• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రూ.23 వేలు జీతం ఇవ్వాలని అంగనవాడీల ధర్నా

CTR: అంగన్వాడీ వర్కర్ల జీతాలను రూ.23 వేలుకు పెంచాలని డిమాండ్ చేస్తూ పులిచెర్ల ఐసీడిఎస్ ప్రాజెక్టు వద్ద టీచర్లు, హెల్పర్లు ధర్నా చేశారు. యూనియన్ నాయకులు సరస్వతి, అలివేలు, మొబీనా మాట్లాడుతూ.. బడ్జెట్‌లో జీతాల పెంపు చేయాలని కోరారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, పని భారం ఎక్కువగా ఉండటంతో తగిన జీతాలు లేవని తెలిపారు.

February 23, 2026 / 06:00 PM IST

‘సమాజ సేవలో యువత ముందుండడం అభినందనీయం’

కృష్ణా: సత్య సాయి సేవా సంస్థలు యువజన విభాగం ఆధ్వర్యంలో ప్రతి సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయంలో సుమారు 300 మందికి పైగా అర్జీదారులకు సాయి ప్రోటీన్ ఫుడ్‌ను పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సత్య సాయి సేవా సంస్థలు స్వచ్ఛందంగా, నిస్వార్థ భావంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. సమాజ సేవలో యువత ముందుండటం అభినందనీయమన్నారు.

February 23, 2026 / 06:00 PM IST

భారీగా గంజాయి స్వాధీనం

AKP: నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో 168 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. హరిబాబు అనే పాత నేరస్థుడు రెండు బొలెరో వాహనాలలో ప్రత్యేక అరలు అమర్చి గంజాయి రవాణా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్సైలు తారకేశ్వరరావు, రిషికేశ్వరరావు ఆధ్వర్యంలో ఐదుగురు నిందితులను పట్టుకున్నారన్నారు.

February 23, 2026 / 06:00 PM IST

రాహుల్ ప్రధాని కావాలి: భట్టి

TG: వికారాబాద్ అనంతగిరిలో తెలుగు రాష్ట్రాల జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులకు శిక్షణ శిబిరం ఇవాళ మూడోరోజు ముగిసింది. ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఏఐసీసీ నాయకులు పాల్గొన్నారు. సామాజిక రుగ్మతల పరిష్కారానికి రాహుల్ ప్రధాని కావాల్సిన అవసరం ఉందని భట్టి అన్నారు. అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలుచుకునేలా కృషి చేయాలన్నారు.

February 23, 2026 / 05:58 PM IST

స్వయం ప్రతిపత్తి పై అదనపు ఎస్పీ మహేందర్ హర్షం

MDK: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (UGC) నుంచి స్వయం ప్రతిపత్తి (ఆటోనమస్) హోదా మంజూరు కావడం పట్ల జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ హర్షం వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. హుస్సేన్, అధ్యాపక బృందాన్ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. జిల్లాలో ఉన్నత విద్యాభివృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

February 23, 2026 / 05:58 PM IST

మార్చి 4న జగన్నాథపురంలో జల దీక్షలు

SKLM: రైతు కన్నీరు ఆగాలంటే వంశధార నీరు రావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి హెచ్ ఈశ్వరరావు అన్నారు. కోటబొమ్మాలి మండలం జగన్నాథపురం గ్రామ యువజన సంఘం కార్యాలయంలో సోమవారం కొండపేట లిఫ్టు ఇరిగేషన్ జల సాధన కమిటీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. మార్చి 4న జల దీక్షలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

February 23, 2026 / 05:57 PM IST

కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించాలి: హరీష్ రావు

TG: మాజీ మంత్రి హరీష్ రావును మన ఊరు-మనబడి కాంట్రక్టర్లు కలిశారు. పెండింగ్ బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు ఇవ్వాలని అడిగితే కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల ఉసురు తీస్తోందని హరీష్ రావు విమర్శించారు. వెంటనే కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 05:52 PM IST

