• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పరీక్ష నిర్వహకులతో DEO సమావేశం

ADB: మార్చిలో జరిగే పదో తేదీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్, విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ తెలిపారు. 10వ తరగతి పరీక్షల నిర్వాహకులు చీఫ్ సూపరింటెండెంట్ ఆఫీసర్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్స్‌తో సమావేశం నిర్వహించారు. పదవ పరీక్ష ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించి సలహా సూచనలు చేశారు.

February 20, 2026 / 07:02 AM IST

NITCలో ఉద్యోగాలు.. ఇవాళే లాస్ట్

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాలికట్(NITC)లో 15 అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. ఆర్ట్స్ ఆఫ్ సోషల్ సైన్సెస్, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ తదితర విభాగాల్లో ఖాళీలు ఉండగా.. PhD ఉత్తీర్ణత గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 45-50 ఏళ్ల మధ్య ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి. 

February 20, 2026 / 07:02 AM IST

రైతుల సమస్యలపై గోడపత్రిక ఆవిష్కరణ

NTR: తిరువూరులో కౌలు రైతుల సమస్యలపై రైతులు గోడపత్రికను నిన్న ఆవిష్కరించారు. రైతు సంఘం నేతలు మాట్లాడుతూ.. భూమి లేని కౌలు రైతులను ప్రభుత్వం వెంటనే గుర్తించి, అన్నదాత సుఖీభవ పథకంలో సాగు ఖర్చుల కోసం కౌలు రైతులకు రూ.20,000 ఇవ్వాలన్నారు. ఈనెల 23, 24 తేదీలలో జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే 36 గంటల దీక్షలకు కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

February 20, 2026 / 07:02 AM IST

మంత్రి లోకేష్ ను కలిసిన ఎమ్మెల్యే ఉగ్ర

ప్రకాశం: ఉండవల్లిలో విద్యాశాఖ మంత్రి లోకేశ్ గురువారం రాత్రి నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఎమ్మెల్యే ఉగ్ర కుటుంబ సభ్యులను మంత్రికి పరిచయం చేశారు. ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు.

February 20, 2026 / 07:02 AM IST

మచిలీపట్నంలో కాంట్రాక్ట్ పోస్టులకు ఇంటర్వ్యూలు

కృష్ణా: కేంద్రీయ విద్యాలయంలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను కాంట్రాక్ట్ లో భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ మహ్మద్ ఆసిఫ్ హుస్సేన్ వెల్లడించారు. ఈనెల 23న ఇంగ్లీషు, హిందీ, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్ PGT పోస్టులకు, 24న కంప్యూటర్ ఆపరేటర్, వృత్తి ఉపాధ్యాయుడు, క్రీడల కోచ్, కౌన్సిలర్, స్పెషల్ ఎడ్యుకేటర్, నర్సు పోస్టులకు మౌఖిక పరీక్షలు ఉంటయి.

February 20, 2026 / 07:01 AM IST

నేడు అల్పపీడనం.. ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన

CTR: హిందూ మహాసముద్రంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రేపటి నుంచి దక్షిణ తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. రాయలసీమలోనూ వానలు పడతాయని హెచ్చరించింది. దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో ఈనెల 22వ తేదీ నుంచి వర్షాలకు ఆస్కారం ఉందని అంచనా వేసింది.

February 20, 2026 / 06:59 AM IST

కలెక్టర్‌ను కలిసిన జిల్లా రెడ్ క్రాస్ నూతన కార్యవర్గం

NGKL: జిల్లా కేంద్రంలో గురువారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా రెడ్ క్రాస్ నూతన కార్యవర్గం గురువారం మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ సంతోష్ ను కలిశారు. అనంతరం రెడ్ క్రాస్ కార్యకలాపాలకు జిల్లా అధికారులు సహకారం అందించాలని విన్నవించారు. జిల్లాలో రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, విపత్తు సేవా కార్యక్రమాలు చేపట్టాతామని చెప్పారు.

February 20, 2026 / 06:57 AM IST

కందుకూరులో ఆటో బోల్తా.. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు

NLR: కందుకూరు పట్టణంలోని శివారులో దూబగుంట ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో గురువారం ఒక ఆటో బోల్తా పడింది. బొప్పాయి లోడుతో వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు పక్కకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద సంఘటనలో ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. బైక్ పై ఉన్నవారు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని సురక్షితంగా బయటపడ్డారు.

