• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గోవర్ధన గిరిధారిగా లక్ష్మీనరసింహుడు

BHNG: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. నేడు స్వామివారు గోవర్ధన గిరిధారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద మంత్రాల సాక్షిగా, మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు వైభవంగా సాగింది. ఆలయ అర్చకులు, అధికారులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు.

February 23, 2026 / 05:05 PM IST

‘పనితీరు మారకుంటే ఇంటికి వెళ్లండి’

VSP: జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ఫిర్యాదుల (PGRS) పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్న పదిమంది అధికారులను హెచ్చరిస్తూ, “పని చేయడం ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్ళిపోండి” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

February 23, 2026 / 05:05 PM IST

సబ్ స్టేషన్‌కు ఎమ్మెల్యే భూమి పూజ

ASF: చింతలమానేపల్లి మండలంలో 23 గ్రామాల ప్రజలు లో-ఓల్టేజ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని MLA హరీష్ బాబు చొరవ తీసుకుని 33/11KV సబ్ స్టేషన్‌ను ఇటీవల మంజూరు చేయించారు. ఈ మేరకు సోమవారం 33/11KV సబ్ స్టేషన్‌కు MLA భూమి పూజ నిర్వహించారు. సబ్ స్టేషన్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

February 23, 2026 / 05:04 PM IST

మున్సిపల్ ఛైర్మన్‌ను సన్మానించిన అధ్యాపకులు

నిర్మల్ నూతన మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికైన అప్పల కావ్య గణేష్ చక్రవర్తిలను ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల అభివృద్ధి కొరకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు.

February 23, 2026 / 05:02 PM IST

గురుకుల డిగ్రీ ప్రవేశాల కరపత్రాల ఆవిష్కరణ

ADB: ఉట్నూరు ప్రభుత్వ గిరిజన మహిళా గురుకుల డిగ్రీ కళాశాల ప్రవేశాల కరపత్రాలను ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మట్ సోమవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. గురుకులాల్లో ఉచిత వసతితో కూడిన నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన గిరిజన బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీవాణి, అధ్యాపకులు పాల్గొన్నారు.

February 23, 2026 / 05:02 PM IST

పదో తరగతి పరీక్షలకు 37 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు: డీఈవో

వనపర్తి జిల్లా వ్యాప్తంగా 7228 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో హాజరుకానున్నారని వనపర్తి డీఈవో అబ్దుల్ ఘనీ తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 37 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 37 మంది సూపర్డెంట్లు, 37 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించినట్లు తెలిపారు.

February 23, 2026 / 05:02 PM IST

అన్నమయ్య: పాత రాయచోటిలో పిచ్చి కుక్క సైరవిహారం

అన్నమయ్య: పాత రాయచోటిలో పిచ్చి కుక్క హల్‌చల్. సోమవారం కుక్క దాడిలో ఇద్దరికీ గాయాలు కాగా, స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనతో ప్రాంతంలో భయాందోళనలు.గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.వీధి కుక్కల బెడదపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 05:01 PM IST

రాయదుర్గంలో రెండు రోజులు నీటి సరఫరా బ్రేక్

అనంతపురం: రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో రెండు రోజులపాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి తెలిపారు. టి వీరాపురం వద్ద పైప్ లైన్ లీకేజీ కారణంగా మరమ్మత్తులో భాగంగా 24, 25వ తేదీలలో నీటి సరఫరా ఉండదని తెలిపారు. కావున రెండు రోజులపాటు ప్రజలు నీటిని పొదుపుగా వాడుకొని సహకరించాలని కోరారు.

February 23, 2026 / 05:01 PM IST

కామారెడ్డి ఎమ్మెల్యేతో ఎంపీ డీకే అరుణ భేటీ

KMR: జిల్లా కేంద్రంలో 5 రోజుల నుంచి నెలకొన్న రాజకీయ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మహబూబ్ నగర్ MP డీకే అరుణ కామారెడ్డికి చేరుకున్నారు. MLA క్యాంపు కార్యాలయంపై దాడికి యత్నించిన తీరుపై, ఉద్రిక్త పరిస్థితుల గల కారణాలను MLA రమణారెడ్డిని అడిగి తెలుసుకోనున్నారు. ఆయనతో భేటీ అనంతరం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

February 23, 2026 / 05:00 PM IST

నగరిలో పేదల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం

CTR: పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశాయి. మొదటి విడతగా నగరి మున్సిపాలిటీకి 454 ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ లబ్ధిదారులకు అందజేశారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తమ కల నెరవేరుతోందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

February 23, 2026 / 05:00 PM IST

శరవేగంగా పూషడం ప్రధాన రహదారి నిర్మాణం

కృష్ణా: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కృషితో ఘంటసాల మండలం పూషడం గ్రామ ప్రధాన రహదారి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. రూ.కోటీ నలభై లక్షలతో పల్లె పండుగ కార్యక్రమం పురస్కరించుకొని జాతీయ రహదారి-216 నుంచి పూషడం వరకూ మూడు కిలోమీటర్లు ప్రధాన రహదారిలో నూతన తారు రోడ్డు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.

February 23, 2026 / 05:00 PM IST

ములుగు ఎస్పీని కలిసిన ఛైర్మన్, కౌన్సిలర్లు

ములుగు జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకేన్‌ను మున్సిపల్ ఛైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి, వైస్ ఛైర్‌పర్సన్ ఆసియా షాహిన్ రియాజ్ మిర్జా, కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా ఎస్పీకి నూతన మున్సిపల్ పాలకవర్గం సభ్యులు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతలో సత్కరించారు. అనంతరం నూతన పాలక వర్గానికి ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు.

February 23, 2026 / 05:00 PM IST

పంచాయతీ కార్యాలయం ఎదుట సర్పంచ్ ధర్నా

GNTR: పారిశుద్ధ్య కార్మికులకు ఏడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ప్రత్తిపాడు సర్పంచ్ వసవర్తి రమాదేవి సోమవారం పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. గతంలో సుమారు రూ.14 లక్షల బిల్లులను డ్రా చేసి గోల్‌మాల్ చేశారని ఆమె ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులు ఎలా డ్రా చేశారో అధికారులు సమాధానం చెప్పాలని, కార్మికులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 05:00 PM IST

అద్దంకిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

BPT: అద్దంకి మండలం ద్వారకా నగర్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాంసన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో వెంటనే స్పందించిన 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

February 23, 2026 / 05:00 PM IST

ది హార్ట్ ఫోర్డ్ ఇండియా కార్యాలయం ప్రారంభం

TG: హైదరాబాద్ నానక్ రాంగూడలో అమెరికా బీమా సంస్థ ‘ది హార్ట్ ఫోర్డ్ ఇండియా’ కార్యాలయాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. దీని ద్వారా 1200 మందికి ఉపాధి లభించనుంది. హైదరాబాద్‌ను గ్లోబల్ వాల్యూ క్రియేషన్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి తెలిపారు. పరిశ్రమల అవసరాల మేరకు యువతను తీర్చిదిద్దుతున్నామన్నారు.

February 23, 2026 / 04:59 PM IST