అంతర్ జిల్లా బ్యాగ్ లిఫ్టింగ్ దొంగ అరెస్ట్: ఎస్పీ

కోనసీమ: అమలాపురం పట్టణంలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా బ్యాగ్ లిప్టింగ్ దొంగను అరెస్టు చేసినట్లు ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. సోమవారం అమలాపురం ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గత నెలలో పట్టణంలో మహిళ నుంచి బంగారు ఆభరణాలు కాజేసిన కేసులో తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంకి చెందిన బండి శివ పార్వతిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

February 23, 2026 / 05:51 PM IST

బీసీ రిజర్వేషన్లకు కమిషన్ వేశాం: చంద్రబాబు

AP: బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కమిషన్ వేశామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ‘స్థానిక ఎన్నికలు వచ్చే సమయానికి రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంటాము. కొన్ని బీసీ వర్గాల నుంచి ఎస్సీ, ఎస్టీల్లో చేర్చాలనే డిమాండ్లు పరిశీలనలో ఉన్నాయి. గిరిజనుల కోసం తెచ్చిన జీవో 3ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనిపై గిరిజనుల అభిప్రాయాలు సేకరించి ముందుకెళ్తాం’ అని తెలిపారు.

February 23, 2026 / 05:50 PM IST

కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KMR: పిట్లం మండల కేంద్రం లో కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ పథకం కింద లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను సోమవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వమే అండగా ఉంటుందన్న భరోసాను కల్పించడమే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

February 23, 2026 / 05:49 PM IST

‘న్యాయవాద రక్షణ చట్టం అమలు చేయాలి’

RR: న్యాయవాదులపై దాడులను అరికట్టాలని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని న్యాయవాదులందరూ సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ న్యాయవాద బార్ అసోసియేషన్ అధ్యక్షులు వేణుగోపాల్ రావు ఆధ్వర్యంలో న్యాయవాద బార్ అసోసియేషన్ సభ్యులు పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. న్యాయవాద రక్షణ చట్టం అమలు చేయాలని తెలిపారు.

February 23, 2026 / 05:48 PM IST

టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి: శేఖర్ రెడ్డి

NLG: కొండమల్లేపల్లిలో టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నియోజకవర్గ ఇంఛార్జ్ వస్కుల కృష్ణయ్య ఆధ్వర్యంలో సోమవారం జరిగింది. నల్గొండ పార్లమెంట్ అధ్యక్షుడు కసిరెడ్డి శేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడమే మన లక్ష్యమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ శ్రేణులు ఐకమత్యంతో పనిచేయాలన్నారు.

February 23, 2026 / 05:47 PM IST

‘పోలీస్ ప్రజావాణిలో 8 దరఖాస్తులు’

ASF: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నితిక పంత్ సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 8 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడారు. ఫిర్యాదులు ఆన్లైన్లో నమోదు చేయాలని, వాటిపై తీసుకున్న చర్యలు ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు సూచించారు.

February 23, 2026 / 05:47 PM IST

నా పేరుతో ఎలాంటి సంస్థలు లేవు: కేటీఆర్

TG: తన పేరుతో కొందరు సంస్థలు ఏర్పాటు చేసిన విషయంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘కేటీఆర్ సేవా సమితి’, ‘కేటీఆర్ సేన’ పేరిట కార్యకలాపాలపై కేటీఆర్ స్పందించారు. తన పేరులో ఎలాంటి సంస్థలు నిర్వహణకు అనుమతి లేదన్నారు. ఎవరైనా పనిచేయాలనుకుంటే బీఆర్ఎస్ తో కలిసి పనిచేయాలన్నారు. ఇలాంటి సంస్థలకు ఎలాంటి గుర్తింపు, అనుమతి లేదన్నారు. 

February 23, 2026 / 05:46 PM IST

కారు ఢీకొని వృద్ధుడికి తీవ్ర గాయాలు

MBNR: హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ గేటు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగయ్య పల్లికి చెందిన హనుమంతు నాయక్ (70) తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన కుడి చేయి విరిగింది. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

February 23, 2026 / 05:45 PM IST