• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఉచిత కంటి వైద్య శిబిరం!

MDK: శివంపేట మం. దంతాన్‌పల్లిలో సర్పంచ్ మమత ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వృద్ధులు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. నిపుణులైన వైద్యులు ఉచితంగా సలహాలు అందించి, అవసరమైన వారికిపై వైద్యం కోసం రిఫరల్ సేవలు సూచించారు.

February 22, 2026 / 01:15 PM IST

ఉయ్యాలవాడకు ఘన నివాళులు

CTR: తొలితరం స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని జిల్లా సాయుధ దళం కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఏఆర్ అడిషనల్ ఎస్పీ దేవదాస్ పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రాయలసీమలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఉయ్యాలవాడ అందరికీ ఆదర్శమని వెల్లడించారు.

February 22, 2026 / 01:14 PM IST

పర్యాటకుల రాకతో కళకళలాడిన హంసలదీవి బీచ్

కృష్ణా: కోడూరు మండలం హంసలదీవి బీచ్‌కు ఆదివారం విజయవాడ, బాపట్ల, గుంటూరు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు కుటుంబ సమేతంగా విచ్చేసి సముద్ర స్నానాలు చేస్తూ సరదాగా గడిపారు. పర్యాటకుల తాకిడితో బీచ్ కళకళలాడింది. పర్యాటకులు స్నానాలు చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై పాలకాయతిప్ప మెరైన్ పోలీసులు సూచనలు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గస్తీ నిర్వహించారు.

February 22, 2026 / 01:13 PM IST

‘బీజేపీ మతపర సమస్యలు సృష్టించాలని చూస్తోంది’

TG: శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా బీజేపీ వ్యవహరిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ‘మతపర సమస్యలు సృష్టించాలని చూస్తోంది. అలా ఎవరు చేసినా అరెస్టులు తప్పవు. శాంతిభద్రతల దృష్ట్యా నేను కామారెడ్డికి వెళ్లలేదు. సంబంధంలేని అంశంపై బండి సంజయ్ మాట్లాడుతున్నారు. సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యను.. జటిలం చేస్తున్నారు’ అంటూ మండిపడ్డారు.

February 22, 2026 / 01:13 PM IST

గంజహళ్లి ఉరుసుకు కట్టుదిట్టమైన బందోబస్తు

KRNL: గోనేగండ్ల మం. గంజహళ్లి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీశ్రీ సద్గురు బడేసాహెబ్ ఉరుసు సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇవాళ DSPభార్గవి, CI చంద్రబాబు, ఎమ్మిగనూరు టౌన్ CI శ్రీనివాసులు సిబ్బందితో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. దర్గా పరిసరాల్లో విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, భద్రతా దృష్ట్యా 146మంది సిబ్బంది పాల్గొంటారు.

February 22, 2026 / 01:13 PM IST

జాతరలో పాప మృతి బాధాకరం: కవిత

TG: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో కుల వివక్షతో పేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పాప మరణించడం అమానుషమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. పాప కుటుంబంతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పాప మృతికి కారణమైన వారిపై BNS 316, BNS 316(3), జువెనైల్ జస్టిస్ యాక్ట్ 75 ప్రకారం కేసులు పెట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

February 22, 2026 / 01:13 PM IST

రహదారి సౌకర్యం కల్పించిన కౌన్సిలర్

RR: కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తానని కౌన్సిలర్ రాజునాయక్ స్పష్టం చేశారు. షాద్‌నగర్ ఆరవ వార్డు టీచర్స్ కాలనీలో రోడ్డు సమస్య గురించి స్థానికులు కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే రోడ్డులో మట్టి పోసి జేసీబీ వాహనంతో లెవెల్ చేయించారు. కాలనీలలో ఎలాంటి సమస్యలు ఉన్న వెంటనే తనకు తెలపాలని, పూర్తిస్థాయిలో వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.

