AP: BACలో మూడు అంశాలపై చర్చించామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ‘పంటలకు గిట్టుబాటు ధరపై మండలిలో చర్చ జరగాలని కోరాం. యూనివర్సిటీ పేరుతో విశాఖలో రైతుల భూములను దోచుకోవాలని చూస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలకు భూముల దోచిపెట్టాలనే ఆలోచనపై చర్చించాలని డిమాండ్ చేశాం. తిరుమల లడ్డూ అంశంపైనా చర్చ జరగాలని అడిగాం’ అని వెల్లడించారు.
MNCL: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూటెక్ గని 2025-26 వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని 40 రోజుల ముందుగానే అధిగమించింది. ఈ సందర్భంగా సోమవారం కార్మికులు, సుపర్ వైజర్లను జీఎం శ్రీనివాస్ అభినందించి స్వీట్ బాక్సులు పంపిణీ చేశారు. ఇదే ఒరవడితో రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ బాజీసైదా పాల్గొన్నారు.
NLR: నెల్లూరులోని 26వ డివిజన్ విక్రమ్ నగర్ ప్రాంతంలో కార్పొరేషన్ నందన్ అధికారులతో కలిసి సోమవారం పర్యటించారు. డివిజన్ పరిధిలో అన్ని భవనాలను అసెస్మెంట్ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. 100% నిర్దేశించిన ఆస్తి, తాగునీటి కుళాయి, ఖాళీ స్థలం పన్నులను వసూళ్లు చేయాలని ఆదేశించారు.
HYD: తమ హక్కుల సాధన సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 24న ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ ఈదరు వెంకన్న తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ శాంతియుతంగా గాందేయ మార్గంలో ఈ పోరాటం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
సత్యసాయి: వేసవి కాలం దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రాలను ప్రారంభించినట్లు కదిరి డీఎస్పీ శివన్నారాయణ స్వామి తెలిపారు. సోమవారం జాతీయ రహదారిపై డీఎస్పీ కార్యాలయం ముందు రెండు చలివేంద్రాలను అధికారులు ప్రారంభించారు. ఎంపీడీఓ పొలప్ప, గురురాజు గుప్తా ముఖ్య అతిథులుగా హాజరై వీటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
కోనసీమ: కే. గంగవరం మండలంలోని తామరపల్లి గ్రామంలో ప్రజల రాగినీటి సమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ తోకల మంగ శ్రీనివాస్ తెలిపారు. సర్పంచ్ స్థానిక నాయకులతో కలిసి సోమవారం గ్రామంలో నూతనంగా నిర్వహించనున్న సురక్షిత త్రాగు నీటి ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నాయకులు నెక్కంటి బాలకృష్ణ, గన్ని శ్రీనివాస్ పాల్గొన్నారు.
E.G: కర్నూలులో న్యాయవాది ఎం.పవన్ కుమార్‌పై 4వ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ, సిబ్బంది దాడి చేయడం హేయకరమని అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు ఘటనను నిరసిస్తూ సోమవారం సొసైటీ రాష్ట్ర ప్రతినిధులు, న్యాయవాదులు రాజమండ్రి సబ్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. న్యాయవాదులు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
AP: రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. లాలాచెరువు ప్రాంతంలో నలుగురు చనిపోయారని తెలిపారు. మరో ఎనిమిది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. కల్తీ పాల వల్లే పలువురు అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధరణ అయిందని పేర్కొన్నారు.
KNR: డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏషియన్ పెయింట్స్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. లోడింగ్, అన్లోడింగ్ హమాలీ ఛార్జీలు చెల్లించాలని, డ్రైవర్లందరికీ ఇన్సూరెన్స్, రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. సీఐటీయూ, ఏషియన్ పెయింట్స్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
TPT: సూళ్లూరుపేట టోల్ ప్లాజా వద్ద షాపుల ముందు ఉంచిన కంటైనర్ వివాదం రోజురోజుకు పెరుగుతోంది. ట్రాఫిక్ నియంత్రణ కోసం తాత్కాలిక చర్యగా దీనిని ఏర్పాటు చేశామని టోల్ అధికారులు చెబుతున్నా, ఇక్కడ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. కంటైనర్ కారణంగా రహదారి వెడల్పు తగ్గి వాహనాలు నిలిచిపోవడంతో రద్దీ మరింత పెరిగిందని స్థానికులు అంటున్నారు.
MDK: నర్సాపూర్ పురపాలిక నూతన పాలకవర్గం తొలి సమావేశం ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అధ్యక్షతన సోమవారం ఉత్సాహంగా సాగింది. తొలుత కౌన్సిలర్లు, సిబ్బంది మధ్య పరిచయ కార్యక్రమం నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా పట్టణ ప్రగతికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు.
NRPT: ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన దారుణాన్ని వ్యతిరేకిస్తూ మక్తల్ మండలం చిట్యాల గ్రామంలో సోమవారం రజక, ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం చిన్నారి ఫొటోకు నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ.. జరిగిన ఘటనలో ప్రధాన నిందితుడిని వెంటనే చట్టరీత్యా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, పెద్దలు పాల్గొన్నారు.
NLG: నకిరేకల్ పట్టణంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా దగ్ధమైన శ్రీ సాయి విఘ్నేశ్వర ఆటోమొబైల్ షాపును నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సందర్శించారు. ప్రమాదంలో దుకాణానికి సుమారు రూ.40 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాదితుడు ఉపేందర్ తెలిపారు.ఈ సందర్భంగా షాపు యజమాని ఉపేందర్‌తో మాట్లాడిన ఎమ్మెల్యే ఘటన వివరాలు తెలుసుకున్నారు.
WGL: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో కులం పేరుతో రజక కుటుంబంపై జరిగిన దారుణ దాడిని BSF తీవ్రంగా ఖండిస్తోంది. సోమవారం వరంగల్ జిల్లా కేంద్రంలో BSF ఉమ్మడి WGL జిల్లా అధ్యక్షుడు కాడపాక రాజేందర్ మాట్లాడారు. రెండు నెలల పసికందును కాళ్లతో తన్ని చంపిన అగ్రకుల (రెడ్ల) పెత్తందార్లను చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
కృష్ణా: పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు ములుపూరి గోవింద ప్రభాకర్ రావు మరణించారు. ఆయన అంతిమయాత్ర మంగళవారం ఉదయం 9 గంటలకు కపిలేశ్వరపురం గ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభాకర్ రావుకు నివాళులర్పించి.. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన అంకితభావంతో సేవలందించారని నాయకులు కొనియాడారు.