• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఘనంగా సర్పంచ్‌లకు సన్మానం

VZM: బొండపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం సర్పంచ్‌లను ఘనంగా సన్మానించారు. సర్పంచుల పదవీకాలం మార్చి నెలలో పూర్తికానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సర్పంచ్‌లకు బొండపల్లి ఎంపీపీ చల్ల చల్లంనాయుడు, పలువురు అధికారులు సర్పంచులకు సాలువల కప్పి పుష్పగుచ్చాలు అందజేసి సత్కరించారు.

February 22, 2026 / 05:41 PM IST

‘రేపు పుట్టపర్తిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్‌, మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలపై వినతులు అందజేస్తే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 22, 2026 / 05:40 PM IST

గ్రామీణ డాక్ సేవక్‌లకు కేంద్రమంత్రి శుభవార్త

AP: గ్రామీణ డాక్ సేవక్‌లకు ఈ స్కూటర్లు ఇచ్చేలా చూస్తామని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య హామీ ఇచ్చారు. తపాలాశాఖ.. ABCD ఫార్ములాతో ముందుకెళ్లాలని సూచించారు. బ్యాంకింగ్, లాడ్‌లీ లక్ష్మీ, సుకన్య సమృద్ది ద్వారా తపాలాశాఖ బలోపేతం అయిందన్నారు. ఏక్యూరసీ, బిహేవియర్, కమిట్‌మెంట్ టు డెలివరీ.. ఇవే వారి నినాదం అని అన్నారు. ఇవాళ్టి కార్యక్రమం తపాలాశాఖకు ఉగాది కానుందన్నారు.

February 22, 2026 / 05:40 PM IST

కార్పొరేటర్ ను సన్మానించిన కమిటీ సభ్యుడు

NZB: నిజామాబాద్ గాయత్రినగర్‌లో ఆదివారం శ్రీ గాయత్రి చైతన్య కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ సుమిత్రను ఘనంగా సన్మానించారు. కమిటీ అధ్యక్షుడు ఆడెపు నరేంద్ర స్వామి మాట్లాడుతూ.. కార్పొరేటర్ సుమిత్ర కిషోర్ గతంలో చేసిన అభివృద్ధి పనులు, ఆయన మంచితనం వల్లే నేడు మళ్లీ విజయం చేకూర్చాయని అన్నారు.

February 22, 2026 / 05:39 PM IST

పదేళ్లలో ప్రాజెక్టులు కట్టలేదు: రేవంత్

TG: గోదావరి జలాల వివాదం కొన్నాళ్లుగా రాజకీయరంగు పులుముకుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గడిచిన పదేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు వివాదమే ఉండేది కాదని అన్నారు. 960 TMCలకు సరిపడా ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే సమస్య ఉండేది కాదన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసుకుని రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకోవాలన్నారు.

February 22, 2026 / 05:39 PM IST

మల్లాపూర్‌లో CMRF చెక్కు పంపిణీ

MBNR: మిడ్జిల్ మండలం మల్లాపూర్‌కు చెందిన నందినికి రూ.32 వేల సీఎం సహాయ నిధి (CMRF) చెక్‌ను మాజీ సర్పంచ్ అయ్యన్న గౌడ్ అందజేశారు. సీఎంఆర్ఎఫ్ ఆపద సమయంలో పేదలకు భరోసాగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుకుమార్ రెడ్డి, చందర్, సైదులు, తదితరులు పాల్గొన్నారు.

February 22, 2026 / 05:38 PM IST

డిగ్రీలతో ఉద్యోగాలు రావు: మాజీ ఉప రాష్ట్రపతి

ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్టులో నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో శిక్షణ పొందుతున్న యువతతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం డిగ్రీలతోనే ఉద్యోగాలు రావని, నైపుణ్యం ఉన్నవారికే అవకాశాలు ఉంటాయని తెలిపారు. యువత తమకు నచ్చిన రంగాల్లో శిక్షణ తీసుకుని వికసిత భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు.

