• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆస్పిరేషన్ బ్లాక్ అభివృద్ధిపై కలెక్టర్ దృష్టి

NRPT: నర్వ ఆస్పిరేషన్ బ్లాక్లో జిల్లా కలెక్టర్ గురువారం విస్తృతంగా పర్యటించారు. ఈ నెల 24న నీతి ఆయోగ్ అదనపు మిషన్ డైరెక్టర్ సందర్శన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. పెద్దకడుమూర్ గ్రామంలో పీఎం శ్రీ పాఠశాల పథకం కింద కేటాయించిన వార్షిక బడ్జెట్ వ్యయం, కొనసాగుతున్న పాఠశాల కార్యక్రమాలు, టాయిలెట్ సౌకర్యాలను పరిశీలించారు.

February 20, 2026 / 06:36 AM IST

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

RR: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని తొలి రోజు ఆమనగల్లులో నిన్న సాయంత్రం నిర్వహించిన ఇఫ్తార్ విందులో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. అంతకు ముందు ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న ముస్లింలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఏఎంసీ ఛైర్‌పర్సన్ గీతా నరసింహ, మున్సిపల్ ఛైర్మన్ పత్యనాయక్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

February 20, 2026 / 06:35 AM IST

నక్ష సర్వే తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ సంధ్యారాణి

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీలో కొనసాగుతున్న యూఎల్బీ (నక్ష) సర్వేను జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి గురువారం తనిఖీ చేశారు. 13 మంది బృందంతో 11 వార్డుల్లోని 158 బ్లాకుల్లో ఏడీఎస్ ల్యాండ్ సర్వే చేపట్టిన విధానాన్ని పరిశీలించారు. ఇప్పటివరకు జిల్లాలో 3,854 ఇళ్లు, 1,048 వ్యవసాయ భూభాగాలు (1,024 ఎకరాలు) సర్వే పూర్తయ్యాయి.

February 20, 2026 / 06:33 AM IST

నేడు సీఐ నూతన కార్యాలయం ప్రారంభం

కృష్ణా: హనుమాన్ జంక్షన్‌లో దాతల సహకారంతో నిర్మించిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నూతన కార్యాలయ భవనాన్ని శుక్రవారం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రారంభించనున్నారు. 1993 నుంచి అద్దె భవనంలో కొనసాగిన కార్యాలయానికి ఇది శాశ్వత పరిష్కారం కానుంది. హనుమాన్ జంక్షన్, వీరవల్లి, ఆత్కూరు స్టేషన్లకు ఈ కార్యాలయం కేంద్రంగా పనిచేయనున్నాయి.

February 20, 2026 / 06:32 AM IST

మార్కాపురంలో నేడు పవర్ కట్

ప్రకాశం: మార్కాపురంలో ఏబీ స్విచ్ ఫిక్సింగ్ పనులు చేస్తున్నారు. ఈక్రమంలో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని శాఖ ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. జవహర్ నగర్ కాలనీ, ఏపీజీబీ ఏరియా, తూర్పు వీధి, బోడపాడు రోడ్డులో సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని కోరారు.

February 20, 2026 / 06:32 AM IST

ఎమ్మెల్యే కడియం మోసానికి మరో పేరు: ఎమ్మల్యే

JN: కేసీఆర్‌ పై కడియం శ్రీహరి చేసిన దుర్మార్గ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని జనగామ MLA డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం ఆయన మాట్లాడారు. కడియం శ్రీహరి మోసం, ద్రోహం, అవకాశవాదానికి మరోపేరని విమర్శించారు. అన్ని ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే ప్రజలే అతని రాజకీయ జీవితానికి చరమగీతం పాడతారని హెచ్చరించారు.

February 20, 2026 / 06:31 AM IST

నేడు గుంటూరులో ఈ-వ్యర్థాల సేకరణకు ప్రత్యేక డ్రైవ్

GNTR: పర్యావరణ పరిరక్షణ కోసం శుక్రవారం గుంటూరు నగరవ్యాప్తంగా ఈ-వ్యర్థాల సేకరణ చేపట్టనున్నట్లు జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. పాత మొబైళ్లు, చార్జర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను సాధారణ చెత్తతో కలిపి పారవేయడం వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతాయని ఆయన హెచ్చరించారు. ఈ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వీర్యం చేసేందుకు వీలుగా ప్రజలందరూ సహకరించాలన్నారు.

February 20, 2026 / 06:31 AM IST

పిల్లలకు ఫోన్ ఇచ్చే ముందు ఇవి పాటించాల్సిందే: సీపీ

NZB: పిల్లల చేతికి ఫోన్ ఇచ్చే ముందు తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు పాటించాలని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. చిన్నారులు ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్లో ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉంచాలని హెచ్చరించారు. లేకపోతే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడే ప్రమాదాలు ఉన్నాయన్నారు. పిల్లలకు UPI పిన్, క్రెడిట్ కార్డు వివరాలు చెప్పకూడదని అన్నారు.