February 22, 2026 / 01:12 PM IST

‘మాతృభాషలో మహత్తరమైన శక్తి దాగి ఉంది’

NLR: మాతృభాషలో వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం మన హక్కని గురజాడ పురస్కార గ్రహీత గండికోట సుధీర్ కుమార్ అన్నారు. బుచ్చి గ్రంథాలయంలో ఆదివారం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అమ్మ ఒడిలో నేర్చుకున్న భాషతో ఆత్మవిశ్వాసం, అవగాహన, భావోద్వేగాలు వ్యక్త పరచడం ఉత్తమంగా ఉంటాయన్నారు. మాతృభాషలో మహత్తరమైన శక్తి దాగి ఉందన్నారు.

February 22, 2026 / 01:12 PM IST

పండుగ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్

MHBD: మరిపెడ మండలంలోని ఆనేపురం గ్రామంలో సవారి లచ్చమ్మ పండుగ వేడుకల్లో ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని కోరినట్లు చెెప్పారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లాలని విప్ తెలిపారు.

February 22, 2026 / 01:10 PM IST

“మన్ కీ బాత్” 131వ కార్యక్రమాన్ని వీక్షించిన..BJP నేతలు

JN: స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలో ఆదివారం భారత ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన “మన్ కీ బాత్” 131వ కార్యక్రమాన్ని BJP రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వెంకటేశ్వర్లు, BJP నాయకులు వీక్షించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. BJP ప్రభుత్వంతోనే దేశ అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో BJP ముఖ్య నేతలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

February 22, 2026 / 01:10 PM IST

డ్రైనేజీ పనులను పరిశీలించిన మంత్రి

E.G: పెరవలి మండలం కాకరపర్రు గ్రామం నందు శ్రీ ఆదివారం జరిగిన గంటాలమ్మ దేవి అమ్మవారి వాయ ప్రతిష్ట మహోత్సవాలలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను పరిశీలించారు. నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు మంత్రి సూచించారు.

February 22, 2026 / 01:10 PM IST

జిల్లా టీడీపీ కార్యాలయానికి శంకుస్థాపన

బాపట్ల: జిల్లాలో నూతన టీడీపీ పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఆదివారం లాంఛనంగా శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, పార్థసారథి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారితో పాటు ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు వేగేశన నరేంద్ర వర్మ, ఏలూరి సాంబశివరావు కూడా ఈ భూమిపూజ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

February 22, 2026 / 01:10 PM IST

శ్రీవారికి వైసీపీ ఎమ్మెల్సీల అపచారం: ఎమ్మెల్యే

సత్యసాయి: వైసీపీ నేతలకు హిందూ మతంపై నమ్మకం లేదని, వారిది కపట ప్రేమ అని మడకశిర ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు ఎం.ఎస్.రాజు విమర్శించారు. శాసనమండలిలో చెప్పులు వేసుకుని శ్రీవారి చిత్రపటాలను పట్టుకుని అపచారం చేశారని మండిపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో లడ్డూ కల్తీ, తలనీలాల అక్రమాలతో టీటీడీ ప్రతిష్టను దిగజార్చారని ఎమ్మెల్యే ఆరోపించారు.

February 22, 2026 / 01:09 PM IST

దిబ్బనకల్‌లో రూ.15 లక్షలతో తాగునీటి సంపు ప్రారంభం

KRNL: దిబ్బనకల్ గ్రామంలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన తాగునీటి సంపును సర్పంచ్ పెద్దలక్ష్మి, టిడిపి నాయకులు లక్ష్మన్న ఇవాళ ప్రారంభించారు. దశాబ్దాలుగా ఉన్న తాగునీటి సమస్యకు ఇది శాశ్వత పరిష్కారమని తెలిపారు.మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సహకారం గుర్తుచేసుకుంటూ, ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మద్దతుతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు.

February 22, 2026 / 01:08 PM IST

నిజాంసాగర్ ప్రాజెక్టు.. 1500 క్యూసెక్కుల నీటి విడుదల

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి పంట సాగు కోసం ప్రధాన కాలువ ద్వారా 3వ విడతలో భాగంగా ఆదివారం 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈఈ అక్షయ్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.903 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు రైతులను కోరారు.

February 22, 2026 / 01:08 PM IST