• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

FSL అగ్నిప్రమాదంలో కీలక మలుపు

TG: హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో ఇటీవల జరిగిన అగ్రిప్రమాదం ఘటన కీలక మలుపు తిరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా 1100 కేసుల ఫైల్స్ దగ్ధమైనట్లు నాగ్‌పూర్ ప్రత్యేక బృందం గుర్తించింది. ఈ ఫైల్స్ రికవరీకి ప్రయత్నాలు చేసినప్పటికీ డేటా రికవరీ సాధ్యం కాదని తేల్చింది.

February 21, 2026 / 08:36 AM IST

నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి పంట సాగు కోసం ప్రధాన కాలువ ద్వారా 3వ విడతలో భాగంగా శనివారం 1,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 14.045 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు కోరారు.

February 21, 2026 / 08:35 AM IST

కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ఎంపిక

W.G: బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా సుంకర కాశీవిశ్వేశ్వరరావు నియామకమయ్యారు. శుక్రవారం ఆయనకు నియామకపత్రంను జిల్లా నాయకులు అందించారు. బీజేపీ సిద్ధాంతాలు, ఆశయాలను గౌరవిస్తూ తాను చేసిన సేవలను గుర్తించి జిల్లా అధ్యక్షుడు వెంకట సూర్యనారాయణ రాజు నియామక పత్రాన్ని అందజేశారని కాశీ తెలిపారు.

February 21, 2026 / 08:35 AM IST

ఆత్మహత్యకి యత్నించిన వ్యక్తి మృతి

CTR: ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ కె. శేఖర్ (43) అనే వ్యక్తి మృతి చెందాడు. చిత్తూరు టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య వివరాల మేరకు.. గిరింపేట అంబేడ్కర్ నగర్‌కు చెందిన శేఖర్ శివరాత్రి రోజున మద్యం తాగడంతో అతని భార్యతో వాగ్వాదం జరిగింది. దీంతో శరీరంపై శేఖర్ ఆయిల్ పోసుకుని నిప్పంటిచుకున్నాడు. తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు.

February 21, 2026 / 08:35 AM IST

స్త్రీనిధి రుణాలు సకాలంలో చెల్లించాలి: DRDO

KMM: స్త్రీనిధి ద్వారా తీసుకున్న రుణాలు పెండింగ్ ఉంచకుండా సకాలంలో చెల్లించాలని ఖమ్మం డీఆర్డీవో పీడీ శ్రీరామ్ స్పష్టం చేశారు. గ్రామదీపికల నిర్లక్ష్యం వల్ల వడ్డీ భారం పెరుగుతుందని, అవకతవకలకు తావులేకుండా వసూళ్లు చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పించి, హాజరు శాతాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

February 21, 2026 / 08:34 AM IST

‘ఎన్నికలు రాగానే ప్రభుత్వానికి రైతు భరోసా గుర్తుకొస్తుంది’

BHNG: ఎన్నికలు రాగానే ప్రభుత్వానికి రైతు భరోసా గుర్తుకొస్తుందని, రైతు భరోసాను ఓట్ల భరోసాగా మార్చి ఓట్లు రాబట్టుకునేందుకే ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోందని డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. శుక్రవారం గుండాల మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకుండా రైతులను మోసం చేస్తోందన్నారు.

February 21, 2026 / 08:34 AM IST

రేపు జిల్లాకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి

MHBD: మహబూబాబాద్ మండలంలోని రెడ్యాల గ్రామానికి చెందిన బీగ్ టీవీ ఛైర్మన్ వెన్నం విజయ్ కాంత్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, రాష్ట్ర సవింధాన్ కమిటీ సభ్యులు వెన్నం శ్రీకాంత్ రెడ్డిల తండ్రి వెన్నం రాఘవేందర్ రెడ్డి ఇటీవల మరణించారు. వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు రేపు రెడ్యాల గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు.

February 21, 2026 / 08:33 AM IST

NGKL: విద్యుత్ సరఫరాకు అంతరాయం

NGKL: కల్వకుర్తి మండలం తాండ్ర సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ ఏఈ జానకిరామ్ తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఆయన సూచించారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

February 21, 2026 / 08:32 AM IST

బాపట్ల తీర అభివృద్ధిపై గోవాలో కలెక్టర్ పర్యటన

BPT: బాపట్ల తీరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కలెక్టర్ వినోద్ కుమార్ బృందం శుక్రవారం గోవాలో పర్యటించింది. అక్కడి తీర ప్రాంత నియంత్రణ మండలి (GCZMA) అధికారులతో వ్యర్థాల నిర్వహణపై చర్చించారు. కాండోలిమ్ బీచ్, ఫోర్ట్ అగ్వాడా జైలు మ్యూజియంలను సందర్శించి పర్యాటక సౌకర్యాలను పరిశీలించారు. బాపట్ల తీర ప్రాంతాభివృద్ధే లక్ష్యంగా ఈ పర్యటన సాగింది.