February 22, 2026 / 05:38 PM IST

సిమెంట్ రోడ్డును ప్రారంభించిన ఇంఛార్జ్ మంత్రి

CTR: నగరపరిధిలో 40వ వార్డులో రూ.9.55 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును జిల్లా ఇంఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చుడా ఛైర్‌పర్సన్ కఠారి హేమలత, జిల్లా టీడీపీ అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి, ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, స్థానిక టీడీపీ, కూటమి నాయకులు పాల్గొన్నారు.

February 22, 2026 / 05:36 PM IST

సంత్ సేవాలాల్ జయంతిలో ఎమ్మెల్యే

RR: తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్‌లో బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం MLA మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంజారాలతో కలిసి నృత్యం చేసి సందడి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బంజారా సంస్కృతిని రక్షించి, మూఢనమ్మకాల నిర్మూలనకు కృషి చేశారన్నారు.

February 22, 2026 / 05:36 PM IST

‘ఇంటర్ పరీక్షలకు పూర్తి ఏర్పాట్లు చేశాం ‘

ELR: ఈ నెల 22 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు జంగారెడ్డిగూడెంలో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పరీక్షల కస్టోడియన్ శ్రీనివాసరావు చలమాల తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఫస్ట్ ఇయర్ 2,357 మంది, సెకండ్ ఇయర్ 2,191 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని అన్నారు.

February 22, 2026 / 05:36 PM IST

డ్రోన్ కెమెరాలతో కట్టుదిట్టమైన పర్యవేక్షణ

కడప: నగరంలో గంజాయి, నిషేధిత మత్తు పదార్థాల సేవనం, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. స్పెషల్ పార్టీ సిబ్బందితో పాటు డ్రోన్ కెమెరాల ద్వారా నింగి నుండి నిఘా ఉంచుతూ.. అనుమానిత ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని DSP వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

February 22, 2026 / 05:35 PM IST

జైలు భరోకు సిద్ధం కావాలని అంబటి పిలుపు

AP: కేసులకు వైసీపీ కార్యకర్తలు భయపడకూడదని మాజీ మంత్రి అంబటి రాంబాబు సూచించారు. వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తే జైళ్లు సరిపోతాయా అని నిలదీశారు. జైలు భరో కార్యక్రమానికి కూడా సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంత్రి లోకేష్ రెడ్ బుక్‌ను ఎవరూ లెక్కచేయరని తేల్చి చెప్పారు. మూడేళ్ల తర్వాత జగన్ సీఎం అవుతారని జోస్యం చెప్పారు.

February 22, 2026 / 05:35 PM IST

‘భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వైసీపీ వ్యవహరిస్తుంది’

ప్రకాశం: భక్తుల విశ్వాసాలను దెబ్బతీయడానికి ఎవరికీ హక్కు లేదని, ప్రజల భావోద్వేగాలతో రాజకీయ లాభం పొందాలని ప్రయత్నించడం తగదని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఆదివారం ఒంగోలు టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నేతలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం సిగ్గుచేటని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

February 22, 2026 / 05:34 PM IST

పెళ్లి ఫిక్స్ అయింది.. కానీ అనుమానం!

TG: జోగులాంబ గద్వాల జిల్లా చింతలకుంటలో విషాదం చోటు చేసుకుంది. కాబోయే వరుడి వేధింపులు తాళలేక స్నేహ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా యువతి క్యారెక్టర్‌పై కాబోయే వరుడు తరుచూ ఫోన్‌లో వేధించేవాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడు హరికృష్ణను అదుపులోకి తీసుకున్నారు.

February 22, 2026 / 05:33 PM IST

అప్పుల‌కు లెక్కలు చెప్పే దమ్ముందా..?

VSP: కూటమి ప్రభుత్వం 20 నెలల్లో చేసిన రూ.3.28 లక్షల కోట్ల అప్పులకు లెక్కలు చెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు సవాల్ చేశారు. ఆదివారం విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఆదాయ వృద్ధి కేవలం 1.97% ఉండగా 11.09% జీఎస్డీపీ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. వైసీపీ ఐదేళ్లలో చేసిన అప్పు రూ.3.39 లక్షల కోట్లు మాత్రమేనని గుర్తుచేశారు.

February 22, 2026 / 05:33 PM IST