• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఎమ్మెల్సీలకు ఛైర్మన్ నోటీసులు

AP: రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు నోటీసులు జారీ చేశారు. తనముందు హాజరై రాజీనామా కారణాలపై వివరణ ఇవ్వాలని తెలిపారు.  వారు రాజీనామా పత్రాలు చేసి చాలా రోజులు అయినప్పటికీ ఛైర్మన్ ఆమోదించలేదని వైసీపీ నేతలు మోషేన్ రాజును కలిశారు. దీంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

February 23, 2026 / 02:28 PM IST

సూళ్లూరుపేట ఇంటర్ పరీక్షల్లో జంబ్లింగ్ వివాదం

TPT: సూళ్లూరుపేటలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానంపై తీవ్ర వివాదం చోటుచేసుకుంది. సత్యం జూనియర్ కళాశాలకు చెందిన మొత్తం 233 మంది విద్యార్థుల్లో 227 మందిని ఒకే ప్రైవేట్ కళాశాలలో పరీక్షలు రాయడానికి కేటాయించడం పట్ల తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కొన్ని పాఠశాలలు పట్ల వివక్షత చూపుతున్నరన్నారు.

February 23, 2026 / 02:27 PM IST

కోతుల బెడద.. గాల్లో కలిస్తున్న మనుషుల ప్రాణాలు

NRML: కోతుల బెడదను అరికట్టాలని ప్రజలు ఎంత మొరపెట్టుకున్నా ప్రభుత్వాలు, పాలకులు మాత్రం కోతుల నియంత్రణకు అడ్డుకట్ట మాత్రం వేయలేకపోతున్నారు. ఆదివారం కడెం మండలం దోస్త్ నగర్ అటవీ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఓ వాహనానికి కోతులు అడ్డురావడంతో వాటిని తప్పించబోయి చెట్టును ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామాల్లో సైతం కోతులు నానా బీభత్సం సృష్టిస్తున్నాయి.

February 23, 2026 / 02:26 PM IST

కోతుల బెడద.. గాల్లో కలుస్తున్న మనుషుల ప్రాణాలు

NRML: కోతుల బెడదను అరికట్టాలని ప్రజలు ఎంత మొరపెట్టుకున్నా ప్రభుత్వాలు, పాలకులు మాత్రం కోతుల నియంత్రణకు అడ్డుకట్ట మాత్రం వేయలేకపోతున్నారు. ఆదివారం కడెం మండలం దోస్త్ నగర్ అటవీ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఓ వాహనానికి కోతులు అడ్డురావడంతో వాటిని తప్పించబోయి చెట్టును ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామాల్లో సైతం కోతులు నానా బీభత్సం సృష్టిస్తున్నాయి.

February 23, 2026 / 02:26 PM IST

ప్రశాంతంగా పూర్తయిన ఇంటర్ పరీక్షలు

KDP: బద్వేల్లో మొదటి రోజు ప్రశాంతంగా పూర్తయిన ఇంటర్ పరీక్షలు ఎస్కేపి జూనియర్ కళాశాల, గౌతమ్, బీజేఎస్ఆర్, శ్రీ గాయత్రి కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అర్బన్ సీఐ రామకృష్ణ, ఎస్సై నాగ చిరంజీవి ఆధ్వర్యంలో పోలీసుల సీసీ కెమెరాల నిఘా ఉంచారు.

February 23, 2026 / 02:25 PM IST

భారత్ ఓటమిపై అశ్విన్ ఫైర్

దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమిపై అశ్విన్ తీవ్రంగా మండిపడ్డాడు. జట్టు ఎంపిక సరిగా లేదని కోచింగ్ స్టాఫ్‌ను తప్పుపట్టాడు. జట్టులో నుంచి అక్షర్ పటేల్‌ను ఎందుకు తప్పించారో అర్థం కావడం లేదన్నాడు. ‘టీ20ల్లో అక్షర్‌ అత్యంత విలువైన ఆటగాడు.. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ విషయాన్ని నిరూపించాడు’ అని పేర్కొన్నాడు. అలాగే, రింకూను జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించాడు.

