అన్నమయ్య: రైల్వే కోడూరులోని రంగనాయకుల పేటలో ఇవాళ B.Ed చదువుతున్న ఆమంచి భార్గవి (24) ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI లక్ష్మీ ప్రసాల్ రెడ్డి తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
PDPL: మంథని మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్ నగర్, కూచిరాజుపల్లి, గంగాపురి స్టేజీల వద్ద రాత్రి సమయంలో ఎక్స్‌ప్రెస్ బస్సులు నిలిపివేయాలని డిపో మేనేజర్ శ్రావణ్‌కుమార్‌కు బీజేపీ నాయకుడు బోయిని నారాయణ వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లి తిరిగివచ్చే ప్రయాణికులు బస్సులు ఆగక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
మంచిర్యాల మేయర్ ధరణి మధుకర్‌ను కాంగ్రెస్ పార్టీ లక్షేట్టిపేట మండల నాయకులు కలిశారు. మంచిర్యాల మేయర్‌గా ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్‌గా సల్ల రమ్య ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా లక్షెట్టిపేట మండల, పట్టణ నాయకులు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. అనంతరం ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
WG: ఆచంట ఎంవీఆర్ జూనియర్ కళాశాల కేంద్రంలో సోమవారం నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 270 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా, ఉదయం 9 గంటలకు పరీక్ష మొదలవుతుందని ప్రిన్సిపల్ ఎన్. శ్రీదేవి తెలిపారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలో జరుగుతాయని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.
ATP: ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు 29 మంది బాధితులకు రూ.42 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గత ఐదేళ్లలో నిరుపేదలకు ఇటువంటి సాయం అందలేదని, ఇప్పుడు పారదర్శకంగా లబ్ధి చేకూరుస్తున్నామని తెలిపారు.
GNTR: రాష్ట్రంలోని 16 సంఘాల ఆధ్వర్యంలో మంగళగిరిలో ‘చేనేత గర్జన’ నిర్వహించారు. ఎన్నికల్లో ఇస్తానన్న రూ. 25 వేల సాయం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీలు అమలు చేయలేదని కార్మికులు మండిపడ్డారు. రూ. 203 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిధులు ఇచ్చామని మంత్రి సవిత అబద్ధాలు చెప్తున్నారని, కేంద్రం జీఎస్టీ భారం తగ్గించాలని కోరారు.
TG: ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. అతడిది సాధారణ మరణం కాదని, పక్కాగా ప్లాన్ చేసిన సుపారీ హత్య అని ఖమ్మం పోలీసులు నిర్ధారించారు. నిందితులు శ్రీనివాస్‌ను హతమార్చి.. ఈ మొత్తం తతంగాన్ని కారు ప్రమాదంగా చిత్రీకరించారని దర్యాప్తులో తేలింది. ఇక శ్రీనివాస్ గతంలో పవన్ కళ్యాణ్‌పై ఒక పుస్తకాన్ని రచించిన విషయం తెలిసిందే.
AP: నాలుగు ఆలయాల ట్రస్ట్ బోర్డు సభ్యులతో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు భేటీ అయ్యారు. విజయనగరం కోటలోని మాన్సాస్ కార్యాలయంలో ట్రస్ట్ బోర్డు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. పైడితల్లి, మందపల్లి మందేశ్వరస్వామి, సంతపేట జగన్నాథస్వామి, శ్రీకూర్మనాథస్వామి ఆలయాల ట్రస్ట్ బోర్డు సభ్యులు హాజరయ్యారు. ఆలయాల అభివృద్ధి పనులపై ఈవోలు, పాలకమండలి సభ్యులతో చర్చించారు.
SKLM: గ్రామాల్లో చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని పరిశుద్ధ కార్మికులకు ఎమ్మెల్యే గొoడు శంకర్ సూచించారు. గార మండలం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఆదివారం ట్రై సైకిల్స్, చెత్త డబ్బాలు ఆయన పంపిణీ చేశారు. అధికారులతో కలిసి గార జంక్షన్ వరకు అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయొద్దని కోరారు.
BHPL: మున్సిపాలిటీ నూతన ఛైర్మన్‌గా బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ ఛైర్మన్‌గా అంబాల శ్రీనివాస్ ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యఅతిథిగా MLA గండ్ర సత్యనారాయణ రావు హాజరై, మాట్లాడారు. మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారని, ఈ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. అనంతరం నూతన ఛైర్మన్ సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు.
PLD: వినుకొండ TDP కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ ఆంజనేయులు ఆదివారం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారితో ఆయన ముఖాముఖి మాట్లాడి వినతులు స్వీకరించారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇతర ప్రభుత్వ పథకాల మంజూరులో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే తన ప్రధాన ధ్యేయమన్నారు.
KNR: శంకరపట్నం మండలంలో 8402 మంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్ తెలిపారు. 4135 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోలేదని, రైతులు తమ వ్యవసాయ క్లస్టర్లలో ఏఈవోలతో ఈనెల 28లోగా చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోని రైతులు కేంద్ర ప్రభుత్వ పథకాల అర్హత కోల్పోతారని స్పష్టం చేశారు.
SDPT: బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ధర్మగుండం పునర్నిర్మాణ పనులను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్ పరిశీలించారు. దాతల సహకారంతో జరుగుతున్న ఈ పనులను బ్రహ్మోత్సవాల (జాతర)లోపు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని ఆలయ కమిటీకి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్, సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
JN: జిల్లాలో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2.73 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. 2025-26 సంవత్సరానికి సంబంధించి SMAM పథకం కింద ఈ నిధులు మంజూరైనట్లు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పేర్కొన్నారు. రైతులకు కావలసిన యంత్ర పరికరాలు 50% రాయితో అందిస్తామని,రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని డీడీ రూపంలో సంబంధిత కంపెనీలకు చెల్లించాలని సూచించారు.
NLG: చిట్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా పందిరి గీత రమేష్, వైస్ ఛైర్ పర్సన్‌గా గుండెబోయిన శ్రీ లక్ష్మి సైదులు, కౌన్సిలర్లు ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్ దండు శ్రీనివాస్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే వేముల, రాష్ట్ర డైరీ ఛైర్మన్ గుత్తా అమిత్ నూతన పాలకవర్గాన్ని సన్మానించి, అభినందించారు.