• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అభిషేక్‌కి సన్నీ కీలక సూచన

T20 WCలో అభిషేక్ ఆడిన 3 మ్యాచుల్లోనూ డకౌట్ కావడం అటు జట్టును, ఇటు క్రికెట్ అభిమానులను కలవరపరుస్తోంది. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అతనికి కీలక సూచన చేశారు. తొలి బంతికి బౌండరీ కోసం కాకుండా సింగిల్‌కు ప్రయత్నించాలని, ప్రారంభంలో పరుగులు చేయకున్నా క్రీజులో నిలబడాలని సూచించారు. ఒక్కసారి స్థిరపడితే రన్స్ సునాయాసంగా పరుగులు వస్తాయని పేర్కొన్నారు.

February 20, 2026 / 09:44 AM IST

కాచిగూడ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో చోరీ

ATP: గుత్తి రైల్వే జంక్షన్‌లో శుక్రవారం తెల్లవారుజామున కదులుతున్న రైలులో చోరీ జరిగింది. బెంగళూరు నుంచి కాచిగూడ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో హైదరాబాద్‌కు చెందిన అరుణ అనే మహిళ ప్రయాణికురాలి 3 తులాల బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తి లాక్కెళ్ళాడు. ఈ ఘటనపై బాధితురాలు జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

February 20, 2026 / 09:42 AM IST

రోడ్డు విస్తరణ సెగ.. నేరడలో బాధితుల ఆందోళన

NLG: చిట్యాల మండలం నేరడలో రోడ్డు విస్తరణ కోసం ఇళ్ల కూల్చివేతను నిరసిస్తూ బాధితులు ఆందోళన చేపట్టారు. తమకు తక్షణ ఆర్థిక సాయం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ వద్ద నిధులు లేవని అధికారులు చెప్పడంతో ఉద్రిక్తత నెలకొంది. బాధితులకు అండగా ఉంటామని బీజేపీ నేత శంకరాచారి పేర్కొనగా, ఇందిరమ్మ ఇళ్ల హామీపై బాధితులు అసహనం వ్యక్తం చేశారు.

February 20, 2026 / 09:40 AM IST

ఈ నెల 24న మెగా జాబ్ మేళా

AKP: నర్సీపట్నంలో ఈ నెల 24వ తేదీన రిషి డిగ్రీ కాలేజ్ వద్ద మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్కిల్ డెవలప్‌మెంట్ జిల్లా మేనేజర్ గోవిందరావు తెలిపారు. 17 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల నిరుద్యోగులు పదో తరగతి, డిగ్రీ, పీజీ, ఐటిఐ డిప్లొమా చేసిన నిరుద్యోగులు హాజరు కావాలని సూచించారు.

February 20, 2026 / 09:38 AM IST

జిల్లాలో 52 పరీక్ష కేంద్రాలు..!

ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 10,888 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నట్లు డీఈవో రాజేశ్వర్ వెల్లడించారు. వీరిలో 5,443 మంది బాలురు, 5,445 మంది బాలికలు ఉన్నారు. మొత్తం 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, పర్యవేక్షణ కోసం 52 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 52 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 13 మంది కస్టోడియన్లను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు.

February 20, 2026 / 09:37 AM IST

‘సైయారా’ దర్శకుడితో రణ్‌బీర్ మూవీ?

భారీ విజయం అందుకున్న ‘సైయారా’ మూవీ దర్శకుడు మోహిత్ సూరితో రణ్‌బీర్ కపూర్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. మోహిత్ ఓ గ్యాంగ్‌స్టర్ మ్యూజికల్ లవ్‌స్టోరీని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో రణ్‌బీర్ హీరోగా నటించనుండగా.. ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కథ చర్చలు జరుగుతున్నట్లు టాక్.

