అనకాపల్లి పట్టణం నెహ్రూ చౌక్ జంక్షన్ వద్ద బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటుకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని ఫోరం ఫర్ బెటర్ ఇండియా అధ్యక్షుడు జి.సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్‌కు వినతి పత్రం అందజేశారు. కనీసం పార్కింగ్ ఏర్పాటుకు స్థలం కూడా లేని ప్రాంతంలో బారు నిర్వహణకు ఎలా అనుమతులు మంజూరు చేశారని ప్రశ్నించారు.
PDPL: పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామంలో సర్పంచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం కొత్త గేట్ వద్ద నుంచి పాత గేట్ వరకు రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్టు కొమ్మలను జేసీబీ సహాయంతో తొలగించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రధాన రహదారులు, రైల్వే గేట్లగుండా ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.
SRPT: శుభకార్యానికి వెళ్లివస్తూ అదుపు తప్పి కారు పల్టీ కొట్టిన ఘటన గురువారం సాయంత్రం నడిగూడెం,ఆర్సీపురం రహదారిలో చోటుచేసుకుంది. ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్సై గంధమల్ల అజయ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NZB: ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ గర్ల్స్ హాస్టల్లో గురువారం షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించారు. ఆపదలో ఉన్నప్పుడు డయల్ 100, టీ-సేఫ్ యాప్లను ఎలా ఉపయోగించాలో వివరించారు. మహిళల హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ఆత్మరక్షణలో ధైర్యంగా ఉండాలని అధికారులు సూచించారు.
NLG: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 57,353 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 103 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం ఉదయం 8 గంటలు వరకు ఎంపీ క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు టీడీపీ జిల్లా కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. అనంతరం మధ్యాహ్నం నుంచి పార్లమెంట్ పరిధిలో పలు రకాల కార్యక్రమంలో పాల్గొంటారని ఎంపీ కార్యాలయ వర్గాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపాయి.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాష్ట్ర ఐటిడిపి ఉపాధ్యక్షులు రాటకొండ రాజేష్ జన్మదిన వేడుకలు గురువారం రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, పూలమాలలు, శాలువాలతో సన్మానించి, పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాష్ట్ర ఐటిడిపి ఉపాధ్యక్షులు రాటకొండ రాజేష్ జన్మదిన వేడుకలు గురువారం రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, పూలమాలలు, శాలువాలతో సన్మానించి, పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
KNR: వచ్చే నెల 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యాశాఖ సిబ్బందికి పరీక్షలు ముగిసే వరకు సెలవులు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి ప్రకటించారు. గురువారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ప్రతి వారం ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన పాఠశాలలను తప్పనిసరిగా సందర్శించి, 100% ఉత్తీర్ణత సాధించేలా చూడాలని సూచించారు.
కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేయనున్నట్లు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ భాస్కర్ తెలిపారు. బాన్సువాడ (2) ఎల్లారెడ్డి (3) మద్నూర్ (1) పిట్లం (1) కేంద్రాల్లో ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 26వ తేదీన తమ అసలు ధ్రువపత్రాలతో కలెక్టరేట్‌లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు.
VSP: మధురవాడ సబ్‌స్టేషన్ పరిధి చంద్రంపాలెం 11KV ఫీడర్‌పై ఫుట్ బ్రిడ్జి పనుల దృష్ట్యా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు జోన్-3 ఏఈ సింహాచలం నాయుడు తెలిపారు. చంద్రంపాలెం, మధురవాడ మెయిన్ రోడ్, దుర్గ నగర్-1, దుర్గ నగర్-2, కృష్ణ నగర్ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
PPM: వంగర మండలంలోని రుషింగిలో దుర్గా షిరిడిసాయిబాబా ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 22వ తేదీన ఉత్త రాంధ్ర స్థాయి కోలాటం పోటీలు నిర్వహిస్తున్నట్లు ధర్మకర్త మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. టీం వివరాలు నమోదు కొరకు 8309487836 నంబర్‌ను సంప్రదించాలన్నారు. ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
KDP: పులివెందుల పట్టణంలో ఈ నెల 22వ తేదీ నుంచి విద్యార్థులకు క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించనున్నట్లు పీఈటీలు ప్రభాకర్, రవికుమార్ తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ.. పులివెందుల స్థానిక న్యాక్ బిల్డింగ్ సమీపంలో ఉన్న సత్రం బడి ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు.
TG: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్) పరిధిలోని పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు నిర్వహిస్తామని టాస్ సంచాలకుడు పీవీ శ్రీహరి తెలిపారు. ఉదయం, సాయంత్రం పరీక్షలు ఉంటాయని అన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు నిర్వహిస్తామని చెప్పారు.
JGL: కోరుట్ల-అయిలాపూర్ మీదుగా యూసుఫనగర్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్‌పై ముగ్గురు యువకులు దాడి చేసిన ఘటన గురువారం చోటుచేసుకుంది. అయిలాపూర్లో రోడ్డుకు అడ్డంగా నిలిపిన ద్విచక్ర వాహనాన్ని తొలగించమని డ్రైవర్ చెప్పడంతో వాగ్వివాదం ఏర్పడి, యువకులు దాడికి పాల్పడ్డారని ఎస్సై చిరంజీవి తెలిపారు. కండక్టర్ ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.