• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి కడప పోలీసుల నివాళి

కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ షెల్కే నచికేత్ ఆదేశాల మేరకు ఏఆర్ అదనపు ఎస్పీ బి. రమణయ్య ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించి, బ్రిటిష్ వారిపై పోరాడిన గొప్ప యోధుడని కొనియాడారు.

February 22, 2026 / 02:05 PM IST

అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ప్రారంభం

NGKL: తాడూర్ మండల కేంద్రంలోని మూడో వార్డులోని బొడ్రాయి వద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు సర్పంచ్ సంద మల్లయ్య ఇవాళ భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. భూగర్భ డ్రైనేజ్ వల్ల వార్డులో పారిశుద్ధ్య సమస్యలు తీరి, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

February 22, 2026 / 02:05 PM IST

టమోటా సాస్ ఆరోగ్యానికి ప్రమాదం!

మనం స్నాక్స్ తినే టమోటా సాస్ అత్యంత ప్రమాదకరం. కంపెనీలు నో యాడెడ్ షుగర్ అని ప్రచారం చేసినా.. అది వాస్తవం కాదు. మీరు ఒక టీస్పూన్ సాస్ తింటే ఒక టీస్పూన్ చక్కెర తిన్నట్లే. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. మనం తాగే పానీయాలు మన శరీరానికి తెలియకుండానే భారీ స్థాయిలో చక్కెరను అందిస్తున్నాయి. ఇవి ఇన్సులిన్ పనితీరును దెబ్బతీసి గుండె జబ్బుల ప్రమాదాన్ని రెట్టింపు చేస్తాయి.

February 22, 2026 / 02:05 PM IST

మదీనా మసీదు అభివృద్ధికి కృషి చేయండి: ఎమ్మెల్యే

E.G: రాజమండ్రిలోని దానవాయిపేట మదీనా మసీదు అభివృద్ధికి కృషి చేయాలని నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. కమిటీ సభ్యులు మహమ్మద్ అబ్దుల్లా ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.

February 22, 2026 / 02:00 PM IST

బాలికల వసతి గృహాన్ని పరిశీలించిన డీడీ

NLR: బుచ్చిరెడ్డిపాలెం ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని డీడీ శోభారాణి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను ఆమె పరిశీలించారు. ఇంటర్, పదవ తరగతి విద్యార్థులు ఎలా చదువుతున్నారని ఆరా తీశారు. విద్యార్థులకు పెట్టే భోజనాన్ని స్వయంగా రుచి చూసి, సంతృప్తి వ్యక్తం చేశారు. వసతి గృహంలో సౌకర్యాలు బాగున్నాయని విద్యార్థులు చెప్పినట్లు పేర్కొన్నారు.

February 22, 2026 / 02:00 PM IST

SFI ఆధ్వర్యంలో ‘ఆల్ ది బెస్ట్’ పోస్టర్ ఆవిష్కరణ

KKD: పిఠాపురంలో SFI ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఆల్ ది బెస్ట్’ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ పోస్టర్‌ను పిఠాపురం CI శ్రీనివాస్, SFI లోవరాజు, సిద్దు చేతుల మీదుగా ఆవిష్కరించారు. రేపు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ‘ALL The Best’ చెప్తూ ధైర్యంగా పరీక్షలు రాసి తల్లిదండ్రులకు, విద్యా సంస్థలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

February 22, 2026 / 02:00 PM IST

BREAKING: వైసీపీ నేత అరెస్ట్

AP: రైస్ పుల్లింగ్ మోసం కేసులో వైసీపీ నేత అరెస్ట్ అయ్యారు. మహిమగల రాగి చెంబు అంటూ రూ.10 లక్షలు వసూలు చేశారు. రూ.2 కోట్లు ధర పలుకుతుందంటూ.. వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తిని వైసీపీ నేత డీకే బాబు మోసం చేశారు. అయితే, తన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ వేణుగోపాల్ కోరారు.

February 22, 2026 / 01:59 PM IST

పాక్ అందుకే ఓడిపోతోంది: షోయబ్ అక్తర్

భారత్‌తో పాక్ మ్యాచ్ ఓడిపోవడానికి టీమ్ సెలక్షనే కారణమని ఆ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. జట్టు ఎంపిక సరిగ్గా లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. టీమ్ సెలక్షన్ సరిగ్గా ఉంటే ఏ జట్టునైనా ఓడించగల సమర్థత పాకిస్తాన్‌కు ఉందన్నారు. ICC టోర్నీల్లో పాక్ భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోతున్న విషయం తెలిసిందే. కాగా, పాక్ సెమీస్ చేరాలంటే ENG, SLపై కచ్చితంగా గెలవాలి.

