• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆదర్శవంతమైన డివిజన్‌గా తీర్చిదిద్దడానికి కృషి

KNR: నగరంలోని 50 డివిజన్‌గా చెత్త సేకరణ నిమిత్తం నూతన ట్రాక్టర్ కేటాయించిన వాహనాన్ని కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 50వ డివిజన్ను క్లీన్ డివిజన్గా మార్చి, ఆదర్శవంతమైన డివిజన్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని అన్నారు. నూతన ట్రాక్టర్ కేటాయించిన మేయర్, కమిషనర్‌లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

March 1, 2026 / 08:31 AM IST

పదవీ విరమణ చేసిన పోలీసులకు ఘన సన్మానం

సత్యసాయి: జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ చేసిన ఏఆర్ ఏఎస్ఐ భాషా, హెడ్ కానిస్టేబుల్ ఎర్రిస్వామిలను ఘనంగా సన్మానించారు. వారి సేవలను కొనియాడుతూ జ్ఞాపికలు అందజేశారు. కష్టసమయాల్లోనూ శాఖకు అందించిన సేవలు అమూల్యమని ఎస్పీ ప్రశంసించారు. విశ్రాంతి జీవితం కుటుంబంతో ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు.

March 1, 2026 / 08:30 AM IST

ఈ ఏడాది జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం

ATP: ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది ఉమ్మడి అనంతపురం జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. సముద్రంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల రుతుపవనాలపై ప్రభావం పడుతుందన్నారు. మార్చి నుంచే ఎండలు ముదురుతాయని, రైతులు బెట్టకు తట్టుకునే స్వల్పకాలిక పంటలు సాగు చేయాలని సూచించారు.

March 1, 2026 / 08:30 AM IST

శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దు

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ నెల 3న చంద్రగ్రహణం కారణంగా, 2, 3 తేదీలకు సంబంధించిన దర్శన టోకెన్లను జారీ చేయబోమని స్పష్టం చేసింది. 4వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకెన్లను 3న జారీ చేస్తారు. భక్తులు ఈ మార్పులను గమనించాలని అధికారులు సూచించారు.

March 1, 2026 / 08:29 AM IST

జిల్లాలో మంచు ప్రభావం.. రైతుల్లో ఆందోళన

మన్యం: గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతంలో ఉదయం వేళల్లో దట్టమైన మంచు కమ్ముకోవడంతో పలు గిరిజన గ్రామాలు మంచు దుప్పటిలో మూసుకుపోయాయి. రహదారులపై కనీస దృశ్యమానత లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మామిడి పూత, జీడి పంటలకు నష్టం కలుగుతుందేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

March 1, 2026 / 08:29 AM IST

రూ. 5 లక్షలకు జిల్లా కోర్టులో ఐపీ దాఖలు

ఖమ్మం రూరల్ మండలం M.V పాలెంకు చెందిన బొందల రాజశేఖర్- కళ్యాణి దంపతులు జిల్లా కోర్టులో రూ. 5 లక్షలకు ఐపీ దాఖలు చేశారు. కాగా వీరు కొంతమంది రుణదాతల వద్ద అవసరాల నిమిత్తం రూ. 5 లక్షలు అప్పుతీసుకుని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాటిని చెల్లించడం కష్టమైంది దీంతో దంపతులు తమను దివాళా దారులుగా ప్రకటించాలని జిల్లా కోర్టులో తమ న్యాయవాది ద్వారా ఐపీ దాఖలు చేశారు.

March 1, 2026 / 08:26 AM IST

ఈనెన3న గూడెంగుట్ట దేవాలయం మూసివేత

MNCL: దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని మూసివేయనున్నామని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. చంద్రగ్రహణం కావడంతో ఫిబ్రవరి 3న దేవాలయంలో ఉదయాన్నే పూజలు నిర్వహించి మూసివేస్తామన్నారు. ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఉండవని వెల్లడించారు. 4న దేవాలయంలో సంప్రోక్షణ పూజలు చేసి భక్తులను అనుమతిస్తామని తెలిపారు.

