JGL: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 23న ఉపాధి కల్పన కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి తెలిపారు. ఎంజీబీ మోటార్, ఆటో ఏజెన్సీస్ కరీంనగర్ సంస్థలో ఐటీఐ, ఐటీఐ-డీజిల్ మెకానిక్, డిప్లొమా, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు, ఎంపికైన వారు కరీంనగర్లో పనిచేయాల్సి ఉంటుందని వెల్లడించారు.
ASF: విద్యా రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బెల్లంపల్లి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను నిన్న పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.
ATP: శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన 8 మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. అనంతపురం నగరంలోని ఎస్ఎల్ఎన్, శ్రీవాణి డిగ్రీ కళాశాలల్లో ముగ్గురు చొప్పున, గోరంట్లలోని ఎస్వీపీఎం కళాశాలలో ఇద్దరు విద్యార్థులను పట్టుకున్నట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ వెల్లడించారు.
హైదరాబాద్‌లోని కొత్త కార్పొరేషన్ల పరిధిలో పౌర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ‘మై క్యూర్’ యాప్‌ను ప్రవేశపెట్టింది. పారిశుధ్యం, వీధిలైట్లు, ఆస్తిపన్ను, జనన, మరణ ధృవీకరణ పత్రాల వంటి సేవలను ప్రజలు ఇంటి నుంచే పొందవచ్చు. గతంలోని మైజీహెచ్ఎంసీ యాప్ స్థానంలో వచ్చిన ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఫోటోలు, వీడియోలతో ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించారు.
KKD: సామర్లకోట మండలం కొప్పవరం జంక్షన్ వద్ద గల రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. ఎంపీ ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలపై వినతులు సమర్పించవచ్చు.
GDWL: జిల్లాలో నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉపాధి కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన శాఖ నేడు శుక్రవారం జాబ్ మేళా నిర్వహించనుంది. కలెక్టరేట్లోని ఎఫ్ 30/1లో ఉదయం 11 గంటలకు జరుగుతున్న ఈ కార్యక్రమానికి 18-35 సంవత్సరాల వయసు ఉన్న ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ చదివిన వారు హాజరు కావాల్సిందని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.శ్రీ చరణ్ దీప్ వెల్లడించారు.
AP: జనసేన ఐదోవిడత సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని ఈనెల 26న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘జెన్‌జీ సరికొత్తగా ఆలోచిస్తోంది. వారి ఆలోచనలు పార్టీకి ఉపయోగపడతాయి. యువనాయకత్వాన్ని పెంపొందించాలి’ అని సూచించారు. అలాగే, స్థానిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లను వీరమహిళలు అందిపుచ్చుకుని సభ్యత్వనమోదులో మహిళల్ని పార్టీకి దగ్గర చేయాలని అన్నారు.
NRPT: నర్వ ఆస్పిరేషన్ బ్లాక్లో జిల్లా కలెక్టర్ గురువారం విస్తృతంగా పర్యటించారు. ఈ నెల 24న నీతి ఆయోగ్ అదనపు మిషన్ డైరెక్టర్ సందర్శన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. పెద్దకడుమూర్ గ్రామంలో పీఎం శ్రీ పాఠశాల పథకం కింద కేటాయించిన వార్షిక బడ్జెట్ వ్యయం, కొనసాగుతున్న పాఠశాల కార్యక్రమాలు, టాయిలెట్ సౌకర్యాలను పరిశీలించారు.
RR: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని తొలి రోజు ఆమనగల్లులో నిన్న సాయంత్రం నిర్వహించిన ఇఫ్తార్ విందులో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. అంతకు ముందు ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న ముస్లింలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఏఎంసీ ఛైర్‌పర్సన్ గీతా నరసింహ, మున్సిపల్ ఛైర్మన్ పత్యనాయక్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీలో కొనసాగుతున్న యూఎల్బీ (నక్ష) సర్వేను జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి గురువారం తనిఖీ చేశారు. 13 మంది బృందంతో 11 వార్డుల్లోని 158 బ్లాకుల్లో ఏడీఎస్ ల్యాండ్ సర్వే చేపట్టిన విధానాన్ని పరిశీలించారు. ఇప్పటివరకు జిల్లాలో 3,854 ఇళ్లు, 1,048 వ్యవసాయ భూభాగాలు (1,024 ఎకరాలు) సర్వే పూర్తయ్యాయి.
కృష్ణా: హనుమాన్ జంక్షన్‌లో దాతల సహకారంతో నిర్మించిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నూతన కార్యాలయ భవనాన్ని శుక్రవారం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రారంభించనున్నారు. 1993 నుంచి అద్దె భవనంలో కొనసాగిన కార్యాలయానికి ఇది శాశ్వత పరిష్కారం కానుంది. హనుమాన్ జంక్షన్, వీరవల్లి, ఆత్కూరు స్టేషన్లకు ఈ కార్యాలయం కేంద్రంగా పనిచేయనున్నాయి.
ప్రకాశం: మార్కాపురంలో ఏబీ స్విచ్ ఫిక్సింగ్ పనులు చేస్తున్నారు. ఈక్రమంలో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని శాఖ ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. జవహర్ నగర్ కాలనీ, ఏపీజీబీ ఏరియా, తూర్పు వీధి, బోడపాడు రోడ్డులో సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని కోరారు.
JN: కేసీఆర్ పై కడియం శ్రీహరి చేసిన దుర్మార్గ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని జనగామ MLA డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం ఆయన మాట్లాడారు. కడియం శ్రీహరి మోసం, ద్రోహం, అవకాశవాదానికి మరోపేరని విమర్శించారు. అన్ని ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే ప్రజలే అతని రాజకీయ జీవితానికి చరమగీతం పాడతారని హెచ్చరించారు.
GNTR: పర్యావరణ పరిరక్షణ కోసం శుక్రవారం గుంటూరు నగరవ్యాప్తంగా ఈ-వ్యర్థాల సేకరణ చేపట్టనున్నట్లు జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. పాత మొబైళ్లు, చార్జర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను సాధారణ చెత్తతో కలిపి పారవేయడం వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతాయని ఆయన హెచ్చరించారు. ఈ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వీర్యం చేసేందుకు వీలుగా ప్రజలందరూ సహకరించాలన్నారు.
NZB: పిల్లల చేతికి ఫోన్ ఇచ్చే ముందు తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు పాటించాలని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. చిన్నారులు ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్లో ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉంచాలని హెచ్చరించారు. లేకపోతే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడే ప్రమాదాలు ఉన్నాయన్నారు. పిల్లలకు UPI పిన్, క్రెడిట్ కార్డు వివరాలు చెప్పకూడదని అన్నారు.