BDK: దుమ్ముగూడెం మండలం లక్ష్మీ నగర్‌లో నూతన SVK ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫంక్షన్ హాల్ పేద మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఉపయోగపడే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు.
KMM: ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. సత్యనారాయణపురంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుడి గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న ఆయన, నూతన గృహంలోకి అడుగుపెట్టిన కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపి, పట్టు వస్త్రాలను కానుకగా అందజేశారు.
SKLM: మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు 69 వ జయంతి వేడుకలు నిమ్మాడలో సోమవారం నిర్వహించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు క్యాంప్ కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉ. 10కు నిమ్మాడలోని ఎర్రన్నాయుడు ఘాట్ వద్ద కేంద్ర మంత్రి రామ్మోహన్, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొని నివాళులర్పిస్తారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలన్నారు.
KKD: దేశ ప్రజలందరికీ జగన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కాకినాడకు చెందిన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుంకర పావని డిమాండ్ చేశారు. ఆదివారం ఆమె కాకినాడలో మాట్లాడుతూ.. శాసనమండలి సభలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అవమానపరుస్తూ స్వామివారి చిత్రపటాలను వైసీపీ సభ్యులు విసిరి వేయడాన్ని నిరసిస్తూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
MBNR: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలని కోరుతూ రేపటి నుంచి పాదయాత్ర చేబుతున్నట్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనంతరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రేపటి యాత్రకు న్యాయవాదులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
AKP: నర్సీపట్నంలోని రిషి డిగ్రీ కళాశాల వేదికగా ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్‌ను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం ఆవిష్కరించారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉపాధి మేళాలో సుమారు 17 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, వీటి ద్వారా 1855 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు.
AP: స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి కేంద్ర ప్రభుత్వానికి సూచించింది తానేనని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆయన వినుకొండలో పర్యటించారు. ఈ సందర్భంగా చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించి మాట్లాడారు. రానున్న రోజుల్లో ఏఐ ద్వారా వ్యవసాయం అందుబాటులోకి తెస్తామన్నారు. మార్చి నుంచి అన్ని గ్రామాల్లో చెత్త సేకరించి సంపదగా మారుస్తామన్నారు.
BHNG: తుర్కపల్లి మండల తహసీల్దార్‌గా రవికుమార్‌ను నియమిస్తూ కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న తహసీల్దార్ జలకుమారి కలెక్టరేట్‌కు బదిలీ అయ్యారు. కలెక్టరేట్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న రవికుమార్‌ను తుర్కపల్లి తహసీల్దార్‌గా నియమించారు. మూడేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో తహసీల్దార్ సేవలందించిన ఆయనను మరోసారి ఇక్కడికే నియమించడం విశేషం.
GDWL: స్థానిక ప్రాక్టీసింగ్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన గురుకుల ప్రవేశ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బీ.ఎం. సంతోష్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి రూమ్‌కు వెళ్లి ఆయన పరిశీలించారు. మాస్ కాపీ జరగకుండా జాగ్రతలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని చెప్పారు.
కొచ్చిలో 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో ‘అమరన్’, ‘భ్రమయుగం’ మూవీలు సత్తా చాటాయి. ‘అమరన్’ సినిమా ఏకంగా నాలుగు అవార్డులను కైవసం చేసుకోగా, ‘భ్రమయుగం’ రెండు పురస్కారాలను అందుకుంది. ఈ చిత్రాల్లో అద్భుత నటన కనబరిచిన హీరోలను ‘ఉత్తమ నటుడు’ అవార్డులు వరించాయి. దక్షిణాది సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక ...
NRPT: మద్దూర్ మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్ గోవిందు ముదిరాజ్ ప్రెస్ మీట్లో తనకు ఛైర్మన్ పదవి ఇస్తామని ఏనుముల తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల నాయకులు ఎవరూ.. హామీ ఇవ్వలేదని తెలిపారు. ఛైర్మన్ అవుతాననే నమ్మకంతోనే కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశానన్నారు. బీఆర్ఎస్ నాయకుల విమర్శ తగదని, పార్టీ తుది నిర్ణయమే తన నిర్ణయం అని ఆయన స్పష్టం చేశారు.
ATP: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత నేతృత్వంలో నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఆరు మండలాల్లో బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం వేగంగా సాగుతుండగా, జెస్సిపల్లి నుంచి పేరూరు వరకు 54 కిలోమీటర్ల మేర సాగుతున్న పరిటాల రవీంద్ర కాలువ పనులు రైతుల కలలను సాకారం చేస్తున్నాయి. కాలువల ద్వారా చెరువులకు నీరు నింపుతుండటంతో వ్యవసాయ రంగం కళకళలాడుతోంది.
KDP: సిద్దవటం మండలంలోని మాచుపల్లి గ్రామంలో వెలిసిన శ్రీశ్రీ రేణుక యల్లమాంబకు ఆదివారం విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా.. ఆలయ అర్చకుడు సుబ్బరాజు అమ్మవారికి కుంకుమార్చన, పుష్పాభిషేకం,పలు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. పరిసర గ్రామాల మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించి అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
HYD: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పెద్ద శంకరంపేట పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బాన్సువాడలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి మద్దతుగా రాజాసింగ్ హైదరాబాద్ నుంచి బాన్సువాడ బయలుదేరారు. ఈ క్రమంలో ఆయనను బాన్సువాడకు వెళ్లకుండా ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రాజాసింగ్ అరెస్ట్‌ను మండల బీజేపీ నాయకులు ఖండిస్తున్నారు.
CTR: రాష్ట్ర రవాణాశాఖ, జిల్లా ఇంఛార్జ్ మంత్రి రాం ప్రసాద్ రెడ్డికి ఆదివారం డీటీసీ నిరంజన్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. చిత్తూరు పర్యటనలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద టీడీపీ భవన నిర్మాణ భూమి పూజతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.