మూవీ ఘనవిజయం సాధించి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అశ్వత్ నెట్టింట పోస్ట్ పెట్టాడు ‘సెల్ఫ్ మేడ్ స్టార్ ప్రదీప్‌తో పనిచేయడం మర్చిపోలేను. త్వరలోనే తాము రెండోసారి తప్పకుండా వస్తాం’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో ‘డ్రాగన్ 2’ సీక్వెల్ రాబోతుందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
RR: కేశంపేట(మం) ఇప్పలపల్లి గ్రామానికి చెందిన అంజయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన యువనాయకుడు శ్రీనివాసులు స్పందించి అంజయ్య అంత్యక్రియలకు రూ.10,000 మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. అంజయ్య మృతి పట్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ప్రకాశం: రేపట్నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలను సీఐ రామకోటయ్య సందర్శించారు. పరీక్ష నిర్వహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీస్ సిబ్బందికి, నిర్వహణ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ప్రజలు గమనించి గుంపులుగా ఉండొద్దని చెప్పారు.
WNP: ఆర్థిక స్తోమత సరిగా లేక, సొంత ఇల్లు నిర్మించుకోలేక నానా అవస్థలు పడుతున్న నిరుపేదల సొంత ఇంటి కల నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సకారం అవుతుందని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. ప్రతి ఇంటికి పెద్దన్నగా భరోసా కల్పిస్తూ నేనున్నానంటూ గృహప్రవేశానికి హాజరై నూతన వస్త్రాలు అందించారు. అందుకు ఎమ్మెల్యే మేఘారెడ్డికి వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
కృష్ణా: క్యాన్సర్‌ను సకాలంలో గుర్తించి చికిత్స పొందాలని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. ఆదివారం చల్లపల్లి మండలం వక్కలగడ్డలో పీఏసీఎస్ చైర్మన్ మల్లుపెద్ది దుర్గామహేష్ ఆధ్వర్యంలో బసవతారకం ఇండో – అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వారిచే ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని వెంకట్రామ్ ప్రారంభించారు.
NTR: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా అబుల్ కలాం ఆజాద్ విద్యలో అనేక మార్పులు తీసుకువచ్చి, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని సంకల్పంతో విధులు నిర్వహించారని కొనియాడారు.