CTR: జిల్లాలో ముస్లింలు ఇవాళ ఉదయం నుంచి రంజాన్ మాస ఉపవాస దీక్షలు ప్రారంభించారు. నిన్న సాయంత్రం నెలవంక కనిపించడంతో ఉపవాస దీక్షలు ప్రారంభిస్తున్నట్లు మత పెద్దలు వెల్లడించారు. నెల రోజులపాటు కఠోర దీక్షలు చేపట్టనున్నారు. మసీదుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీక్షలు నిర్వహించే వారి కోసం గంట ముందే వెళ్లేలా ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.
BDK: పేద విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లో చేరి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు పొందాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జిల్లాలోని ప్రతి పదో తరగతి విద్యార్థులు సమీప ప్రభుత్వ జూనియర్ కళాశాలతో అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు. అందుబాటులో కోర్సులు, సౌకర్యాల వివరాలతో కరపత్రాలు పంపిణీ చేయాలని సూచించారు.

SRPT: మునగాల రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను వెంటనే పూర్తి చేసుకోవాలి మునగాల AO రాజు గురువారం ఒక ప్రకటనలో సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే పీఎం కిసాన్, పంట బీమా, ఇతర ప్రభుత్వ రాయితీలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు. రైతులు తమ క్షస్టర్ ఏఈవోలను సంప్రదించి ఈ ప్రక్రియను త్వరగా ముగించాలని రైతులను కోరారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ శోభ సంతరించింది. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభంతో ముస్లింలు ఉపవాస దీక్షలు ప్రారంభించారు. మసీదులను విద్యుదీపాలతో అలంకరించి, నెల రోజులపాటు తరావీ నమాజ్లు నిర్వహించనున్నారు. ముస్లిం ఉద్యోగులకు పనివేళల్లో వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తిరుపతి మహిళా పోలీస్ స్టేషన్‌లో నమోదైన వరకట్న వేధింపుల కేసులో భర్తకు 6 నెలల జైలుశిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ తిరుపతి నాలుగో అదనపు మున్సిపల్ కోర్టు తీర్పు ఇచ్చింది. 2013లో వివాహం తర్వాత వేధింపులు పెరగడంతో బాధితురాలు 2018లో ఫిర్యాదు చేయగా, దర్యాప్తులో ఆరోపణలు నిరూపితమవడంతో నిన్న కోర్టు తీర్పునిచింది.
NLR: బుచ్చిరెడ్డిపాళెం పురపాలక పరిధిలో అక్రమ కుళాయి కనెక్షన్లు ఎక్కువగా ఉన్నాయని విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. పట్టణ వ్యాప్తంగా 9,632 గృహాలు ఉండగా 4,201 కుళాయిలు కనెక్షన్లు ఉన్నాయి. అక్రమ కనెక్షన్లు ఉన్నాయని అధికారుల సర్వేలో తేటతెల్లమైంది. ప్రత్యేక డ్రైవ్‌లో వాటిని గుర్తించామని క్రమబద్ధీకరించేలా చర్యలు చేపడతామని నగర కమిషనర్ బాలకృష్ణ వెల్లడించారు.

MBNR: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎస్సీ స్టడీ సర్కిల్ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇస్తోంది అని డైరెక్టర్ కే.శ్రీ తెలిపారు. గ్రూప్-1, 2, 3, 4, SSC, RRB, Banking, SI & PC అభ్యర్థులు ఈ నెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 1న MBNR NTR డిగ్రీ కళాశాలలో ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. 89773 40006 లేదా www.tsstudycircle.co.inను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
BDK: నాయి బ్రహ్మణ సంఘం నాయకులు, చిరకాల మిత్రుడు గుడివాడ నాగేశ్వరరావు మృతి పట్ల ఎమ్మెల్యే కోరం కనకయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం వారి కుటుంబ సభ్యులను ఎంఎల్ఏ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్ట సమయంలో ఉన్న వారి కుటుంబానికి కాంగ్రెస్ శ్రేణులు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

MDK: వెల్దుర్తి మండల పరిధిలోని ఆరెగూడెంలో బుధవారం రాత్రి గుండెపోటుతో తిరుపతి (23) అనే యువకుడు మృతి చెందాడు. రాత్రి 11:30 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో మరణించినట్లు స్థానికులు తెలిపారు. అందరితో కలుపుగోలుగా ఉండే తిరుపతి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు రావడం గ్రామస్థులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.