February 21, 2026 / 08:31 AM IST

గూడ్స్ రైలు కింద పడి వ్యక్తి మృతి

NLR: కావలి మండలం బిట్రగుంట – అల్లూరు రోడ్ RSల మధ్య km no 206/c16 – c17 పోస్టుల మధ్య మూడవ లైన్ మధ్యలో గూడ్స్ రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. దీంతో రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సదరు వ్యక్తి (50-55) బూడిద రంగు అర చేతుల చొక్క, నల్లని ప్యాంటు ధరించి ఉన్నాడని మృతుని వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.

February 21, 2026 / 08:31 AM IST

KDP: అలర్ట్: రైతులకు యూరియా పంపిణీ

KDP: వల్లూరు సొసైటీ బ్యాంకు వద్ద నేడు ఉదయం 9 గంటలకు యూరియా పంపిణీ చేయనున్నట్లు సొసైటీ ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, జిల్లా జేడి చంద్ర నాయక్ ముఖ్య అతిథులుగా రానున్నట్లు తెలిపారు. వరి రైతులకు ప్రాధాన్యత ఉంటుందని, అర్హులైన రైతులు తప్పనిసరిగా ఆధార్,పాస్ బుక్కు తీసుకురావాలని సూచించారు.

February 21, 2026 / 08:30 AM IST

‘నెలాఖరులోగా పేర్లు నమోదు చేసుకోవాలి’

KRNL: యూనిక్ ఐడీ పొందేందుకు రైతులు ఈ నెలాఖరులోగా రైతు రిజిస్ట్రీలో పేర్లు నమోదు చేసుకోవాలని కోసిగి మండలం ఏవో వరప్రసాద్ ఇవాళ సూచించారు. మండలంలో 11,238 మంది పీఎం కిసాన్ లబ్దిదారులు ఉండగా వారిలో 9,308 మంది లబ్ధిదారులు మాత్రమే నమోదు చేసుకున్నారన్నట్లు తెలిపారు.

February 21, 2026 / 08:30 AM IST

క్లాత్ యూనిట్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే

SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ విజయవాడలో హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న క్లాత్ వేస్టేజ్ బ్యాగ్స్ తయారీ యూనిట్‌‌ను నిన్న సాయంత్రం సందర్శించారు. వ్యర్థ వస్త్రాలతో పర్యావరణ హితమైన బ్యాగుల తయారీ విధానాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఆమదాలవలసలో ఇలాంటి యూనిట్‌ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

February 21, 2026 / 08:28 AM IST

ELR: జంగారెడ్డిగూడెంలో ఏసీబీ దాడులు

ELR: జంగారెడ్డిగూడెంలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. ఆవుపాడుకి చెందిన అచ్యుత దుర్గ సాయి డ్రగ్ లైసెన్స్ కోసం ఈనెల 6న ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోగా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కంపా సురేష్‌ను సంప్రదించారు. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ మెడికల్ షాప్ అసోసియేషన్ కోశాధికారి తడికమళ్ళ శివరామకృష్ణను కలవాలని చెప్పగా రూ.20,000 ఇవ్వాలని చెప్పడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు.

February 21, 2026 / 08:28 AM IST

విజయవాడలో మిస్సయిన బాలురు.. ముంబైలో సేఫ్

NTR: విజయవాడ భవానీపురంలో మిస్సైన ఇద్దరు చిన్నారుల కేసు సుఖాంతమైంది. ట్యూషన్‌కు వెళ్లకుండా ఇంట్లోని నగదు తీసుకుని పారిపోయిన మేరారామ్, ఉమారామ్, ఆచూకీ లభ్యమైంది. విజయవాడ నుంచి ముంబైకి వెళ్లిన చిన్నారులు, అక్కడి నుంచి గుజరాత్‌కు వెళ్తుండగా పోలీసులు చాకచక్యంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పిల్లలు క్షేమంగా దొరకడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

February 21, 2026 / 08:28 AM IST