• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

దారుణం..యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

కాశినాయన మండలం గంగనపల్లెకు చెందిన దిలీప్(24) అనే వ్యక్తిపై దుండగులు ఆదివారం పెట్రోల్ పోసి నిప్పంటించారు.గాయపడిన యువకుడిని స్థానికులు పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 22, 2026 / 09:41 PM IST

ఇఫ్తార్ విందులో పాల్గొన్న MLA గాంధీ

RR: యూత్ కాలనీలో నిర్వహించిన ‘దవాత్-ఏ-ఇఫ్తార్’ కార్యక్రమంలో పీఏసీ ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి విందు ఆరగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ క్రమశిక్షణకు, మత సామరస్యానికి ప్రతీక అని, తెలంగాణలో “గంగా జమునా తెహజీబ్” సంస్కృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

February 22, 2026 / 09:39 PM IST

హుజూర్‌నగర్ 21వ వార్డులో క్షేత్రస్థాయి పరిశీలన

NLG: హుజూర్‌నగర్ మున్సిపాలిటీ 21వ వార్డులో చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్ ఆధ్వర్యంలో అధికారులు క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. డ్రైనేజ్, వీధి దీపాలు, శానిటేషన్, వాటర్ సప్లై సమస్యలను పరిశీలించి ప్రజల అభ్యర్థనలు నమోదు చేశారు. అభివృద్ధి పనులు చేపడతామని, మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

February 22, 2026 / 09:38 PM IST

ప్రతిభను వెలికి తీయడానికే టాలెంట్టెస్ట్

BHNG: ఆలేరులో SFI మండల కమిటీ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా SFI జిల్లా కార్యదర్శి రాజు మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకే ఈ పోటీలని తెలిపారు. పదో తరగతి విద్యార్థులు మానసిక ఒత్తిడి లేకుండా వార్షిక పరీక్షలు రాయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో UTF నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

February 22, 2026 / 09:32 PM IST

వెంకటాయపల్లి నేతలు కాంగ్రెస్‌లో చేరిక

MBNR: ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రభావంతో వెంకటాయపల్లి స్వతంత్ర సర్పంచ్ రామాంజనేయులు, ఉపసర్పంచ్ పింజరి మోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి కండువా కప్పి వారిని ఆహ్వానించారు. అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని.. అందుకే ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

February 22, 2026 / 09:31 PM IST

మళ్ళీ నిరాశపరిచిన అభిషేక్ శర్మ

టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ విఫలమైన అతడు.. కేవలం 15 పరుగులు మాత్రమే చేసి భారీ షాట్‌కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ సూర్య(10), వాషింగ్టన్ సుందర్(2) క్రీజులో ఉన్నారు.

February 22, 2026 / 09:29 PM IST

మరోసారి నిరాశపరిచిన అభిషేక్ శర్మ

టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ విఫలమైన అతడు.. కేవలం 15 పరుగులు మాత్రమే చేసి భారీ షాట్‌కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ సూర్య(10), వాషింగ్టన్ సుందర్(2) క్రీజులో ఉన్నారు.

February 22, 2026 / 09:29 PM IST

పడుకునే ముందు ఈ పని చేయండి!

పడుకునే ముందు పుస్తకం చదివే అలవాటు మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజంతా పడ్డ అలసటను, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇది ఒక చక్కని మార్గం. మొబైల్ స్క్రీన్లకు దూరంగా ఉండి పుస్తకం చదవడం వల్ల మెదడు ప్రశాంతంగా మారుతుంది, తద్వారా నిద్ర నాణ్యత పెరుగుతుంది. జ్ఞాపకశక్తి పెంపొందించుకోవడానికి, సృజనాత్మకతను మెరుగుపరుచుకోవడానికి ఇది ఎంతో సహాయపడుతుంది.

February 22, 2026 / 09:28 PM IST

నిజాంపేట ప్రజావాణికి కలెక్టర్ హాజరు

MDK: నిజాంపేట మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయంలో రేపు జరిగే ప్రజావాణి కార్యక్రమానికి హాజరు అవుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. నిజాంపేట మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం జరగనున్న ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రత్యక్షంగా హాజరుకానున్నారు. నేరుగా ప్రజల పిర్యాదులు స్వీకరించనున్నారు.

