• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రోడ్డు ప్రమాదాల పరిస్థితిపై ఎస్పీ సమీక్ష

సత్యసాయి: పెనుకొండ సబ్ డివిజన్ పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల పరిస్థితిపై ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదివారం డీఎస్పీ కార్యాలయంలో పెనుకొండ డీఎస్పీ, సీఐలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు కీలక సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

February 22, 2026 / 04:30 PM IST

నంచర్లలో టీజీ సెట్-2026 ప్రశాంతంగా

MBNR: నంచర్ల గురుకుల పాఠశాలలో టీజీ సెట్-2026 ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. 5 నుంచి 9వ తరగతుల ప్రవేశాల కోసం 513 మంది నమోదు చేసుకోగా, 488 మంది విద్యార్థులు హాజరయ్యారు, 25 మంది గైర్హాజరయ్యారు. పోలీసు భద్రతతో పరీక్షలు ఎటువంటి అంతరాయం లేకుండా జరిగాయని ప్రిన్సిపల్ రమ తెలిపారు.

February 22, 2026 / 04:30 PM IST

రేవంత్ రెడ్డికి BJP భయం పట్టుకుంది: రామచందర్ రావు

TG: CM రేవంత్‌రెడ్డికి BJP భయం పట్టుకుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఎద్దేవా చేశారు. కామారెడ్డిలో BJPకి ఛైర్మన్‌ పదవి రాకుండా చేశారని ధ్వజమెత్తారు. ప్రజాహక్కులను కాంగ్రెస్‌ ప్రభుత్వం కాలరాస్తుందని మండిపడ్డారు. BJP పిలుపునిచ్చిన చలో కామారెడ్డి నేపథ్యంలో రామచందర్ రావును అరెస్టు చేసిన పోలీసులు.. ఆయనను విడుదల చేశారు.

February 22, 2026 / 04:30 PM IST

ఘనంగా గంగమ్మ తల్లి వార్షికోత్సవం

KDP: VN పల్లె (M) తలపనూరులోని గంగమ్మ తల్లి ఆలయ 33వ వార్షికోత్సవం ఈనెల 24న నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు నాగిరెడ్డి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఉదయము అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. అనంతరం అమ్మవారికి గ్రామ మహిళలచే బోనాల సమర్పణ ఉంటుందన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

February 22, 2026 / 04:29 PM IST

యాదాద్రి క్షేత్రంలో పెరిగిన భక్తుల రద్దీ

BHNG: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. సెలవు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. భక్తులు కొండకింద తలనీలాలు సమర్పించి, దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. ధర్మదర్శనానికి సుమారు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

February 22, 2026 / 04:29 PM IST

భారీ చోరీ.. 35 తులాల బంగారం అపహరణ

AP: YSR కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీ చోరీ జరిగింది. తిమ్మయ్య కాలనీకి చెందిన బాలిరెడ్డి కుటుంబం పెనికలపాడులోని బంధువుల ఇంటికి వెళ్లగా ఇంట్లో నుంచి 35 తులాల బంగారం, 40 తులాల వెండిని దొంగలు అపహరించారు. తలుపులు తెరిచి ఉండటాన్ని స్థానికులు గమనించి ఇంటి యజమానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

February 22, 2026 / 04:28 PM IST

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

సూర్యాపేట: దాదాపు 14ఏండ్ల తరువాత వారంతా ఒకచోట కలిశారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకుంటూ చిన్ననాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు. పాఠశాలలో చదువుకుంటున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం కుటుంబ స్థితిగతులను తెలుసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు. నాటి విద్యార్థుల పూర్వసమ్మేళానానికి సూర్యాపేట సిద్దార్థ హైస్కూల్ వేదికగా మారింది.

February 22, 2026 / 04:28 PM IST

పుంగనూరులో బైక్ ర్యాలీ

CTR: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలలో భాగంగా ఆదివారం హిందూ సంఘాలవారు పుంగనూరులో బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అన్న క్యాంటీన్ నుంచి ఎన్టీఆర్ కూడలి, ఇందిరా సర్కిల్, MBTరోడ్డు గుండా పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. చత్రపతి శివాజీ మహారాజ్‌కు జై అంటూ చేపట్టిన నినాదాలు పట్టణంలో మారుమోగాయి. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు.

February 22, 2026 / 04:27 PM IST

ఓరుగల్లు సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్: ఎమ్మెల్యే

HNK: ఓరుగల్లు సమగ్ర అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. హన్మకొండ ప్రగతి నగర్, LIC కాలనీ, సాయి నగర్, సురేంద్రపురి, పోలీస్ కాలనీలలో ఎమ్మెల్యే పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ప్రతీ కాలనీలో అభివృద్ధి పనులు చేపట్టేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.

February 22, 2026 / 04:26 PM IST

‘తల్లి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి’

MHBD: నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామంలో సవార్ లచ్చమ్మ తల్లి పండుగను పురస్కరించుకుని ఇవాళ స్థానిక సర్పంచ్ మాదారి ప్రశాంత్ ఆలయంలో కొబ్బరికాయల కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లి ఆశీస్సులతో ప్రజలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంకు ఉప సర్పంచ్ కాగా మాజీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.

February 22, 2026 / 04:25 PM IST

హరీష్ రావు తప్పుదోవ పట్టిస్తున్నారు: ఎంపీ

TG: మాజీమంత్రి హరీష్ రావుపై ఎంపీ చామల కిరణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. HYD బండ్లగూడ జాగీర్‌లోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్ మెంట్ వాసులను హరీష్ రావు తప్పుదోవ పట్టించారని విమర్శించారు. గత ప్రభుత్వం కమీషన్లు దండుకోవడం కోసం చేసిన పనికి అపార్ట్ మెంట్ వాసులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నాళా మీద మధు పార్క్ రిడ్జ్ బిల్డర్లు పర్మిషన్ తీసుకున్నారని ఆగ్రహించారు.

February 22, 2026 / 04:25 PM IST

మంత్రి కొండ సురేఖను కలిసిన ఏనుగల్ సర్పంచ్

HNK: హనుమకొండ నగరం లోని సర్క్యూట్ హౌస్‌లో అటవీశాఖ మంత్రి కొండా సురేఖను ఆదివారం పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామ సర్పంచ్ తొర్రి పద్మకుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు.

February 22, 2026 / 04:24 PM IST

రామగుండం మేయర్, డిప్యూటీ మేయర్‌లకు ఘన సన్మానం

PDPL: రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి మేయర్‌గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్‌గా పాతపల్లి ఎల్లయ్య ఎన్నిక కావడంతో సింగరేణి కార్మికులు వారిని ఘనంగా సన్మానించారు. పారిశ్రామిక ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి అధిక మెజారిటీ అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ అభివృద్ధి, కార్మిక సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడతామని పేర్కొన్నారు.

February 22, 2026 / 04:24 PM IST

అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించిన జడ్పీటీసీ

SKLM: నరసన్నపేట మండలం గోపాలపెంట గ్రామానికి చెందిన బబ్బోది పెంటమ్మ, బుడుమూరు అమ్మడమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న యువనేత, జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య ఆదివారం వారిరువురిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనతోపాటు ఎంపీటీసీ మల్లేశ్వరరావు, తదితరులు ఉన్నారు.

February 22, 2026 / 04:23 PM IST

ఈరప్పకు పరామర్శచిన ఎమ్మెల్యే

KRNL: ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో బైక్ ప్రమాదానికి గురైన వైసీపీ నాయకుడు ఈరప్పను ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆదివారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మెరుగైన వైద్య చికిత్సల కోసం రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

February 22, 2026 / 04:21 PM IST