February 20, 2026 / 09:37 AM IST

విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం అందజేత

NRPT: ఊట్కూర్ మండలం కొత్తపల్లి గ్రామ ప్రతినిధులు నారాయణపేట విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజినీర్ నవీన్‌ను కలిసారు. తక్కువ వోల్టేజ్, లూజ్ లైన్లు, కర్రలపై విద్యుత్ లైన్ల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆర్. నర్సిములు, భారతీయ కిసాన్ సంఘం నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు  పాల్గొన్నారు.

February 20, 2026 / 09:36 AM IST

ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద పర్యవేక్షణ

PLD: ఈనెల 23 నుంచి నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలకు పల్నాడు జిల్లాలో పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారిణి నీలావతి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 34,376 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరకానున్నట్లు తెలిపారు. ప్రతి కేంద్రంలో కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉంటుందన్నారు.

February 20, 2026 / 09:35 AM IST

జిల్లాలో అరుదైనా ఉడుత

VKB: జిల్లాలో ఒక అరుదైన పెద్ద ఉడుత (Malabar Giant Squirrel) కనిపించింది. కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంతుశాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి, అమ్రాబాద్ అడవిలో తన పరిశోధనలో భాగంగా దీనిని గుర్తించారు. దీనిని శాస్త్రీయంగా రాటుఫా ఇండికా అని పిలుస్తారు. ఇది సుమారు 3 అడుగుల పొడవు, వివిధ రంగులు కలిగి ఉంటుందని తెలిపారు.

February 20, 2026 / 09:35 AM IST

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్

SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ 2, 13 వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి ఇవాళ ఉదయం పర్యటించారు. ఈ మేరకు వార్డుల్లో పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న శుభ్రత పనులను పరిశీలించారు. పనులు సక్రమంగా నిర్వహించాలని, చెత్త సేకరణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సిబ్బందికి సూచించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

February 20, 2026 / 09:35 AM IST

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ను కలిసిన పీయు ఉపకులపతి

MBNR: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మను పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి జీఎన్ శ్రీనివాస్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యా మండల చైర్మన్ బాల కిష్టారెడ్డి, ఇతర యూనివర్సిటీల ఉపకులపతులు ఉన్నారు.

February 20, 2026 / 09:34 AM IST

నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 258.21 పాయింట్లు నష్టపోయి 82239.93 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 68.80 పాయింట్ల నష్టంతో 25385.55 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.98గా ఉంది.

February 20, 2026 / 09:34 AM IST

ఈ నెల 22న బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ కోసం TG-సెట్

MNCL: ప్రభుత్వ గురుకులాల్లో 5వ తరగతి, 6, 7, 8వ తరగతుల్లో బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ కోసం ఈ నెల 22న TG-సెట్ నిర్వహించనున్నట్లు కాసిపేట బాలుర గురుకుల పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్ వూటూరి సంతోష్ కుమార్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. నిర్దేశించిన కేంద్రాల్లో పరీక్ష ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. విద్యార్థులు ఆన్‌లైన్ నుంచి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

February 20, 2026 / 09:33 AM IST

వేగవంతం కానున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు

VSP: చంద్రంపాలెం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించనుంది. వంతెన నిర్మించాల్సిన ప్రాంతంలో అడ్డుగా ఉన్న భారీ వృక్షాల వల్ల పనులు నిలిచిపోగా, తాజాగా జీవీఎంసీ అధికారులు వాటిని తొలగించే ప్రక్రియ చేపట్టారు. అడ్డంకులు తొలగడంతో త్వరలోనే నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. పాదచారుల చిరకాల స్వప్నమైన ఈ ఫుట్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తుంది.

February 20, 2026 / 09:33 AM IST

బాల్య వివాహ విముక్తి ప్రచార రథం ప్రారంభం

BHNG: వివాహాలను అరికట్టడమే లక్ష్యంగా జిల్లాలో బాల్య ఏర్పాటు చేసిన ‘బాల్య వివాహ విముక్తి ప్రచార రథాన్ని భువనగిరి అదనపు కలెక్టర్ భాస్కర్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

February 20, 2026 / 09:33 AM IST