• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘పసికందును చంపిన దోషులను శిక్షించాలి’

WGL: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో కులం పేరుతో రజాక కుటుంబంపై జరిగిన దారుణ దాడిని BSP జిల్లా అధ్యక్షుడు బస్కే నాగరాజు ఖండించారు. సోమవారం సాయంత్రం నర్సంపేటలో BSP నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో చనిపోయిన పసికందుకు నివాళులర్పించారు. నాగరాజు మాట్లాడుతూ.. రెండు నెలల పసికందును కాళ్లతో తన్ని హత్య చేసిన దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 05:20 PM IST

ఫార్మర్ ఐడీపై ఏఈవో సూచనలు

MBNR: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పొందాలంటే రైతులకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి అని పోల్కంపల్లి ఏఈవో శివ తెలిపారు. రైతులు ఆధార్ నంబర్ ద్వారా అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫార్మర్ రిజిస్ట్రీ స్థితిని పరిశీలించుకోవచ్చన్నారు. లింక్‌లో ‘Approved’ లేదా ‘Pending’గా చూపితే నమోదు పూర్తైనట్లేనని స్పష్టం చేశారు. ప్రయోజనాల కోసం వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు.

February 23, 2026 / 05:20 PM IST

శివాజీ విగ్రహ ఏర్పాటును నిలివేయాలని ఆదేశాలు

KMR: లింగంపేట మండలం ముస్తాపూర్ పరిధిలో కరీంనగర్-కామారెడ్డి-ఎల్లారెడ్డి రహదారిలో నోటీసులు అందజేసినప్పటికీ శివాజీ విగ్రహం ఏర్పాటు చేపట్టడంతో లింగంపేట ఎమ్మార్వో కార్యాలయానికి రోడ్లు, భవనాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. హైందవ సమాజాన్ని మేల్కొలిపిన శివాజీ విగ్రహ ఆవిష్కరణను ఆపివేయించడం తగదని పలు సంఘాలు మండిపడుతున్నాయి.

February 23, 2026 / 05:19 PM IST

‘చదువు మన తలరాతను మారుస్తుంది’

HNK: చదువు మన తలరాతను మారుస్తుందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ మర్కజి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా బాలవికాస సహకారంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సరైన మార్గంలో ప్రయాణించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే అన్నారు.

February 23, 2026 / 05:16 PM IST

ప్రజల సమస్యల చట్టపర పరిష్కారానికి తక్షణ కృషి..!

SRPT: పోలీసు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో, ఫిర్యాదు దారులతో ఎస్పీ నరసింహ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా తక్షణ ఆదేశాలు జారీ చేశారు.

February 23, 2026 / 05:16 PM IST

తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన

ELR: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించి, వినతిపత్రం అందించారు. రైతులకు అన్నదాత సుఖీభవ గత ఏడాది బకాయిలు చెల్లించాలని, రైతులకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వర్ధిల్లాలని నినాదాలు చేశారు.

February 23, 2026 / 05:15 PM IST

NDL: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..!

NDL: నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 25 వ తేదీన జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో భారీ ఉద్యోగం మేల నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శశికళ తెలిపారు. ప్రముఖ కంపెనీల నుంచి సుమారు 550 పోస్టుల భర్తీకి ఈ మేలా జరుగుతుందన్నారు. డిగ్రీ పూర్తి చేసిన వారు ఫైనల్ ఇయర్ చదువుతున్న నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

February 23, 2026 / 05:15 PM IST

ప్రత్యేక ఆకర్షణగా ఐఎన్‌ఎస్ విక్రాంత్

విశాఖలోని ‘మిలాన్–2026’, ‘ఐఎఫ్ఆర్’ వేడుకల సందర్భంగా భారత తొలి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ వికాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత్‌తో పాటు పలు స్నేహ దేశాలకు చెందిన 80 మందికి పైగా మీడియా ప్రతినిధులు నౌకను సందర్శించారు. స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన విధానాన్ని ఈస్ట‌ర్న్ నేవ‌ల్ అధికారులు నౌక ప్ర‌త్యేక‌త‌ల‌ను జ‌ర్న‌లిస...

February 23, 2026 / 05:14 PM IST

చిన్నారి ప్రాణం కోసం.. స్థానికుల ర్యాలీ

AP: తాడేపల్లిగూడానికి చెందిన ఓ చిన్నారి SMA అనే వ్యాధితో ఓ బాధపడుతోంది. పునర్విక అనే ఆ చిన్నారి వైద్యం కోసం రూ.16 కోట్లు అవసరమవుతాయని వైద్యులు వెల్లడించారు. దీంతో తాడేపల్లిలో కొంతమంది కలిసి ఆ పాప వైద్యం కోసం ఫండ్స్ సేకరిస్తున్నారు. ఈ క్రమంలో స్థానికులంతా కలిసి ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం దీనిపై స్పందించాలని వారు విజ్ఞప్తి చేశారు.

February 23, 2026 / 05:14 PM IST

‘బాధితుల సమస్యల పరిష్కారమే గ్రీవెన్స్ డే లక్ష్యం’

SRCL: బాధితుల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి 27 ఫిర్యాదులను స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.

February 23, 2026 / 05:13 PM IST

గిట్టుబాటు ధర కల్పించాలని కలెక్టర్‌కు వినతి

అన్నమయ్య: మదనపల్లిలో టమాటా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టమాటా ధరలు భారీగా పడిపోవడంతో పెట్టుబడి కూడా తిరిగి రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో బహుజన్ యువసేన (BYS) ఆధ్వర్యంలో నాయకులు, రైతులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులకు తక్షణ సహాయం అందించాలని కోరారు.

February 23, 2026 / 05:12 PM IST

ప్రజావాణికి 107 ఫిర్యాదులు

NZB: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 107 ఫిర్యాదులు అందాయి. నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్‌లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.

February 23, 2026 / 05:12 PM IST

నరసాపురంలో మోకాళ్లపై ఉద్యోగుల నిరసన

WG: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నరసాపురం డీసీసీబీ బ్రాంచ్ వద్ద సహకార సంఘాల ఉద్యోగులు సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మోకాళ్లపై నిలబడి ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు తమ నిరసనను తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని, పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.

February 23, 2026 / 05:11 PM IST

పెనుకొండలో అంగన్వాడీ వర్కర్ల రిలే నిరాహార దీక్ష

సత్యసాయి: పెనుకొండలో ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్స్ సోమవారం రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. యూనియన్ అధ్యక్షురాలు జయమ్మ, కార్యదర్శి బావమ్మ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం రూ. 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న 1810 మినీ వర్కర్లకు అర్హతల సడలింపు ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చాలన్నారు.

February 23, 2026 / 05:10 PM IST

అన్నమయ్య: సైనిక్ స్కూల్‌లో బాంబు బెదిరింపు

అన్నమయ్య: జిల్లా కలికిరిలోని సైనిక్ స్కూల్‌లో సోమవారం బాంబు బెదిరింపు ఈ-మెయిల్ నేపథ్యంలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. బాంబ్ డిస్పోజల్, డాగ్ స్వాడ్ బృందాల తనిఖీల్లో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. బెదిరింపు పుకారేనని అధికారులు నిర్ధారించగా, ప్రజలు ఆందోళన చెందవద్దని ఎస్పీ ధీరజ్ సూచించారు.

February 23, 2026 / 05:10 PM IST