February 22, 2026 / 09:21 PM IST

కేసీఆర్ ఆరోగ్యం కాపాడుకో: రేవంత్

TG: రాష్ట్రంలో 2034 వరకు ప్రజలు కాంగ్రెస్‌నే ఆదరిస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఆరోగ్యం కాపాడుకోవాలన్న రేవంత్.. ఉదయం వాకింగ్, సాయంత్రం వ్యాయామం చేయాలని సూచించారు. బీఆర్ఎస్ నేతలు ఇంకో పదేండ్లు ఆరోగ్యంగా ఉండాలి.. అందుకు పుస్తకాలు చదవాలి, ప్రవచనాలు వినాలని చెప్పారు.  

February 22, 2026 / 09:20 PM IST

శ్రీవారిని రాజకీయాలకు వాడుకుంటున్నారు: ఎంపీ

AP: YCP నేతలు వేంకటేశ్వరస్వామిని రాజకీయాలకు వాడుకుంటున్నారని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. గత పాలకుల హయాంలో తిరుమలలో అన్యమత ప్రచారం జరిగిందన్నారు. గతంలో భూమన కరుణాకర్ రెడ్డి ఏడు కొండల గురించి ఏ విధంగా మాట్లాడారో గుర్తుచేశారు. స్వామివారిని అడ్డం పెట్టుకొని రూ.కోట్లు దండుకున్నారని ఆరోపించారు.

February 22, 2026 / 09:14 PM IST

‘మానవత్వం లేని రెడ్డిలపై చర్యలు తీసుకోవాలి’

SRD: మానవత్వం లేని రెడ్డి లపై చర్యలు తీసుకోవాలని KVPS జిల్లా సహాయ కార్యదర్శి గణపతి డిమాండ్ చేశారు. నేడు ఖేడ్‌లో ఆయన మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్ జిల్లా కమ్మేర మల్లన్న గుడిలోకి చాకలి చంద్రకళను స్థానిక రెడ్డిలు రానివ్వక పోవడంతో, ఆమె తమ్ముడు నిలదీయగా, ఆయనను చితకబాదారన్నారు. దీంతో ఇరువర్గాల మధ్య నెలకొన్న ఘర్షణలో 2నెలల పసికందును కాలితో నలిపి వేయడం దారుణమన్నారు.

February 22, 2026 / 09:13 PM IST

విజేతలకు బహుమతులు అందజేసిన మున్సిపల్ చైర్మన్

WNP: గత మూడు రోజులుగా జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి సుధీర్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సీఎం కప్ సెకండ్ ఎడిషన్ క్రీడా పోటీలో నిర్వహించారు. వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న సేపక్ తక్రా రాష్ట్ర స్థాయి క్రీడ పోటీలలో పురుషుల విభాగంలో హైదరాబాద్ ప్రధమ స్థానంలో నిలిచాయి. విజేతలకు మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్ చేతుల మీదిగా బహుమతులు అందజేశారు.

February 22, 2026 / 09:11 PM IST

భారత్‌కు షాక్.. ఓపెనర్ డకౌట్

188 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 4 బంతుల్లోకే డకౌట్‌గా వెనుదిరిగాడు. మార్‌క్రమ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రికల్టన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ అభిషేక్ తన తొలి బంతికే ఫోర్ బాదాడు. తిలక్ వర్మ కూడా 2 పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.

February 22, 2026 / 09:11 PM IST

మైనర్ బాలిక కిడ్నాప్ ఘటనపై జనసేన ఇంఛార్జ్ స్పందన

అన్నమయ్య: తంబళ్లపల్లి మొలకలచెరువులో జరిగిన మైనర్ బాలిక కిడ్నాప్ ఘటనపై జనసేన ఇన్‌చార్జ్ పోతుల సాయినాథ్ ఆదివారం స్పందించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, తప్పు జరిగితే శిక్ష తప్పదని పేర్కొన్నారు. ఆరు నెలల క్రితం బాలిక బాబాయి తనను సంప్రదించిన విషయం నిజమేనని, అప్పట్లో మందలించామని చెప్పారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.

February 22, 2026 / 09:10 PM IST