MNCL: గ్రామాల అభివృద్ధి ప్రణాళికలలో వార్డు సభ్యుల భాగస్వామ్యం ముఖ్యమైందని జన్నారం ఎంపీడీవో ఉమర్ షరీఫ్, ఎంపీఓ జలంధర్ అన్నారు. జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు మండల కేంద్రంలోని రైతు వేదికలో రెండో విడత శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు అవసరమన్నారు.
JGL: భీమారం మండలం గోవిందరం గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మిస్తున్న మహిళా సమైక్య సంఘం (VO) భవన నిర్మాణానికి సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదగాలని అన్నారు. అలాగే మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం వెల్లడించారు.
MNCL: కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్లు నిండిన సందర్భంగా ఈనెల 27న హైదరాబాద్‌లో సదస్సు నిర్వహిస్తున్నట్లు CPI (ML) న్యూడెమోక్రసీ కోల్ బెల్ట్ కార్యదర్శి బ్రహ్మానందం తెలిపారు. రామకృష్ణాపూర్లో సోమవారం సదస్సు పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలు, మేధావులు, న్యూడెమోక్రసీ కార్యకర్తలు సదస్సులో పాల్గొని సదస్సు విజయవంతం చేయాలన్నారు.
NRML: ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో వారు ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల నుండి వచ్చిన అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు.
WGL: వరంగల్ పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ రెండు రోజుల సాధారణ సెలవులు అనంతరం సోమవారం పున:ప్రారంభమైంది. నేడు వివిధ సరుకుల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటాల్ పత్తి ధర రూ. 7,545, క్వింటాల్ తేజ మిర్చి ధర రూ. 18,300, క్వింటాల్ వండర్ హట్ ధర రూ. 37,000, క్వింటాల్ 341(కారం కాయ) ధర రూ. 22,100 గా ధరలు నమోదయ్యాయి.
VZM: దివంగత మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రం నాయుడు 69వ జయంతి సందర్భంగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇవాళ రణస్థలం మండలం జె. ఆర్. పురం సూర్య పబ్లిక్ స్కూల్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళర్పించారు. ఈ సందర్బంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రణస్థలం మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు లంక శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.
KNR: రామగుండం కార్పొరేషన్ వెంకట్రావుపల్లి అంగన్వాడీ కేంద్రంలో టీచర్‌గా పని చేసే రమ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. కార్పొరేషన్ 16వ డివిజన్ నుంచి BRS అభ్యర్థిగా ఆమె పోటీ చేసి విజయం సాధించారు. చిన్ననాటి నుంచి ప్రజలకు సేవ చేయాలనే తపన ఉందన్నారు. గత ఎన్నికల్లో అదే డివిజన్‌లో భర్త కిషన్ రెడ్డి కార్పొరేటర్‌గా ఉన్నారు.
TG: హైదరాబాద్ కోఠిలో ఆశావర్కర్లు ఆందోళన చేస్తున్నారు. ఆరోగ్యశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి వచ్చిన ఆశావర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. కనీస వేతనం రూ.18 వేలకు పెంచాలని డిమాండ్ వారు చేస్తున్నారు. ధర్నా చేస్తున్న ఆశావర్కర్లను పోలీసులు పీఎస్‌కు తరలించారు. అలాగే, ధర్నాకు వస్తున్న ఆశావర్కర్లను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
KMM: తిరుమలాయపాలెం గ్రామ ప్రజల అవసరాల నిమిత్తం సుబ్లేడులో కొత్తగా వారాంతపు సంతను ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ సంగబత్తుల స్వాతి సుమన్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం నుంచి ప్రతి వారం ఈ సంత నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం సంత నిర్వహించే ప్రదేశాన్ని డోజర్‌తో శుభ్రం చేయించి, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ELR: సంత్ గాడ్గే బాబా జయంతి సందర్భంగా ఇవాళ ఏలూరు అశోక్ స్తంభం సెంటర్ వద్ద స్వచ్ఛభారత్ కార్యక్రమం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్ , జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు అగ్రహారపు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం పరిసరాలను పరిశుభ్రం చేశారు.
ELR: సంత్ గాడ్గే బాబా జయంతి సందర్భంగా ఇవాళ ఏలూరు అశోక్ స్తంభం సెంటర్ వద్ద స్వచ్ఛభారత్ కార్యక్రమం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్ , జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు అగ్రహారపు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం పరిసరాలను పరిశుభ్రం చేశారు.
BPT: ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కృషి, పట్టుదలే విజయానికి మార్గమని పేర్కొన్నారు. ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు విజయాలతో వెలిగిపోవాలని ఆకాంక్షించారు.
SRPT: కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామ సర్పంచ్ శరభయ్య తండ్రి రామారావు సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వారి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కోదాడ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
PLD: మాచర్ల – విజయవాడ ప్యాసింజర్ రైలు కింద పడి వీరిశెట్టి వైష్ణవి (29) అనే మహిళ మృతి చెందారు. సోమవారం గురజాల రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలు ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఈ విపరీత నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.