ELR: ముదినేపల్లి మండలం సింగరాయపాలెంకు చెందిన సతీశ్ (25) గురువారం ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. కాళ్లలో చెరువు పనులు చేస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సతీశ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఏడాది క్రితమే వివాహమైన సతీశ్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
BHNG: జిల్లాలోని విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కి వివిధ సమస్యలపై గురువారం వినతి పత్రం అందజేశారు. భువనగిరి మున్సిపల్ పరిధి నుండి 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి కార్యాలయాలలో పనిచేస్తున్నా వారికి 13 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని అన్నారు.
E.G: సీతానగరం మండలంలోని పలు గ్రామాలకు శుక్రవారం నుంచి ఈ నెల 23 వరకూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఎస్ఈ నటరాజన్ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీతానగరం, సింగవరం పంచాయతీలోని నాగరత్నం కాలనీ, రఘుదేవ పురాల్లో గృహ, వాణిజ్య, వ్యవసాయ వినియోగగదారులకు విద్యుత్‌ను నిలిపివేస్తామన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలన్నారు.
KRNL: ఆదోని శివారు సిరుగుప్ప సర్కిల్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన విరుపాక్షి గాయపడ్డారు. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు టిప్పర్‌ను స్వాధీనం చేసుకుని కేసునమోదు చేసినట్లు సీఐ అబ్దుల్ తెలిపారు.
PDPL: పత్తి రైతులు ఆందోళన చెందవద్దని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ఇవాళ పత్తి కొనుగోళ్లు ముగించాలని అధికారులు భావించగా, రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఈ గడువును మార్చి 15 వరకు పొడిగించాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీని కోరినట్లు చెప్పారు. ఈ మేరకు కోటపల్లి ప్రాంత పత్తి రైతులు సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
CTR: గ్యాస్ పంపిణీలో సంతృప్తి శాతం పెంచాలి అని జేసీ రాజేంద్రన్ హెచ్చరించారు. నిన్న సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లో గ్యాస్ సిలిండర్ల సరఫరా డీలర్లు, నిర్వాహకులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. జేసీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వీబీఆర్ఎస్ సర్వేలో గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ప్రజల సంతృప్తి శాతంలో జిల్లా చాలా వెనుకబడి ఉందన్నారు.
కోనసీమ: రహదారి ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని నివారించేందుకు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రావులపాలెం సీఐ సిహెచ్. విద్యాసాగర్ హెచ్చరించారు. గురువారం రాత్రి ఆలమూరు సెంటర్‌లో ఎస్సై జి. నరేష్‌తో కలిసి హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేని ప్రయాణం మృత్యుపాశమని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
TG: HYD బాలాపూర్‌లో ముగ్గురు వ్యక్తులపై దాడి జరిగింది. 20 మంది దుండగులు వచ్చి ముగ్గురిపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో వారికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. పాత కక్షల కారణంగానే ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
BPT: చీరాల మండలంలోని కొత్తపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని దళితనగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. రహదారిపై ఆడుకుంటున్న 18 నెలల చిన్నారి సాయి దుర్గపై ప్రమాదవశాత్తు ఆటో వెళ్లినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన పాపను ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అన్నమయ్య: మదనపల్లెలో బాలికపై అత్యాచారం, హత్య కేసులో A2 ఎందుకురాలు తలారి అంజలి ఇంటి వద్ద పోలీసులు ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో,కేసులోని కీలక ఆధారాలు చెరిగిపోకుండా SP ధీరజ్ DSP మహేంద్ర ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. దర్యాప్తు వేగవంతం చేసేందుకు పోలీసులు ఇంటిని తమ ఆధీనంలో ఉంచారు.
KRNL: ఆలూరు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 20న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి టీడీపీ ఆలూరు ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. SSC నుంచి PG వరకు అర్హత కలిగిన 18–35 ఏళ్ల యువత పాల్గొనవచ్చుని ఇన్ ఛార్జ్ తెలిపారు.
CTR: మురకంబట్టు సమీపంలోని మైనారిటీ గురుకులంలో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ 5, 6, 7, 8వ తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ నజీర్బాను నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తిగల ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు https://apcfss.in వెబ్‌సైట్ ద్వారా మార్చి 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ADB: అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర సమాచార అండ్ ప్రజా సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక తెలిపినట్లు ఆదిలాబాద్ ఇంఛార్జ్ DPRO విష్ణువర్ధన్ తెలిపారు. దరఖాస్తు జారీ ప్రక్రియ రోలింగ్ ప్రాతిపదికన కొనసాగుతుందన్నారు. దరఖాస్తు దారులు ipr.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.
NDL: బనగానపల్లె మండల పరిధిలో శైవ పుణ్యక్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో పాల్గొనమాసం శుక్రవారం సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. ఆలయ ఈవో పాండురంగారెడ్డి వేద పండితులు ఆధ్వర్యంలో స్వామికి రుద్రాభిషేకం కుంకుమార్చన ప్రత్యేక పుష్పాలంకరణలో అలంకరించి మహా మంగళ హారతి ఇచ్చారు. అలాగే నందవరం చౌడేశ్వరి మాతకు విశేష పూజలు చేశారు.
SKLM: దివ్యాంగుల సంక్షేమం, వారి సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రతి నెల మూడవ శుక్రవారం నిర్వహించే ‘స్వాభిమాన్’ వేదికను శుక్రవారం నిర్వహించనున్నట్లు దివ్యాంగ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బొడ్డేపల్లి శైలజ తెలిపారు. ఈ మేరకు ఆమె గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు.