NGKL: కల్వకుర్తి మండలం తాండ్ర సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ ఏఈ జానకిరామ్ తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఆయన సూచించారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
BPT: బాపట్ల తీరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కలెక్టర్ వినోద్ కుమార్ బృందం శుక్రవారం గోవాలో పర్యటించింది. అక్కడి తీర ప్రాంత నియంత్రణ మండలి (GCZMA) అధికారులతో వ్యర్థాల నిర్వహణపై చర్చించారు. కాండోలిమ్ బీచ్, ఫోర్ట్ అగ్వాడా జైలు మ్యూజియంలను సందర్శించి పర్యాటక సౌకర్యాలను పరిశీలించారు. బాపట్ల తీర ప్రాంతాభివృద్ధే లక్ష్యంగా ఈ పర్యటన సాగింది.
NLR: కావలి మండలం బిట్రగుంట – అల్లూరు రోడ్ RSల మధ్య km no 206/c16 – c17 పోస్టుల మధ్య మూడవ లైన్ మధ్యలో గూడ్స్ రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. దీంతో రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సదరు వ్యక్తి (50-55) బూడిద రంగు అర చేతుల చొక్క, నల్లని ప్యాంటు ధరించి ఉన్నాడని మృతుని వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.
KDP: వల్లూరు సొసైటీ బ్యాంకు వద్ద నేడు ఉదయం 9 గంటలకు యూరియా పంపిణీ చేయనున్నట్లు సొసైటీ ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, జిల్లా జేడి చంద్ర నాయక్ ముఖ్య అతిథులుగా రానున్నట్లు తెలిపారు. వరి రైతులకు ప్రాధాన్యత ఉంటుందని, అర్హులైన రైతులు తప్పనిసరిగా ఆధార్,పాస్ బుక్కు తీసుకురావాలని సూచించారు.
KRNL: యూనిక్ ఐడీ పొందేందుకు రైతులు ఈ నెలాఖరులోగా రైతు రిజిస్ట్రీలో పేర్లు నమోదు చేసుకోవాలని కోసిగి మండలం ఏవో వరప్రసాద్ ఇవాళ సూచించారు. మండలంలో 11,238 మంది పీఎం కిసాన్ లబ్దిదారులు ఉండగా వారిలో 9,308 మంది లబ్ధిదారులు మాత్రమే నమోదు చేసుకున్నారన్నట్లు తెలిపారు.
SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ విజయవాడలో హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న క్లాత్ వేస్టేజ్ బ్యాగ్స్ తయారీ యూనిట్‌ను నిన్న సాయంత్రం సందర్శించారు. వ్యర్థ వస్త్రాలతో పర్యావరణ హితమైన బ్యాగుల తయారీ విధానాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఆమదాలవలసలో ఇలాంటి యూనిట్‌ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
NTR: విజయవాడ భవానీపురంలో మిస్సైన ఇద్దరు చిన్నారుల కేసు సుఖాంతమైంది. ట్యూషన్‌కు వెళ్లకుండా ఇంట్లోని నగదు తీసుకుని పారిపోయిన మేరారామ్, ఉమారామ్, ఆచూకీ లభ్యమైంది. విజయవాడ నుంచి ముంబైకి వెళ్లిన చిన్నారులు, అక్కడి నుంచి గుజరాత్‌కు వెళ్తుండగా పోలీసులు చాకచక్యంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పిల్లలు క్షేమంగా దొరకడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
NDL: డోన్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఇవాళ సీపీఐ నాయకుడు రంగం నాయుడు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు కలిసి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. భారత రాజ్యాంగాన్ని కాపాడాలంటూ సమాజంలో కుల వివక్ష లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని ఆయన అన్నారు. ఉపాధి కూలీలకు 200 రోజులు పని దినాలు కల్పించాలని సిపిఐ నాయకుడు పేర్కొన్నారు.
PPM: ఏపీ ఎస్టీ కమిషన్ మెంబర్ మల్లేశ్వరరావు నిన్న కురుపాం మండలం నీలకంఠాపురంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ, బాలుర బాలికల పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన ముస్తాబు గదిని పరిశీలించారు. శతశాతం ఉత్తీర్ణత సాధించాలని టెన్త్ విద్యార్థులకు సూచించారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్ తప్పనిసరిగా అమలు చేయాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు.
ప్రకాశం: సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామ రైతు సేవా కేంద్రంలో పాడి రైతులకు ఏపీ పశుసంవర్ధక శాఖ ద్వారా 50% సబ్సిడీతో పశువుల దాన అందజేశారు. జరిగిన ఈ కార్యక్రమంలో సేవా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. ఈ దానా వాడకంతో పశువుల్లో పాలశాతం, పాల ఉత్పత్తి పెరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో పులివర్తి లక్ష్మీ నారాయణ, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.
KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరిగిన డిగ్రీ ఒకటో సెమిస్టర్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన 30 మంది విద్యార్థులను డిబార్ చేసి నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్లు ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 10,282 మందికిగాను 9,452 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు చెప్పారు.
WGL: సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా నిర్వహిస్తున్న నాల్గవ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌లో టేబుల్ టెన్నిస్ గెజిటెడ్ అధికారుల విభాగంలో WGL కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కాంస్య పతకం సాధించారు. అదేవిధంగా 55 ఏళ్ల గెజిటెడ్ అధికార బాల్ బ్యాడ్మింటన్ విభాగంలో వరంగల్ కమిషనరేట్‌కు చెందిన ఏసీపీలు జితేందర్ రెడ్డి, మధుసూదన్‌లకు బంగారు పతకం సాధించారు.
BHPL: టేకుమట్ల మండలం దుబ్యాల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బిక్కినేని సంపత్ రావు తండ్రి బిక్కినేని మేటల్ రావు ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి నిన్న రాత్రి మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
WGL: రాయపర్తి మండలం మైలారం శివారులో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచార దందాను అరికట్టాలని శనివారం గ్రామస్థులు సర్పంచ్ చిర్ర వేణుకు వినతిపత్రం సమర్పించారు. ఈ దందా కారణంగా గ్రామ యువత దారితప్పుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ, గ్రామ పంచాయతీ సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.