BDK: ఇంటర్, టెన్త్ పరీక్షల తర్వాతే MPTC, ZPTC ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ DCCలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. తర్వాత మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, అనంతరం ఇంటర్, టెన్త్ పరీక్షలు ఉన్నాయి. దీంతో అధికారులు ఆయా పనుల్లో ఉండనున్నారు. పరీక్షల తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.
కోనసీమ: ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘స్టాప్ వాష్ అండ్ గో’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. జాతీయ రహదారులు, గ్రామీణ రహదారులపై నిద్రమత్తు వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. దీనిపై దృష్టి సారించి అమలాపురంలో సోమవారం తెల్లవారుజామున డ్రైవర్లను ఆపి, ముఖం కడుక్కునేలా చేసి ప్రయాణానికి అనుమతిస్తున్నారు.
HYD: గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనదారులు భారీగా ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నానక్‌రామ్‌గూడ నుంచి గచ్చిబౌలి సర్కిల్ వైపు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. లేన్ క్రమశిక్షణ పాటించాలని కోరారు.
PDPL: సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామానికి చెందిన ముక్కెర రాజ్ కుమార్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఇవాళ ఆయన కుటుంబానికి 2018 డిగ్రీ బ్యాచ్ స్నేహితులు చేయూతనందించారు. మానవత్వాన్ని చాటుతూ రూ.30 వేలు ఆర్థికసాయం అందించారు. ఈ సందర్భంగా రాజ్కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కష్టకాలంలో స్నేహితుల మద్దతు ఎంతో బలాన్నిస్తుందన్నారు.
AP: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలపై త్వరలోనే మరోసారి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని హోంమంత్రి అనిత అన్నారు. విద్వేష, అసభ్య పోస్టుల కట్టడికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్కూల్ విద్యార్థులు సోషల్ మీడియా వినియోగించకుండా కొత్త చట్టం తెచ్చే ఆలోచన ఉందన్నారు.
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మరోసారి తుపాకులు, బాంబు పేలుళ్లతో దద్ధరిల్లుతోంంది. మావోయిస్టు అగ్రనేతలే లక్ష్యంగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. డ్రోన్ల సాయంతో మావోయిస్టుల కదలికలను పర్యవేక్షిస్తున్నారు. సరిహద్దు దాటి చొరబడకుండా ఛత్తీస్‌గఢ్ పోలీసులు, ఇటు తెలంగాణ గ్రేహౌండ్స్ దళాలు సమన్వయంతో జాయింట్ కూంబింగ్ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నాయి.
SDPT: తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న ఆశా వర్కర్లను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని BJP నాయకులు మండిపడ్డారు. నియోజకవర్గంలో అరెస్టైన ఆశా వర్కర్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో ఉంచిన వారికి కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు.
SKLM: యువ రచయితలను ప్రోత్సాహించటం ఆనందదాయకమని, డా.బీ ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా గ్రంథాలయంలో యువ రచయితల వేదిక అధ్యక్షులు తంగి ఎర్రమ్మ, కార్యదర్శి పొట్నూరి మాలతిల ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. కవి సమ్మేళనంలో పలువురు కవులు తమ కవితలను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో గేదెల, వాసవి, తదితరులు పాల్గొన్నారు.
NDL: చిన్నదేవలాపురం గ్రామంలో నిన్న రాత్రి జరిగిన ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంలో షేక్ మాభూసా కుటుంబానికి చెందిన పశువుల పాక పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న బండి ఆత్మకూరు టీడీపీ మండల అధ్యక్షులు ముమ్మడి నాగ కృష్ణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని సోమవారం పరామర్శించారు.
RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని రామంతాపూర్‌లో ఎల్లమ్మ దేవాలయం మొదటి వార్షికోత్సవం సందర్భంగా శంకర్ పల్లి మున్సిపల్ ఛైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు. కౌన్సిలర్లు ప్రశాంత్, అశోక్, నాయకులు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లాలో కో-ఆప్షన్ పదవుల కోసం ఆశావహులు నిరీక్షిస్తున్నారు. గతంలో పార్టీ కోసం అహర్నిశలు పని చేసిన సీనియర్ నాయకులకు నామినేటెడ్ పదవులు దక్కుతాయని ఆశిస్తున్నారు. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్‌లు, మేయర్, ఛైర్మన్‌లుగా బాధ్యతలు చేపట్టారు. ఇక కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక మిగలగా, ఆశావహులు MLA ల ఆశీర్వాదం కోసం వేచిచూస్తున్నారు.
PDPL: ముత్తారం మండలం ఒడేడు గ్రామంలో దొంగలు హల్‌చల్ చేశారు. ఆదివారం కజ్జం రమణయ్య బంధువుల ప్రథమ వర్ధంతి కోసం ఆదిలాబాద్ వెళ్లగా, గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి వెనుక తలుపు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలోని రూ.10వేల నగదు అపహరించారు. గతంలోనూ ఆయన ఇంట్లో చోరీ జరగడం గమనార్హం. బాధితుడి ఫిర్యాదు మేరకు ముత్తారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
BDK: అశ్వాపురం మండలం, భీముని గుండం కొత్తూరులో జవహర్ నవోదయ విద్యాలయ నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 33 ఎకరాల భూమిని కేంద్రానికి అప్పగించగా, సుమారు రూ. 80 కోట్లతో NBCC నిర్మాణం చేపట్టనుంది. ఈ విద్యాలయం ద్వారా జిల్లా విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందుబాటులోకి రానుంది.
CTR: మానవత్వానికి కులమతాల అవసరం లేదని నిరూపించిన సంఘటన వీకోట మండలం చౌడేపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. అబ్దుల్ బాషా, షబీనా దంపతులు తల్లిదండ్రులు లేని హేమలత అనే ఓ హిందూ చిన్నారిని పెంచి పెద్ద చేశారు. తమ స్తోమత మేరకు చదువు సైతం చెప్పించారు. ఓ మంచి హిందూ సంబంధం చూసి హిందూ పద్ధతిలో వివాహం జరిపించారు.
AP: ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. జాబ్ క్యాలెండర్‌లోనే డీఎస్సీ పోస్టుల వివరాలు వెల్లడిస్తామని ప్రకటించారు. ఉన్నత విద్యలో ఇంజినీరింగ్ సహా పాలిటెక్నిక్, ఐటీఐ కూడా కీలకమన్నారు. క్లస్టర్ బేస్ట్ అప్రోచ్ ఆధారంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు అనుబంధంగా వచ్చే ఏడాదిలోగా పనులు చేస్తామని వెల్లడించారు.