February 20, 2026 / 06:49 AM IST

నేడు సెమీస్‌లో లంకతో భారత్ ఢీ

ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026 టోర్నీలో భాగంగా ఇవాళ జరిగే తొలి సెమీస్‌లో భారత్, శ్రీలంక ఢీకొననున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు జరిగే ఈ మ్యాచ్‌కు బ్యాంకాక్ టెర్థాయ్ గ్రౌండ్ వేదిక కానుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు ఇదే మైదానంలో బంగ్లా-A, పాక్-A మధ్య రెండో సెమీస్ జరగనుంది.

February 20, 2026 / 06:47 AM IST

‘మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే సహించేది లేదు’

E.G: ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలు, హాస్టళ్లలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే సహించేది లేదని MLA మద్దిపాటి వెంకటరాజు హెచ్చరించారు. గురువారం అధికారులతో నిర్వహించిన కాన్ఫరెన్స్ కాల్లో ఆయన మాట్లాడారు. భోజనం నాణ్యతపై ఉన్నతాధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. తాను ఆకస్మికంగా పాఠశాలలను సందర్శిస్తానన్నారు

February 20, 2026 / 06:46 AM IST

మడూరు జడ్పీ పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు..!

MDK: చిన్న శంకరంపేట మండలంలోని మడూరు జడ్పీ ఉన్నత పాఠశాలకు సర్పంచ్ గుడి కాడి దివ్యభారతి లింగం గౌడ్ గురువారం నాలుగు సీసీ కెమెరాలు అందించారు. ఇవి విద్యార్థులకు క్రమశిక్షణ, అలాగే రక్షణకు తోడ్పడతాయని తెలిపారు. కెమెరాలు ఏర్పాటు చేసిన సర్పంచ్ దివ్యభారతికీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

February 20, 2026 / 06:46 AM IST

దిలీప్ కుటుంబానికి పోలీసుల అండ

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం కంచర్ల గ్రామానికి చెందిన 2009 బ్యాచ్ పోలీస్ కానిస్టేబుల్ దిలీప్ అకాల మరణం ఆ బ్యాచ్ సభ్యులను కలచివేసింది. గురువారం దిలీప్ కుటుంబాన్ని పరామర్శించిన తోటి బ్యాచ్‌మేట్స్, వారి పిల్లల చదువుల కోసం రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గంపల సతీష్, గొర్రె తిరుపతి, ఆకుల సతీష్, ముజాల కైలాష్, అనిల్, తీగల మహేష్ ఆధ్వర్యంలో ఈ నగదును అందజేశారు.

February 20, 2026 / 06:43 AM IST

‘హే బలవంత్’ రివ్యూ&రేటింగ్

సుహాస్, శివానీ నగరం జంటగా నటించిన చిత్రం ‘హే బలవంత్’. చిన్నప్పటి నుంచి కృష్ణ(సుహాస్)కి తన తండ్రి బలవంత్(నరేష్) చేసే బిజినెస్‌పై ఆసక్తి. కానీ అతడి తండ్రి అంగీకరించడు. బలవంత్‌కి హార్ట్ స్ట్రోక్ రావడంతో వ్యాపారం తానే చూసుకుంటానని ఆఫీసుకి వెళ్తాడు. తండ్రి చేసే రహస్య వ్యాపారం ఏంటనేది కథాంశం. కామెడీతో మెప్పించినప్పటికీ.. సెకండాఫ్ కాస్త స్లోగా సాగడం మైనస్. రేటింగ్ 2.5/5.

February 20, 2026 / 06:43 AM IST

గుంపర్రులో వైసీపీ కార్యవర్గ సమావేశం

W.G: గుంపర్రు గ్రామ వైసీపీ కార్యవర్గ సమావేశం గురువారం నియోజకవర్గం ఇన్‌ఛార్జి గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ, మండల అనుబంధ కమిటీల నియామకం, పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం చేపట్టాల్సిన చర్యలు, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. గ్రామ అధ్యక్షుడిగా సుబ్బారావును ఎన్నుకున్నారు.

February 20, 2026 / 06:40 AM IST

ప్రైవేటు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

JGL: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 23న ఉపాధి కల్పన కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి తెలిపారు. ఎంజీబీ మోటార్, ఆటో ఏజెన్సీస్ కరీంనగర్ సంస్థలో ఐటీఐ, ఐటీఐ-డీజిల్ మెకానిక్, డిప్లొమా, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు, ఎంపికైన వారు కరీంనగర్లో పనిచేయాల్సి ఉంటుందని వెల్లడించారు.

February 20, 2026 / 06:40 AM IST