• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

KNR: తిమ్మాపూర్ మండలం మహాత్మ నగర్ గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కపంపల్లి సత్యనారాయణ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

February 22, 2026 / 04:41 PM IST

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: వార్డు కౌన్సిలర్

KMM: మధిర మున్సిపాలిటీ లో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్ పర్సన్,వైస్ ఛైర్పర్సన్,కౌన్సిలర్ల సన్మాన సభ ఆదివారం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 21 వ వార్డు కౌన్సిలర్ రంగా రూప మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో కౌన్సిలర్ బాధితులు అప్పగించిన ప్రజలకు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు.

February 22, 2026 / 04:40 PM IST

‘బీఆర్ఎస్ హయంలో ఆలయ అభివృద్ధి’

SDPT: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధి జరిగిందని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కొమురవెల్లి మల్లన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆలయం వద్ద సరైన రోడ్లు, త్రాగునీరు, వసతి సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారని పేర్కొన్నారు.

February 22, 2026 / 04:40 PM IST

శ్రీ వేంకటేశ్వర స్వామి జాతరలో ఎమ్మెల్యే

NZB: వేల్పూర్ మండలంలోని కుకునూర్ గ్రామం లో ఆదివారం నిర్వహించిన శ్రీ వేంకటేశ్వర స్వామి జాతరలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

February 22, 2026 / 04:39 PM IST

ఈ ఏడాదిలోగా దేవాదుల పూర్తిచేస్తాం: రేవంత్

TG: ములుగు జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టును ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు పెండింగ్ పనులపై దిశానిర్దేశం చేశారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరుగాంచిన దేవాదుల నుంచి సుమారు 469 మీటర్ల ఎత్తుకు నీటిని తరలిస్తారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆరున్నర లక్షల ఎకరాకలకు నీరు అందించవచ్చు.

February 22, 2026 / 04:38 PM IST

శాప్ చెస్ లీగ్ ముగింపు సభలో కలెక్టర్

తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి శాప్ చెస్ లీగ్ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజేతలకు సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. ఆయన మాట్లడుతూ.. క్రీడలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తాయని కలెక్టర్ తెలిపారు.

February 22, 2026 / 04:36 PM IST

ఉత్తమ ‘గ్రామీణ డాక్ సేవక్‌’ అవార్డులు ప్రదానం 

AP: సత్యసాయి ఆధ్యాత్మిక సిటీలో గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు జ్యోతిరదిత్య, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో పోస్టల్ సదస్సు చేపట్టారు. ఈ సందర్భంగా ఉత్తమ గ్రామీణ డాక్ సేవక్‌లకు అవార్డులు ప్రదానం చేయనున్నారు.

February 22, 2026 / 04:36 PM IST

వైసీపీ తప్పు చేసి బుకాయిస్తోంది: మంత్రి

NDL: తిరుమల లడ్డూ విషయంలో వైసీపీ తప్పుచేసి మళ్లీ బుకాయిస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నంద్యాలలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్న వైసీపీని హిందూ వ్యతిరేక పార్టీగా ఆయన అభివర్ణించారు. నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, గౌరు వెంకటరెడ్డి, బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు పాల్గొన్నారు.

February 22, 2026 / 04:34 PM IST

‘మార్చి 1న మహాసభను విజయవంతం చేయాలి’

RR: తుర్కయంజాల్‌లో ఆదివారం జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో తుర్కయంజాల్, ఆదిభట్ల సర్కిల్ మహిళా నాయకురాళ్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకురాళ్లు మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే కేవలం విద్య మాత్రమే సరిపోదని ఆర్థిక స్వయం ప్రతిపత్తికూడా ఎంతో ముఖ్యమని తెలిపారు. మార్చి 1న మహిళా సమాఖ్య నిర్మాణ మహాసభను విజయవంతం చేయాలన్నారు.

February 22, 2026 / 04:34 PM IST

బూరుగుమళ్ళలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

WGL: పర్వతగిరి మండలం బూరుగుమళ్ళ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జాటోతు శ్రీనివాస్ నాయక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నాము.

February 22, 2026 / 04:33 PM IST

ములుగు జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

TG: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. దేవాదుల బ్యారేజ్‌ను రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. దేవాదుల ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, సీతక్క పరిశీలిస్తున్నారు. సీఎం పర్యటనలో ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

February 22, 2026 / 04:33 PM IST

అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ గుట్టురట్టు

దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు భారీ డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించారు. అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్‌పై దాడులు చేసి సుమారు 513 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో ట్రామాడోల్, నైట్రోజెప్, ఆల్ఫాజోలం వంటి నిషేధిత డ్రగ్స్ ఉన్నట్లు వెల్లడించారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా నెట్‌వర్క్‌పై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.

February 22, 2026 / 04:32 PM IST

బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలి: రవి పటేల్

BHPL: కుమ్మేర మల్లన్న స్వామి జాతరలో రజక సోదరులపై జరిగిన దాడి తెలంగాణ సమాజాన్ని కలిచివేసిందని TRP భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం BHPL జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కులం పేరుతో దేవుడి దర్శనానికి వెళ్లిన వారిపై హింసాత్మక దాడి చేయడం అమానుషమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

February 22, 2026 / 04:31 PM IST

పాత మున్సిపల్ భవనాన్ని ఆధునికరించాలని వినతి

ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆదివారం పర్యటించారు. సందర్భంగా పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పాత మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించారు. పాత మున్సిపాలిటీ కార్యాలయ భవనాన్ని ఆధునికరించి ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఉపయోగించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కోరారు.

February 22, 2026 / 04:31 PM IST

వాడి వేడిగా టౌన్ బ్యాంక్ మహాజనసభ

ATP: గుత్తిలో ఆదివారం ది గుత్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మహాజన సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు శ్రీనివాసులనే ఖాతాదారుడు ఇంటి రుణాల్లో గోల్ మాల్ జరిగిందని, మార్కెట్ విలువ కంటే తక్కువకు గృహాల వేలం వేశారంటూ టౌన్ బ్యాంక్ ఛైర్మన్, అబ్దుల్ జిలాన్‌తో మధ్య స్వల్ప వాగ్వివాదం జరిగింది. సమస్య పరిష్కరిస్తామని తెలపడంతో ఖాతాదారుడు శాంతించాడు.

February 22, 2026 / 04:30 PM IST