• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కేయూలో శతావధానం ప్రారంభం..

HNK: కాకతీయ యూనివర్సిటీ సెనేట్ హాలులో శతావధానం కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ… శతావధానం కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని, కేయూకు ప్రత్యేక చరిత్ర ఉందని, కేయూ అభివృద్ధికి సహకరిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

February 22, 2026 / 01:07 PM IST

NCPవి రాజకీయ ఆరోపణలే: పల్లా శ్రీనివాసరావు

AP: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుపై NCPవి రాజకీయ ఆరోపణలేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ‘అజిత్ పవార్ దుర్ఘటన బాధలో అలా మాట్లాడి ఉండొచ్చు. రామ్మోహన్ నిబద్ధతపై మాకు నమ్మకం ఉంది. ప్రజల మనోభావాలు అర్థం చేసుకునే వ్యక్తి చంద్రబాబు. బాక్సైట్ అంశంలో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నాం’ అని పేర్కొన్నారు.

February 22, 2026 / 01:06 PM IST

మూసీ బాధితులకు సబితా ఇంద్రారెడ్డి భరోసా

TG: గాంధీ సరోవర్ పేరిట మధు పార్క్ అపార్ట్‌మెంట్ ఖాళీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్‌పై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టులో గాంధీ విగ్రహం అవసరమే లేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఒక్క ఇళ్లును కూడా టచ్ చేయకుండా రేవంత్ అరాచకాన్ని తాము అడ్డుకుంటామని చెప్పారు. ఎవరూ అధైర్యపడొద్దని, బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు.

February 22, 2026 / 01:06 PM IST

‘దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తుంది’

WGL: భారత ప్రధాని నరేంద్రమోదీ నిర్వహిస్తున్న “మన్ కీ బాత్” 131వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని వరంగల్ తూర్పు 28వ డివిజన్ 105 బూత్‌లో కార్యకర్తలతో బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ వీక్షించారు. రవికుమార్ మాట్లాడుతూ… ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుందని, బీజేపీకి ప్రజలు అండగా నిలవాలన్నారు.

February 22, 2026 / 01:05 PM IST

గోకారంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

NGKL: చారకొండ మండలం గోకారం పంచాయతీ ఏడవ వార్డులో సీసీ రోడ్డు పనులను సర్పంచ్ పర్శరాములు ఆదివారం ప్రారంభించారు. గ్రామాభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రజల సహకారంతో అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి చెన్న కేశవులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

February 22, 2026 / 01:05 PM IST

నగర వాసుల ఫిర్యాదుతో ఆగిన పైప్ లైన్ పనులు

KDP: ప్రొద్దుటూరు సమీపంలోని అమృత నగర్ ప్రభుత్వ కాలనీలో పేదల నివాసాల నుంచి అనధికార ప్రైవేట్ వెంచర్ సిరిపురి కాలనీకి తాగునీటి పైప్ లైన్ నిర్మిస్తున్న పనులను పంచాయతీ తీర్మాణం మేరకే చేపట్టినట్లు సర్పంచ్ శివచంద్రారెడ్డి తెలిపారు. అయితే, అమృతనగర్ వాసుల ఫిర్యాదు మేరకు పైప్ లైన్ పనులను నిలిపివేసినట్లు పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనరసింహులు వెల్లడించారు.

February 22, 2026 / 01:05 PM IST

శ్రీనివాస్‌కు 100 మంది శ్రీనివాసుల సత్కారం

KNR: కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్‌ను తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ తరఫున 100 మంది శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. శ్రీనివాసుల పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి 2 సంవత్సరాలలో 30వేల మంది శ్రీనివాసులు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రపంచ రికార్డు నమోదు చేశారు.

February 22, 2026 / 01:05 PM IST

ఘనంగా రాజగోపాలరావు వర్ధంతి వేడుకలు

SKLM: శ్రీకాకుళం పట్టణం కొత్త రోడ్డు జంక్షన్ వద్ద ఉన్న దివంగత నేత, కలింగుల ఆరాధ్య దైవం స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాలరావు 34వ వర్ధంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కలింగుల సంక్షేమానికి రాజగోపాలరావు చేసిన సేవలు మరువలేమని రాష్ట్ర కళింగ సంక్షేమ సేవా సంఘం ఉత్తరాంధ్ర యూత్ ఇంచార్జ్ సంతోష్ తెలిపారు.

February 22, 2026 / 01:04 PM IST

నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే

BDK: ఇల్లందు మండలం రేపల్లెవాడ గ్రామపంచాయతీలో లబ్ధిదారుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏప్రిల్ నెలలో మరల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

February 22, 2026 / 01:04 PM IST

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ మంత్రి

JGL: బీర్పూర్ మండలం రంగసాగర్ గ్రామంలోని గొల్ల కేతమ్మ ఆలయంలో ఆదివారం మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

February 22, 2026 / 01:03 PM IST

జనసేన సభ్యత్వ నమోదు పై కీలక సమావేశం

VSP: విశాఖ జనసేన పార్టీ నగర కార్యాలయంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే, నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జిలతో ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమంపై వివరించారు. సభ్యత్వ నమోదు విధానం, చేపట్టాల్సిన చర్యలపై ఇంచార్జిలకు సూచనలు ఇచ్చారు.

February 22, 2026 / 01:03 PM IST

వీధి కుక్కలకు వైరస్… భయాందోళనలో గ్రామస్తులు..

MLG: ఏటూరునగారం మండల కేంద్రంలో వీధి కుక్కలకు వైరస్ సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కొన్ని వీధులలో వెంట్రుకలు పూర్తిగా ఊడిపోయి, శరీరంపై గాయాలతో తిరుగుతున్న కుక్కలు కనిపించడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. రేబిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధి అయితే ప్రజలకు ప్రాణహాని కలగొచ్చని, అధికారులు తక్షణమే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

February 22, 2026 / 01:02 PM IST

పదవి అనేది అధికారం కాదు బాధ్యత: మంత్రి

KMM: ఏదులాపురం ఎన్నికల వరకే రాజకీయం గెలిచిన తర్వాత ఏ పార్టీ వారైనా ప్రజా ప్రభుత్వం తరపున పేదవాడికి సేవ చేయాల్సిందేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. పదవి అనేది అధికారం కాదు, బాధ్యత అని గుర్తించాలన్నారు. ఆదివారం పెద్దతండాలోని మున్సిపల్ కార్యాలయంలో నూతన మున్సిపల్ ఛైర్‌పర్సన్ అనిత బాధ్యతల స్వీకరణ మహోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

February 22, 2026 / 01:01 PM IST

నాణ్యమైన వైద్యమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

ఎన్టీఆర్: నందిగామ పట్టణంలో ఆదివారం ప్రధానమంత్రి భారతీయ జన ఔషధీ కేంద్రం నూతన జనరిక్ మందుల షాపును ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మార్కెట్ ధరలతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే అత్యుత్తమ నాణ్యత గల జనరిక్ మందులు లభించే విధంగా భారతీయ జన ఔషధీ కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు.

February 22, 2026 / 01:01 PM IST

ఆలయ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

కోనసీమ: ఆథ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత, మనోధైర్యం లభిస్తాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆదివారం మొదలైన ఆత్రేయపురం లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే బండారు పాల్గొన్నారు. స్వామి వారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.

February 22, 2026 / 01:00 PM IST