February 20, 2026 / 06:31 AM IST

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

VSP: వేపగుంట మండలం విరాట గర్ 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలోని ఫీడర్ల నిర్వహణ పనుల కారణంగా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ బి.సింహాచలం నాయుడు తెలిపారు. దీనివల్ల బాలాజీగార్డెన్స్, శ్రీనివాసనగర్, గొల్లనారాయణ పురం, దత్తసాయినగర్, సింహాద్రినగర్, తదితర ప్రాంతాల్లో ఈ అంతరాయం ఏర్పడుతుందన్నారు.

February 20, 2026 / 06:31 AM IST

రగ్బీ జట్టు కోచ్‌గా వెంకట్

AKP: చెన్నైలో నేటి నుంచి 23 వరకు జరిగే ‘అండర్-15 సౌత్ జోన్ ఖేలో ఇండియా రగ్బీ’ జట్టు కోచ్‌గా అచ్యుతాపురానికి చెందిన వెంకట్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని రగ్బీ అసోసియేషన్ ఏపీ కార్యదర్శి రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి నాగ వెంకటరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం వెంకట్ అనకాపల్లి ప్రైవేట్ స్కూల్లో వ్యాయామం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నట్లు తెలిపారు.

February 20, 2026 / 06:30 AM IST

‘టీ-సేఫ్’ యాప్‌ను ప్రతి ఒక్క మహిళ వాడాలి: RSI

WGL: పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ITI కళాశాలలో గురువారం సాయంత్రం షీ టీం RSI స్వాతి ఆధ్వర్యంలో విద్యార్థినులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. స్వాతి మాట్లాడుతూ.. మహిళలపై పెరుగుతున్న సైబర్ నేరాలు, అఘాయిత్యాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ప్రయాణాల్లో భద్రత కోసం ‘టీ-సేఫ్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి వినియోగించాలని తెలిపారు.

February 20, 2026 / 06:26 AM IST

సాలూరు లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

PPM: సాలూరు 11KV ఫీడర్ల వద్ద చెట్లుకొమ్మలు తొలగించే కార్యక్రమం నిర్వహిస్తున్నందున శుక్రవారం ఉదయం 8 నుంచి 2 వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుందని EE గోపాల్‌ నాయుడు గురువారం తెలిపారు. ఈ మేరకు శ్రీనివాస కాలనీ నుంచి జైపూర్‌ రోడ్డు వరకు, బంగారమ్మపేట, మరిపల్లి నుంచి రేగాపువలస వరకు విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలని కోరారు.

February 20, 2026 / 06:26 AM IST

జిల్లాకు గర్వకారణంగా నిలిచిన దుర్గ భవాని

BDK: అశ్వాపురం మండలం జగ్గారం గ్రామానికి చెందిన దుర్గ భవాని రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచి జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి దివ్యాంగుల క్రీడాపోటీల్లో లెమన్ అండ్ స్పూన్ విభాగంలో రెండవ స్థానం సాధించింది. గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆమెను అభినందించి ప్రశంస పత్రం అందజేశారు.

February 20, 2026 / 06:25 AM IST

2 రోజులు విద్యుత్ సరఫరాకు అంతరాయం

E.G: కొవ్వూరు మండలం వేములూరులో కొత్త విద్యుత్ లైన్ నిర్మాణ పనుల కారణంగా శుక్ర, శనివారాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని ఈఈ నారాయణ అప్పారావు తెలిపారు. ఈ 2రోజులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అగ్రికల్చర్ సర్వీసులకు సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

February 20, 2026 / 06:24 AM IST

కృష్ణాపురంలో కుట్టుమిషన్లు, స్ప్రే పంపుల పంపిణీ

KRNL: కోడుమూరు(M) కృష్ణాపురంలో మూడో విడత కుట్టుమిషన్లు, తైవాన్ స్ప్రే పంపుల పంపిణీ కార్యక్రమం జరిగింది. KDCC బ్యాంక్ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, MLA దస్తగిరి సహకారంతో మహిళలకు సబ్సిడీపై కుట్టు మిషన్లు, రైతులకు తైవాన్ స్ప్రేయర్లు అందజేశారు. మహిళలు స్వయం ఉపాధి సాధించాలని, రైతులు ఆధునిక పరికరాలతో దిగుబడులు పెంచుకోవాలని ఈ సందర్భంగ నాయకులు ఆకాంక్షించారు.

February 20, 2026 / 06:24 AM IST