బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరగడంపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. దేశంలో బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో లేవని వెల్లడించారు. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లతోనే బంగారానికి రెక్కలు వచ్చినట్లు చెప్పారు. ఈ పరిణామాలను RBI ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు నిర్మలమ్మ పేర్కొన్నారు.
MDK: చేగుంట మండలం రుక్మాపూర్‌లో ఏజెన్సీ కంపెనీ ద్వారా వరి సాగు చేసి నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి రైతులకు పరిహారం చెక్కులు అందజేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్, సర్పంచ్ నవీన్, pacs ఛైర్మెన్ పరమేశ్, ఎఎంసి డైరెక్టర్ స్టాలిన్ నర్సింలు పాల్గొన్నారు.
హనుమకొండ జిల్లా స్థాయి ఛీఫ్ మినిస్టర్స్ కప్ ముగింపు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన అభ్యర్థులకు స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి బహుమతులను అందించారు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడం లక్ష్యంగా సీఎం కప్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
BHNG: మోత్కూరు మున్సిపాలిటీని అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే సామేలు అన్నారు. సోమవారం మోత్కూర్ మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్‌పర్సన్ మరియు వైస్ ఛైర్మన్‌లు పదవి బాధ్యతల స్వీకరణ తదుపరి మొదటి సాధారణ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రజా సమస్యలు పరిష్కారానికి అందరూ భాగస్వాములు కావాలన్నారు.
BDK: చర్ల సత్యనారాయణపురం గ్రామం సర్పంచ్ గౌతమి ప్రభుత్వ మీసేవలో విధులు నిర్వహిస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్‌గా గెలిచి ప్రభుత్వ మీసేవ దగ్గర విధులు నిర్వహిస్తున్నారని ఇది పంచాయతీరాజ్ చట్టానికి వ్యతిరేకమని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కారం నరేష్ ఇవాళ స్పష్టం చేశారు. తనపై చర్యలు తీసుకోవాలని ఎండీవోకు వినతిపత్రం అందజేశారు.
SRPT: సూర్యాపేట మున్సిపాలిటీని సుందరీకరణకు కృషి చేస్తామని ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేటలోని 46, 47వ వార్డుల్లో రూ.50 లక్షలతో నాలా కల్వర్టు, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మున్సిపల్ ఛైర్‌పర్సన్ నివేదితతో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు. వారం రోజుల్లో సీఎంని కలిసి ప్రత్యేక నిధులు విడుదల చేయాలని కోరనున్నట్లు పేర్కొన్నారు.
KRNL: ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో ఇటీవల విధుల్లో చేరిన 12 మంది పారిశుద్ధ్య కార్మికుల పేర్లను మూడు నెలలు గడిచినా ఆప్కాస్‌లో ఆన్లైన్ చేయలేదని AITUC నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కార్మికులతో కలిసి జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తక్షణమే పేర్లు ఆన్ లైన్ చేసి, మూడు నెలల పెండింగ్ జీతాలు చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు.
HYD: ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 18 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇవి జరుగుతాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. మొత్తం 9,97,075 మంది విద్యార్థులు హాజరవుతుండగా, 1,495 కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్షల పర్యవేక్షణకు 28,500 మంది ఇన్విజిలేటర్లు నియమించారు.
TPT: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆర్జిదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్ర రెడ్డి, శివశంకర్ నాయక్, రోజ్ మాండ్‌లు కార్యక్రమంలో పాల్గొన్నారు.
VKB: దోమ మండలం పాలేపల్లి గ్రామానికి చెందిన తుప్పలి వెంకటమ్మకి సీఎం సహాయనిధి కింద రూ. 60,000 మంజూరైంది. ఈ చెక్కును గ్రామ సర్పంచ్ సుజాత బసప్ప, ఉప సర్పంచ్ జె.దస్తయ్య అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చొరవ తీసుకొని నిధులు మంజూరు చేయించారని సర్పంచ్ తెలిపారు.
KMR: జిల్లా కేంద్రంలోని సీఐటీయూ నాయకులను ఆశ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆశ వర్కర్ల సమస్యలపై సీఐటీయూ ‘ఛలో హైదరాబాద్’కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పట్టణంలోని సంగమేశ్వర్ కాలనీలో సోమవారం సీఐటీయూ నాయకుడు జె.రవీందర్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.
NZB: వేల్పూర్ మండలం అంక్సాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశం ప్రారంభమైంది. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు మల్లీశ్వరి ఉపాధ్యాయులకు అకాడమిక్ విషయాలపై పలు సూచనలు చేశారు. ఈ కాంప్లెక్స్ సమావేశంలో వివిధ పాఠశాల ఉపాధ్యాయులు రాజేందర్ గౌడ్ పాల్గొన్నారు.
ATP: MLA పరిటాల సునీత ఆదేశాలతో చిన్నంపల్లి పంచాయతీ అన్నే ఫెర్రర్ కాలనీలో పేద విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేశారు. గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష కోచింగ్ సెంటర్ నందు చదువుతున్న వారికి మాజీ మండల కన్వీనర్ మారినేని లక్ష్మీనారాయణ తన సొంత నిధులతో పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
NLG: నకిరేకల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంతు సేవాలాల్ జయంతి వేడుకలను సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బంజారా సమాజానికి సేవాలాల్ చేసిన సేవలను కొనియాడారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ చెవిగోని రజిత, ఇతర నాయకులు పాల్గొన్నారు.
KRNL: నందవరం మండలం గురజాల గ్రామంలో వెలసిన ప్రసిద్ధ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య అభిషేకం, అర్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాచాపురం సర్పంచ్ వై. జయమ్మ పాల్గొన్నారు.