• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఘనంగా రాటకొండ రాజేష్ జన్మదిన వేడుకలు

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాష్ట్ర ఐటిడిపి ఉపాధ్యక్షులు రాటకొండ రాజేష్ జన్మదిన వేడుకలు గురువారం రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, పూలమాలలు, శాలువాలతో సన్మానించి, పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

February 20, 2026 / 05:35 AM IST

ఘనంగా రాటకొండ రాజేష్ జన్మదిన వేడుకలు

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాష్ట్ర ఐటిడిపి ఉపాధ్యక్షులు రాటకొండ రాజేష్ జన్మదిన వేడుకలు గురువారం రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, పూలమాలలు, శాలువాలతో సన్మానించి, పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

February 20, 2026 / 05:35 AM IST

‘పదో తరగతి పరీక్షలు ముగిసే వరకు సెలవుల్లేవు’

KNR: వచ్చే నెల 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యాశాఖ సిబ్బందికి పరీక్షలు ముగిసే వరకు సెలవులు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి ప్రకటించారు. గురువారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ప్రతి వారం ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన పాఠశాలలను తప్పనిసరిగా సందర్శించి, 100% ఉత్తీర్ణత సాధించేలా చూడాలని సూచించారు.

February 20, 2026 / 05:34 AM IST

వైద్యుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేయనున్నట్లు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ భాస్కర్ తెలిపారు. బాన్సువాడ (2) ఎల్లారెడ్డి (3) మద్నూర్ (1) పిట్లం (1) కేంద్రాల్లో ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 26వ తేదీన తమ అసలు ధ్రువపత్రాలతో కలెక్టరేట్‌లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు.

February 20, 2026 / 05:33 AM IST

నేడు మధురవాడలో పవర్ కట్

VSP: మధురవాడ సబ్‌స్టేషన్ పరిధి చంద్రంపాలెం 11KV ఫీడర్‌పై‌ ఫుట్ బ్రిడ్జి పనుల దృష్ట్యా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు జోన్-3 ఏఈ సింహాచలం నాయుడు తెలిపారు. చంద్రంపాలెం, మధురవాడ మెయిన్ రోడ్, దుర్గ నగర్-1, దుర్గ నగర్-2, కృష్ణ నగర్ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

February 20, 2026 / 05:28 AM IST

ఈనెల 22న ఉత్తరాంధ్ర స్థాయి కోలాటం పోటీలు

PPM: వంగర మండలంలోని రుషింగిలో దుర్గా షిరిడిసాయిబాబా ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 22వ తేదీన ఉత్త రాంధ్ర స్థాయి కోలాటం పోటీలు నిర్వహిస్తున్నట్లు ధర్మకర్త మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. టీం వివరాలు నమోదు కొరకు 8309487836 నంబర్‌ను సంప్రదించాలన్నారు. ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

February 20, 2026 / 05:26 AM IST

22 నుంచి క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు

KDP: పులివెందుల పట్టణంలో ఈ నెల 22వ తేదీ నుంచి విద్యార్థులకు క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించనున్నట్లు పీఈటీలు ప్రభాకర్, రవికుమార్ తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ.. పులివెందుల స్థానిక న్యాక్ బిల్డింగ్ సమీపంలో ఉన్న సత్రం బడి ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు.

February 20, 2026 / 05:25 AM IST

ఏప్రిల్‌ 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు 

TG: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్) పరిధిలోని పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు నిర్వహిస్తామని టాస్ సంచాలకుడు పీవీ శ్రీహరి తెలిపారు. ఉదయం, సాయంత్రం పరీక్షలు ఉంటాయని అన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు నిర్వహిస్తామని చెప్పారు.

February 20, 2026 / 05:03 AM IST

ఆర్టీసీ సిబ్బందిపై దాడి.. ముగ్గురిపై కేసు నమోదు

JGL: కోరుట్ల-అయిలాపూర్ మీదుగా యూసుఫనగర్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్‌పై ముగ్గురు యువకులు దాడి చేసిన ఘటన గురువారం చోటుచేసుకుంది. అయిలాపూర్లో రోడ్డుకు అడ్డంగా నిలిపిన ద్విచక్ర వాహనాన్ని తొలగించమని డ్రైవర్ చెప్పడంతో వాగ్వివాదం ఏర్పడి, యువకులు దాడికి పాల్పడ్డారని ఎస్సై చిరంజీవి తెలిపారు. కండక్టర్ ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.

February 20, 2026 / 05:01 AM IST

‘సాదా బైనమా భూ సమస్యల పరిష్కారానికి చర్యలు’

JGL: పెగడపల్లి మండలంలో సాదా బైనామా భూ సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్ ఆనంద్ కుమార్ తెలిపారు. మండలంలో మొత్తం 1840 సాదా బైనామా దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఇందులో నుంచి 1791 దరఖాస్తులను పరిష్కారం కోసం ఆర్డీవో కార్యాలయానికి పంపించామని, 49 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.

February 20, 2026 / 05:00 AM IST

రైలు ఢీకొని మత్స్యకారుడు మృతి

NZB: నవీపేట్ మండలంలోని యంచ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు పోశెట్టి చేపలు పట్టుకొని తిరిగి వస్తుండగా రైలు పట్టాలను దాటే సమయంలో దేవి ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పోశెట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

February 20, 2026 / 04:54 AM IST

ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యం: SP

KDP: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పోలీసులను కడప జిల్లా SP ఆదేశించారు. గురువారం జరిగిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహిళా భద్రత, గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రౌడీషీటర్లపై నిఘా పెంచాలని, మట్కా, బెట్టింగ్, ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

February 20, 2026 / 04:52 AM IST

కడప జిల్లాలో దారుణం..భర్తను గొడ్డలితో నరికిన భార్య

KDP: పెండ్లిమర్రి మండలం నల్లయ్యగారి పల్లెలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. రోజూ మద్యం తాగి వేధిస్తున్న భర్త సిద్ధారెడ్డిపై భార్య సుహాసిని సహనం కోల్పోయి, గొడ్డలితో గొంతునరికి హత్య చేసింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. CI చల్లని దొర, ఎస్సై తులసి నాగప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 20, 2026 / 04:45 AM IST

దారుణం.. భర్తను గొడ్డలితో నరికిన భార్య

KDP: పెండ్లిమర్రి మండలం నల్లయ్యగారి పల్లెలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. రోజూ మద్యం తాగి వేధిస్తున్న భర్త సిద్ధారెడ్డిపై భార్య సుహాసిని సహనం కోల్పోయి, గొడ్డలితో గొంతునరికి హత్య చేసింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. CI చల్లని దొర, ఎస్సై తులసి నాగప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 20, 2026 / 04:45 AM IST

లక్కీరెడ్డిపల్లి గంగమ్మ తల్లి హుండీ ఆదాయం రూ. 17, 96, 420

అన్నమయ్య: లక్కీరెడ్డిపల్లి మండలం అనంతపురం గంగమ్మ జాతర 3 రోజుల హుండీ లెక్కింపు గురువారం పూర్తయింది. ఈ లెక్కింపు ప్రకారం మొత్తం  రూ.17, 96,420 ఆదాయం వచ్చింది. ఈ మొత్తాన్ని ఆలయ ఖాతాకు జమ చేయనున్నారు. ఆలయ సిబ్బంది, పూజారులు ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు ఇచ్చిన సహకారం ఆలయ నిర్వహణకు, పూజా కార్యక్రమాల కోసం ఉపయోగపడనుందని ఆలయ ఈవో శ్రీనివాసులు తెలిపారు.

February 20, 2026 / 04:34 AM IST