February 22, 2026 / 01:59 PM IST

‘ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత’

ADB: గుడిహత్నూర్ మండల కేంద్రంలో గల సాయిబాబా ఆలయం వద్ద నిర్మించిన శ్రీ సంత్ గాడ్గే బాబా మహరాజ్ మూర్తి ఆవిష్కరణ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ డోంగర్ గావ్ గ్రామ సర్పంచ్ ఇమ్రాన్ లాల ఆదివారం హాజరయ్యారు. ఇమ్రాన్ లాలను సమాజ సభ్యులు సాంప్రదాయ పద్దతిలో సన్మానించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు.

February 22, 2026 / 01:59 PM IST

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈవీ బైక్ వచ్చేస్తోంది

రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్లాసిక్, రెట్రో స్టైల్ మోటార్‌సైకిళ్లకు ప్రసిద్ధి చెందిన ఐకానిక్ బ్రాండ్. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ రంగంలోకి అడుగుపెట్టింది. తొలి ఈవీ సబ్ బ్రాండ్ Flying Flea. మొదటి మోడల్ Flying Flea C6.. 2026 మొదటి త్రైమాసికంలో లాంచ్ అవుతుందని అధికారికంగా ప్రకటించింది. రూ.2 లక్షల నుంచి రూ.2.5-3 లక్షల మధ్య ధర ఉండొచ్చని అంచనా.

February 22, 2026 / 01:59 PM IST

రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం

AKP: ఎస్ రాయవరం మండలం సోమిదేవిపల్లికి చెందిన నేషనల్ పారా వాలీబాల్ క్రీడాకారుడు అన్నెం గణేష్‌కు జాతీయ పారా సిట్టింగ్ వాలీబాల్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. ఈనెల 25 నుంచి 28 వరకు మీరట్‌లో జరిగే టోర్నమెంట్‌కు ఏపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు గణేష్ ఆదివారం తెలిపారు. టోర్నమెంట్లో సత్తా చాటి ఏపీకి మంచి పేరు తీసుకువస్తానన్నారు.

February 22, 2026 / 01:58 PM IST

ఔన్నత్యాన్ని చాటుకున్న క్లాస్‌మేట్స్

SDPT: అక్కన్నపేట మండలం జనగామ గ్రామానికి చెందిన మోటే అజయ్ గత 15 రోజుల క్రితం ఆగి ఉన్న ట్రాక్టర్‌ని ఢీకొట్టడంతో ప్రాణాలను కోల్పోయాడు. తనతో కలిసి పదవ తరగతి చదువుకున్న జడ్.పి.హెచ్.ఎస్ అంతక పేట 2009 బ్యాచికి చెందిన తన తోటి స్నేహితులు అందరూ కలిసి దాదాపుగా లక్ష 40 వేల రూపాయలని తన కూతురి పేరుపై ఎల్ఐసిలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు.

February 22, 2026 / 01:56 PM IST

‘ది కేరళ స్టోరీ 2’పై దర్శకుడి విమర్శలు

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ‘ది కేరళ స్టోరీ 2’ సినిమాపై తీవ్ర విమర్శలు చేశాడు. దీన్ని కేవలం డబ్బు కోసం తీసిన ‘చెత్త ప్రాపగండా’ చిత్రంగా ఆయన అభివర్ణించాడు. ప్రజల మధ్య విభజన తెచ్చి లాభపడాలని చూస్తున్నారని మండిపడ్డాడు. ట్రైలర్‌లోని కొన్ని సీన్లపై స్పందిస్తూ.. ఇవన్నీ పచ్చి అబద్ధాలని, మేకర్స్ అత్యాశతోనే ఇలాంటి కథలు తీస్తున్నారని ఘాటుగా విమర్శించాడు.

February 22, 2026 / 01:56 PM IST

‘నిందితులను అరెస్ట్ చేయాలి’

సుబ్రమణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గతో పాటు నిందితులతో కుమ్మక్కైన పోలీసులను తక్షణమే అరెస్టు చేయాలని విదసం రాష్ట్ర కన్వీనర్ డా. బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆదివారం మీడియాతో మాట్లాడుతూ… సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సిట్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.

February 22, 2026 / 01:55 PM IST

‘పెండింగ్‌లో ఉన్న డిఏలు వెంటనే విడుదల చేయాలి’

SRD: ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. జిల్లాలోని సంఘ భవనంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మెరుగైన పీఆర్‌సీని ప్రకటించాలని కోరారు. ప్రతి తరగతికి ఓ ఉపాధ్యాయున్ని నియమించాలని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా కోశాధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

February 22, 2026 / 01:52 PM IST