• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అప్రోచ్ రోడ్డుకు రూ.30 లక్షలు నిధులు మంజూరు

కోనసీమ: ఆలమూరు(మం) లంక గ్రామాలకు ఎంతో ప్రయోజనకరమైన చెముడులంక వంతెన అప్రోచ్ రోడ్డుకు రూ. 30 లక్షలు మంజూరయ్యాయి. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఈ నిధులను మంజూరు చేయించారు. ఏటిగట్టు అవతల ఉన్న బడుగువానిలంక గ్రామ ప్రజలతో పాటు, చెముడులంక, మడికి, పొట్టిలంక తదితర రైతులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

February 18, 2026 / 07:35 PM IST

మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్సీ

KMM: రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను బుధవారం హైదరాబాద్ సెక్రటేరియట్ నందు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఖమ్మం జిల్లాలో గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సంబంధించిన రూ. 5 కోట్ల నిధుల జీవో త్వరగా వచ్చేందుకు అన్ని విధాలుగా సహకరించిన సందర్భంగా ఆయనకు శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు.

February 18, 2026 / 07:51 PM IST

టిఫిన్ సెంటర్లపై అధికారుల దాడులు

VZM: పట్టణంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై పౌర సరఫరా అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 19 గృహ వినియోగ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామని డీఎస్వో మురళీనాధ్ తెలిపారు. ఏడు చోట్ల తనిఖీలు జరిపి 6-ఏ కేసులు నమోదు చేశామని, డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 18, 2026 / 07:30 PM IST

‘విద్యార్థులు ఎక్కువగా విద్యపైన దృష్టి కేంద్రీకరించాలి’

CTR: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ శ్రీ రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సైబర్ నేరాలు, డిజిటల్ మోసాలు, రోడ్డు భద్రత, ధైర్య స్పర్శ చొరవపై దృష్టి సారించాయి. సురక్షితమైన ఆన్‌లైన్ పద్ధతులు, ట్రాఫిక్ నియమాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం వంటి క్రమశిక్షణ లక్షణాలు కలిగి ఉండాలన్నారు.

February 18, 2026 / 07:27 PM IST

అరూరిపై నరుకుడు వెంకటయ్య ఘాటు వ్యాఖ్యలు

WGL: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరుకుడు వెంకటయ్య బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో కాంట్రాక్టర్ రాజ్యం నడిచిందని ఆరోపిస్తూ, ప్రస్తుతం ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు ప్రజల అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ పై పార్టీ మార్పులు, కమిషన్ ఆరోపణలతో విమర్శలు గుప్పించారు.

February 18, 2026 / 07:26 PM IST

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల సంక్షేమం సాధ్యం

RR: ఫరూఖ్ నగర్ మండలం భీమారం గ్రామ పరిధిలో గల మోల్లోన్ గడ్డ తండాలో ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ కార్యక్రమాన్ని ఆదివాసి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు శీను నాయక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాధ్యం అవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోనే పేదల సంక్షేమం సాధ్యమని పేర్కొన్నారు.

February 18, 2026 / 07:25 PM IST

రూరల్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఐజీ

కృష్ణా: గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ ను ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు.పోలీస్ స్టేషన్ లోని రికార్డులను డీఐజీ పరిశీలించి,రికార్డు నిర్వహణ ఎప్పటికప్పుడు నవీకరించుకోవాలని, కేసుల పరిష్కారంలో జాప్షం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, డీఎస్పీ ధీరజ్ వినిల్, పాల్గొన్నారు.

February 18, 2026 / 07:24 PM IST

జనన, మరణాల నమోదుపై కొత్త రూల్స్: కమిషనర్

GNTR: రాష్ట్ర ప్రభుత్వం జనన, మరణాల నమోదుపై జీవోఎంఎస్ 28 ద్వారా కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు కమిషనర్ మయూర్ అశోక్ బుధవారం తెలిపారు. జనన లేదా మరణం జరిగిన 21 రోజుల్లోపు ఉచితంగా నమోదు చేసుకోవచ్చని, ఆ తర్వాత నిర్ణీత ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఒకవేళ 21 రోజులు దాటితే, రూ. 25 అపరాధ రుసుముతో 30 రోజులలోపు నమోదు చేసుకోవచ్చని వివరించారు.

February 18, 2026 / 07:20 PM IST

చీమకుర్తిలో రోడ్డు ప్రమాదం

ప్రకాశం: చీమకుర్తిలో తూర్పు బైపాస్ రోడ్డు కూడలి నందు బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్ మీద వెళుతున్న రాజేశ్, కోటయ్యలను ఢీకొంది. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఈ ప్రాంతంలో రోడ్డు బాగా దెబ్బ తినటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు.

February 18, 2026 / 07:58 PM IST

ఈ నెల 22న బాపట్ల జిల్లా టీడీపీ ఆఫీస్‌కు శంకుస్థాపన

బాపట్లలో టీడీపీ కార్యాలయ నిర్మాణానికి ఈ నెల 22న శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ బుధవారం వెల్లడించారు. ఇదే వేదికపై బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఎంపికైన రాజశేఖర్ బాబు ప్రమాణస్వీకారం చేస్తారని ఆయన తెలిపారు. ఈ రెండు కీలక కార్యక్రమాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

February 18, 2026 / 07:04 PM IST

రేపు వేల్పూరులో వైఎస్ షర్మిల పర్యటన

PLD: ఉపాధిహామీ పథకంపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి రానున్నారు. ఈ మేరకు వినుకొండ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రామాంజనేయులు వివరాలు వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధిహామీని నిర్వీర్యం చేస్తూ రాష్ట్రాలపై భారం మోపుతోందని, దీనివల్ల అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన విమర్శించారు.

February 18, 2026 / 07:01 PM IST

ప్రతి రైతుకు ఆధార్ లాంటి విశిష్ట సంఖ్య అవసరం

GNTR: ఫిరంగిపురం మండలంలోని నుదురుపాడు గ్రామాన్ని గుంటూరు జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు ఎం. పద్మావతి సందర్శించి ,రైతు సేవా కేంద్రం ద్వారా రైతుల విశిష్ట నమోదు సంఖ్య నమోదు ప్రక్రియను పరిశీలించారు. పొలం ఉన్న రైతు ఈ నెలాఖరు లోపు రైతు సేవా కేంద్రాల వ్యవసాయ సహాయకుల ద్వారా ఏపీ ఎఫ్.ఆర్ యాప్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.

February 18, 2026 / 07:00 PM IST

‘విద్యుత్ ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరిస్తాం’

KMM: మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ డైరీని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

February 18, 2026 / 06:57 PM IST

వాడపల్లి వెంకన్నను దర్శించిన మాస్టర్ శేఖర్

కోనసీమ: అత్రేయపురం(మం) పరిధిలోని వాడపల్లిలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ కుటుంబ సభ్యులు బుధవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలు అందజేశారు.

February 18, 2026 / 06:52 PM IST

తొర్రూరు పట్టణంలో కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ..

MHBD: తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను కాంగ్రెస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో తొర్రూరు పట్టణంలో కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, TPCC వైస్ ఛైర్మన్ ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ.. తొర్రూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటూ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు.

February 18, 2026 / 05:44 PM IST