• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జనగామ కలెక్టర్‌ను కలిసిన మున్సిపల్ ఛైర్పర్సన్

JN: జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి కలిశారు. కాంగ్రెస్ కౌన్సిలర్లతో కలిసి వెళ్లిన ఆమె, పట్టణ అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్‌ను కోరారు. అనంతరం డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, ఆర్డీవో గోపీరాంలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ శివరాజ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

February 20, 2026 / 08:30 AM IST

ఒంటిగంట వరకే ఉర్దూ పాఠశాలలు: డీఈవో

ATP: రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో ఉర్దూ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకే పని చేస్తాయని డీఈఓ ప్రసాద్ బాబు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. రంజాన్ మాసం ముగిసిన తర్వాత పాఠశాలలు యథావిధిగా నడుస్తాయని వివరించారు.

February 20, 2026 / 08:30 AM IST

‘జనన మరణాల నమోదుపై కొత్త నిబంధనలు’

AKP: జనన మరణాల నమోదుపై ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలులోకి తీసుకువచ్చిందని డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ హైమావతి గురువారం తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం జనన మరణాల రిజిస్ట్రేషన్‌ను 21 రోజుల్లో ఉచితంగా నమోదు చేయించుకోవచ్చునని సూచించారు. 21 రోజుల నుంచి 30 రోజుల్లో నమోదు చేస్తే రూ.25, 30 నుంచి ఏడాదిలోపు రూ.250 అపరాధ రుసుం చెల్లించాలన్నారు.

February 20, 2026 / 08:28 AM IST

పిడుగురాళ్లలో కఠినంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

PLD: పిడుగురాళ్లలో మద్యం సేవించి ఆటో నడిపిన వ్యక్తికి కోర్టు 7 రోజుల జైలు శిక్ష విధించినట్లు సీఐ వెంకట్రావు తెలిపారు. నిందితుడిని పోలీసులు సివిల్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఈ తీర్పునిచ్చారు. పట్టణంలో రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ వాహనదారులను గురువారం రాత్రి హెచ్చరించారు.

February 20, 2026 / 08:28 AM IST

రాజమండ్రిలో నేడు, రేపు అంతర్జాతీయ సదస్సు

E.G: రాజమండ్రిలోని SKVT ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి 20, 21 తేదీలలో ‘యువతలో ఆవిష్కరణలు, వ్యాపార నైపుణ్యాల అభివృద్ధి’పై అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా. బి.వి. తిరుపణ్యం తెలిపారు. ఈ సదస్సులో అధ్యాపకులు పరిశోధనా పత్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. డిగ్రీ, ఆపై చదువుతున్న విద్యార్థులు పాల్గొని అవసరమైన మెలకువలు నేర్చుకోవచ్చన్నారు.

February 20, 2026 / 08:27 AM IST

సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే భేటీ

SKLM: శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ గురువారం సీఎం చంద్రబాబును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులు, బోధి బట్టి డ్రైనేజీ సమస్యలు తదితర అంశాలపై సీఎంతో చర్చించారు. వంశధార కాలువలు, డ్రైనేజీ పనుల కోసం రూ. 31.10 కోట్ల నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు.

February 20, 2026 / 08:27 AM IST

ఆరోగ్య సర్వే లక్ష్యాలను చేరుకోవాలి: ఎన్.సి.డి పిఓ డాక్టర్ జగన్ మోహన్

PPM: నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేలా ఆరోగ్య సర్వేలు చేపట్టాలని జిల్లా ఎన్.సి.డి అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు స్పష్టం చేశారు. అడ్డాపుశీల లో ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుత ఎన్.సి.డి, ఆర్.బి.ఎస్.కె సర్వే, స్క్రీనింగ్‌లపై వైద్య సిబ్బందిని ఆరా తీసి ఆన్లైన్ నమోదు నివేదికలు పరిశీలించారు.