February 23, 2026 / 02:25 PM IST

ఇంటర్ పరీక్షా కేంద్రాలపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

TPT: ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన సందర్భంగా వరదరాజ నగర్‌లోని నారాయణ జూనియర్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వైద్య సిబ్బంది, త్రాగునీరు, భద్రతా ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

February 23, 2026 / 02:23 PM IST

‘అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలి’

పెద్దపల్లి జిల్లాలో ఆర్ & బీ శాఖ పనితీరుపై పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ సబ్న్, నాన్న్, డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులతో చేపట్టిన అభివృద్ధి, మరమ్మతు పనులను గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. పనుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు.

February 23, 2026 / 02:21 PM IST

కొత్తపల్లి నార్త్ బీట్లో అటవీ అధికారుల గస్తీ

ASF: సిర్పూర్(యు) మండలం కొత్తపల్లి నార్త్ బీట్లో జోడేఘాట్ FRO రమేశ్ సోమవారం గస్తీ నిర్వహించారు. తనిఖీల్లో వన్యప్రాణుల పాదముద్రలను గుర్తించినట్లు తెలిపారు. అడవులను ధ్వంసం చేసినా, మూగజీవాలను వేటాడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడవిని కాపాడుకోవడం సామాజిక బాధ్యతని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ అధికారి అనూష, బీట్ అధికారి మహేశ్, పాల్గొన్నారు

February 23, 2026 / 02:21 PM IST

భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు: CPI

AP: తిరుమల ప్రసాదంపై రాజకీయం చేశారని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. తప్పు జరిగిందని తెలిసినా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పబ్బం కోసం ఇరుపార్టీలు పోటీపడుతున్నాయని విమర్శించారు. దేవుడి పేరుతో భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు.

February 23, 2026 / 02:20 PM IST

హిజ్రాలకు ఐడి కార్డుల పంపిణీ

ATP: అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం ఇద్దరు హిజ్రాలకు జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఐడి కార్డులు, సర్టిఫికెట్లు అందజేశారు. అనంతపురానికి చెందిన శాంతి, కూడేరుకు చెందిన ఆద్య ఈ కార్డులను అందుకున్నారు. ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకున్న హిజ్రాలందరికీ తక్షణమే ఐడి కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు.

February 23, 2026 / 02:18 PM IST

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

VZM: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈనెల 28వ తేదీన చీపురుపల్లి మండలంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రాం సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ ఏర్పాట్లను, మీటింగ్ స్థలాన్ని సోమవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎడిషనల్ ఎస్పీ, ఆర్డీవో, డీఎస్పీ, మండల అధికారులు పాల్గొన్నారు.

February 23, 2026 / 02:17 PM IST

ఆ కుటంబాలకు రూ.10 లక్షల పరిహారం

AP: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన నలుగురి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందిస్తామని వెల్లడించారు. ఈ ఘటనకు కారణమైన పాల వ్యాపారిని అరెస్ట్ చేశామని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 8 మంది బాధితులు చికిత్స పొందుతున్నారన్నారు.

February 23, 2026 / 02:17 PM IST

ఆ కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

AP: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన నలుగురి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందిస్తామని వెల్లడించారు. ఈ ఘటనకు కారణమైన పాల వ్యాపారిని అరెస్ట్ చేశామని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 8 మంది బాధితులు చికిత్స పొందుతున్నారన్నారు.

February 23, 2026 / 02:17 PM IST

మహిళా విభాగం బలోపేతంపై వైసీపీ సమావేశం

విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ మహిళా విభాగం ఆత్మీయ సమావేశం సోమవారం నిర్వహించారు. రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మల్ల ధనలత ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయ ప్రసాద్, మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి పాల్గొన్నారు. కమిటీల నిర్మాణం త్వరగా పూర్తి చేసి వార్డు స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నేతలు తెలిపారు.

February 23, 2026 / 02:17 PM IST