March 1, 2026 / 08:25 AM IST

‘కుట్రలు, కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ’

AP: కుట్రలు, కుతంత్రాలకు వైసీపీ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని మహిళా సహకార ఆర్థిక సంస్థ ఛైర్‌పర్సన్ పీతల సుజాత విమర్శించారు. సగత ప్రభుత్వంలో నీటి కాలుష్యంతో ఏలూరులో వందల మంది ఆస్పత్రి పాలయ్యారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి 25 మంది కన్నుమూశారు. నంద్యాల, రామతీర్థం, కాకినాడ తదితర ప్రాంతాల్లో అతిసారం ప్రబలి ప్రజలు పిట్టల్లా రాలిపోయారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

March 1, 2026 / 08:24 AM IST

వైభవంగా శ్రీ సీతారాముల శాంతి కళ్యాణం

VZM: శ్రీ రామనారాయణంలో ఇవాళ శ్రీ సీతారాముల శాంతి కళ్యాణం అంగరంగ వైభవంగా సాగింది. పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని దేవాలయం అర్చకులు శ్రీ హర్ష, కృష్ణ తేజ ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా సీతారామ కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు నారాయణం శ్రీనివాస్, నీరజవల్లి దంపతులు, పద్మ, చంద్రకళ, రవి, భక్తులు పాల్గొన్నారు.

March 1, 2026 / 08:24 AM IST

స్ఫూర్తి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

WGL: గీసుగొండ (M)లోని వంచనగిరి KGVBలో శనివారం సాయంత్రం నిర్వహించిన స్ఫూర్తి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్ఫూర్తి కార్యక్రమం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు లక్ష్యం ఎంచుకొని పట్టుదలతో చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు.

March 1, 2026 / 08:24 AM IST

నరసాపురంలో UTF సభ్యత్వ నమోదు

W.G: నరసాపురం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం UTF జిల్లా కుటుంబ సంక్షేమ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతికుమార్, డైరెక్టర్ ఏ. రామభద్రం పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయ కుటుంబాలకు అండగా నిలిచేందుకు సంక్షేమ సంఘం ఆవశ్యకతను వివరించారు. విధి విధానాలను తెలియజేశారు.

March 1, 2026 / 08:23 AM IST

నేడు జిల్లాకు మంత్రి ఉత్తమ్ రాక

SRPT: రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ ఆదివారం హుజూర్‌నగర్ రానున్నారు. మంత్రి సాయంత్రం 4 గంటలకు పట్టణానికి చేరుకుని రామస్వామి గుట్ట హౌసింగ్ కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తారు. అనంతరం పనుల పురోతిపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షిస్తారు. సాయంత్ర 6 గంటలకు హైదరాబాద్ తిరిగివెళ్తారు.

March 1, 2026 / 08:23 AM IST

అర్థరాత్రి ప్రమాదం.. లారీ ఢీకొని వ్యక్తి మృతి

VSP: జాతీయ రహదారి పాత గాజువాక కూడలిలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తిని లారీ ఢీకొనడంతో మృతిచెందారు. పాత గాజువాక సిగ్నల్స్ వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో BHPV నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న పోలీసులు క్షత గాత్రుడిని కేజీహెచ్‌కు తరలిస్తుండగా మృతిచెందినట్లు సీఐ హుస్సేన్ తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

March 1, 2026 / 08:23 AM IST

రైల్వే కూలీలతో జగ్గారెడ్డి ముచ్చట్లు!

MDK: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. సికింద్రాబాద్ స్టేషన్లో దిగగానే రైల్వే కూలీలు ఆయనను కలిసి ఉత్సాహంగా గ్రూప్ ఫొటో దిగారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి వారితో సరదాగా ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూలీల సంక్షేమానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

March 1, 2026 / 08:22 AM IST

వివాహితను బ్లాక్‌మెయిల్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు

GNTR: వివాహిత వ్యక్తిగత వీడియోలను ఆమె భర్తకు, తండ్రికి పంపి వేధిస్తున్న మాజీ ప్రియుడిపై అరండల్‌పేట పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. గతంలో ప్రేమించిన యువతి మరొకరిని వివాహం చేసుకోవడంతో, మాజీ ప్రియుడు కక్ష పెంచుకున్నాడు. పాత వీడియోలను ఉపయోగించి ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడనే బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

March 1, 2026 / 08:21 AM IST