• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సత్తా చాటిన నిర్మల్ జిల్లా క్రీడాకారులు

NRML: ఆదివారం జరిగిన రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలలో నిర్మల్ జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటారు. రిథమిక్ యోగ అండర్-14 సబ్ జూనియర్ బాలుర విభాగంలో మాగం చరణ్ వెండి పతకం సాధించగా, అండర్-25 విభాగంలో దిలీప్ బంగారు పతకం అందుకున్నారు. జిల్లాకు మరిన్ని విజయాలు సాధించిన క్రీడాకారులను అధికారులు అభినందించారు.

February 22, 2026 / 06:58 PM IST

జిల్లాలో రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం

GNTR: ప్రజా సమస్యల పరిష్కారానికి సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించే ఈ కార్యక్రమాలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, ఆర్డీవోలు గ్రామ స్థాయి రికార్డులతో హాజరై ప్రజల అర్జీలు స్వీకరిస్తారని చెప్పారు.

February 22, 2026 / 06:57 PM IST

బొగ్గరంలో ప్రసన్నాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు

PLD: ఈపూరు మండలం బొగ్గరం గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరుణాళ్ల సందర్భంగా ఆదివారం స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక అభిషేకాలు, అర్చనలను భక్తులు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని పొంగళ్లు పొంగించి స్వామికి నైవేద్యం సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

February 22, 2026 / 06:57 PM IST

తిరువూరులో ఆంగ్ల ఉపాధ్యాయురాలికి సత్కారం

NTR: అంతర్జాతీయ మాతృభాషా వారోత్సవాల ముగింపు సందర్బంగా తిరువూరు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల సీనియర్ ఆంగ్ల ఉపాధ్యాయురాలు జయశ్రీని ఎల్టా కన్వీనర్ యం. రాం ప్రదీప్ పాఠశాలలో ఆదివారం శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంగ్ల ఉపాధ్యాయ సిబ్బంది కె. లావణ్య, ఎన్.గీత, విద్యార్థులు పాల్గొన్నారు.

February 22, 2026 / 06:56 PM IST

కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి రూ.1 లక్ష విరాళం

ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం స్థానిక దాత ఎనిమిరెడ్డి బాలకోటయ్య రూ.1,00,000లను అందించారు. ఈ చెక్కును ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు నరసింహారెడ్డికి సమర్పించారు. కనిగిరి మండలం రాగిమనిపల్లికి చెందిన బాలకోటయ్య సేవా భావాన్ని ఎమ్మెల్యే అభినందిస్తూ, ఆసుపత్రి అభివృద్ధికి ఈ నిధులు వినియోగిస్తామని తెలిపారు.

February 22, 2026 / 06:54 PM IST

ప్రతి గ్రామానికీ భారత్ నెట్ చేరాలి: జ్యోతిరాదిత్య

AP: ప్రస్తుతం భారత్‌లో 40 కోట్ల మంది 5జీ వినియోగదారులు ఉన్నారని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సిందియా తెలిపారు. ఈ సంఖ్య త్వరలోనే వందకోట్లకు చేరుతుందన్నారు. దేశంలోని ప్రతి గ్రామానికీ భారత్ నెట్ చేరాలని ఆకాంక్షించారు. మోదీ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందని చెప్పారు. భారత్ నెట్ కింద దేశవ్యాప్తంగా 800 టవర్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు.

February 22, 2026 / 06:54 PM IST

మచిలీపట్నంలో రోడ్డు భద్రతపై అవగాహన

కృష్ణా: మచిలీపట్నం NH-216 పై కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు, డీఎస్పీ రాజా పర్యవేక్షణలో ట్రాఫిక్ సీఐ రాజు ఆధ్వర్యంలో హెల్మెట్ ధారణ, రోడ్డు భద్రతపై వాహనదారులకు ప్రత్యేక అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాద రహిత జిల్లాగా మార్చాలని అధికారులు కోరారు.