February 20, 2026 / 08:25 AM IST

ట్రాక్టర్ అదుపుతప్పి వ్యక్తి .. మృతి

ELR: ముదినేపల్లి మండలం సింగరాయపాలెంకు చెందిన సతీశ్ (25) గురువారం ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. కాళ్లలో చెరువు పనులు చేస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సతీశ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఏడాది క్రితమే వివాహమైన సతీశ్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

February 20, 2026 / 08:24 AM IST

‘విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి’

BHNG: జిల్లాలోని విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కి వివిధ సమస్యలపై గురువారం వినతి పత్రం అందజేశారు. భువనగిరి మున్సిపల్ పరిధి నుండి 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి కార్యాలయాలలో పనిచేస్తున్నా వారికి 13 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని అన్నారు.

February 20, 2026 / 08:23 AM IST

నేటి నుంచి మూడు రోజులు పవర్ కట్

E.G: సీతానగరం మండలంలోని పలు గ్రామాలకు శుక్రవారం నుంచి ఈ నెల 23 వరకూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఎస్ఈ నటరాజన్ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీతానగరం, సింగవరం పంచాయతీలోని నాగరత్నం కాలనీ, రఘుదేవ పురాల్లో గృహ, వాణిజ్య, వ్యవసాయ వినియోగగదారులకు విద్యుత్‌ను నిలిపివేస్తామన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలన్నారు.

February 20, 2026 / 08:22 AM IST

టిప్పర్ ఢీకొని విరుపాక్షికి గాయాలు

KRNL: ఆదోని శివారు సిరుగుప్ప సర్కిల్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన విరుపాక్షి గాయపడ్డారు. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు టిప్పర్‌ను స్వాధీనం చేసుకుని కేసునమోదు చేసినట్లు సీఐ అబ్దుల్ తెలిపారు.

February 20, 2026 / 08:22 AM IST

‘పత్తి రైతులు ఆందోళన చెందవద్దు’

PDPL: పత్తి రైతులు ఆందోళన చెందవద్దని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ఇవాళ పత్తి కొనుగోళ్లు ముగించాలని అధికారులు భావించగా, రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఈ గడువును మార్చి 15 వరకు పొడిగించాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీని కోరినట్లు చెప్పారు. ఈ మేరకు కోటపల్లి ప్రాంత పత్తి రైతులు సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

February 20, 2026 / 08:22 AM IST

గ్యాస్ పంపిణీలో సంతృప్తి శాతం పెంచాలి: జేసీ

CTR: గ్యాస్ పంపిణీలో సంతృప్తి శాతం పెంచాలి అని జేసీ రాజేంద్రన్ హెచ్చరించారు. నిన్న సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌‌లో గ్యాస్ సిలిండర్ల సరఫరా డీలర్లు, నిర్వాహకులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. జేసీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వీబీఆర్ఎస్ సర్వేలో గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ప్రజల సంతృప్తి శాతంలో జిల్లా చాలా వెనుకబడి ఉందన్నారు.

February 20, 2026 / 08:21 AM IST

హెల్మెట్‌ లేకుంటే కఠిన చర్యలు: రావులపాలెం సీఐ

కోనసీమ: రహదారి ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని నివారించేందుకు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని రావులపాలెం సీఐ సిహెచ్. విద్యాసాగర్‌ హెచ్చరించారు. గురువారం రాత్రి ఆలమూరు సెంటర్‌లో ఎస్సై జి. నరేష్‌తో కలిసి హెల్మెట్‌ వాడకంపై అవగాహన కల్పించారు. హెల్మెట్‌ లేని ప్రయాణం మృత్యుపాశమని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

February 20, 2026 / 08:21 AM IST

దారుణం.. 20 మంది కలిసి ముగ్గురిపై దాడి

TG: HYD బాలాపూర్‌లో ముగ్గురు వ్యక్తులపై దాడి జరిగింది. 20 మంది దుండగులు వచ్చి ముగ్గురిపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో వారికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. పాత కక్షల కారణంగానే ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

February 20, 2026 / 08:20 AM IST