February 22, 2026 / 06:54 PM IST

హుజూర్నగర్‌లో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం

SRPT: హుజూర్‌నగర్ మున్సిపాలిటీ చైర్మన్‌గా రెండోసారి ఎన్నికైన దొంతగాని శ్రీనివాస్ గౌడ్‌తో పాటు మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికైన ఏడుగురు గౌడ కౌన్సిలర్లను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పట్టణంలోని శ్రీ కంఠమహేశ్వరి సూరమాంబ దేవస్థానం సన్నిధిలో కార్యక్రమం నిర్వహించారు. జై గౌడ సంఘం నాయకులు, గౌడ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభినందనలు తెలిపారు.

February 22, 2026 / 06:53 PM IST

ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి నివాళులర్పించిన ఎస్పీ

బాపట్ల: తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలోని ఉయ్యాలవాడ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

February 22, 2026 / 06:52 PM IST

‘పరీక్షల సమయంలో జిరాక్స్ షాపులు మూసివేయాలి’

SKLM: ఆమదాలవలసలోని ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల కేంద్రం సమీపంలో 144 సెక్షన్ అమలు చేసినట్లు స్థానిక ఎస్సై బాలరాజు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. పరీక్షల సమయంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు నివారించేందుకు ఈనెల 23 నుండి మార్చి 18 వరకు ప్రతిరోజూ ఉ. 8 గంటల నుంచి మ. 1 గంట వరకు జిరాక్స్ షాపులు, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయాలని పేర్కొన్నారు.

February 22, 2026 / 06:50 PM IST

సేవాభావం చాటుతున్న సత్యన్న సేన సంస్థ

సత్యసాయి: తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ వద్ద ఆదివారం సత్యన్న సేన సభ్యులు సేవా కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ స్ఫూర్తితో ఐదుగురు గర్భిణీలకు ఆరు రకాల పౌష్టికాహారాన్ని అందజేశారు. నిరుపేద గర్భిణీలకు ప్రసవం వరకు ప్రతి నెలా ఈ పోషక ఆహారం పంపిణీ చేస్తామని సభ్యులు తెలిపారు. కరోనా కాలం నుంచి ఈ సేవ చేస్తున్నామని తెలిపారు.

February 22, 2026 / 06:50 PM IST

పేకాట శిబిరంపై దాడి.. కేసు నమోదు

కృష్ణా: ఉయ్యూరు రూరల్ పరిధిలోని పెదఓగిరాల గ్రామంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ఎస్సై సురేష్ బాబు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.5,800ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 22, 2026 / 06:50 PM IST

కరీంనగర్ కార్పొరేషన్లో ‘డిప్యూటీ’ ఛాంబర్ చిచ్చు

కరీంనగర్ నగర పాలక సంస్థలో ఎన్నికలు ముగిసిన ప్రతిసారీ డిప్యూటీ మేయర్ ఛాంబర్ కేటాయింపు రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. 2005లో మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా అప్గ్రేడ్ అయినప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతుండటం గమనార్హం. గతంలో డిప్యూటీగా పనిచేసిన తాజా మాజీ మేయర్ సునీల్ రావుకు ఛాంబర్ కేటాయించవద్దనే డిమాండ్ తాజాగా మళ్లీ తెరపైకి వచ్చింది.

February 22, 2026 / 06:49 PM IST

‘మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం’

MDCL: మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం అని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. అదివారం బోయినపల్లిలోని తన కార్యాలయంలో కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు సమర్పించిన వినతిపత్రాలను స్వీకరించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి సౌకర్యాలు, విద్యుత్ లైన్ల మార్పు, శ్మశానవాటిక పరిరక్షణ వంటి సమస్యలను ప్రస్తావించారు.

February 22, 2026 / 06:47 PM IST

దేవతామూర్తుల ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే పల్లా

SDPT: మద్దూరు మండలం సలాక్పూర్ గ్రామంలో శ్రీ శంభు-రామ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా జరిగాయి. జనగామ MLA డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి మొక్కలు చెల్లించుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

February 22, 2026 / 06:46 PM IST