• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

‘నీలిర’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘నీలిర’. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 3, 2026న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు సమర్పణలో, రానా దగ్గుబాటి (స్పిరిట్ మీడియా) నిర్మాణంలో ఈ చిత్రం రూపొందింది. సోమేథరన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కథ శ్రీలంకలోని ‘ఈలం’ నేపథ్యంతో, ఒక యుద్ధ బాలుడి చేదు జ్ఞాపకాల ఆధారంగా సాగనుంది.

March 16, 2026 / 03:12 PM IST

ఆస్కార్‌ నివాళుల జాబితాలో కోట శ్రీనివాసరావు

లాస్ ఏంజెల్స్‌లో జరిగిన 98వ ఆస్కార్ వేడుకల్లో గతేడాది కన్నుమూసిన సినీ దిగ్గజాలకు ‘In Memoriam’ విభాగంలో ఘన నివాళులర్పించారు. అకాడమీ తన వెబ్‌సైట్‌లో హాలీవుడ్ ప్రముఖులతో పాటు భారతీయ సినిమా గర్వించదగ్గ ప్రముఖులు ధర్మేంద్ర, మనోజ్ కుమార్, బి.సరోజాదేవి, కోట శ్రీనివాసరావు పేర్లను ప్రచురించింది. ప్రపంచ సినీరంగానికి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. 

March 16, 2026 / 03:00 PM IST

పురుషులకు అక్షయ్ కుమార్ కీలక సూచన

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన తండ్రి హరి ఓం భాటియాను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. 67 ఏళ్ల వయసులో తన తండ్రి ప్రోస్టేట్ క్యాన్సర్ వల్ల మరణించారని, సకాలంలో పరీక్షలు చేయించకపోవడమే అందుకు కారణమని ఆవేదన వ్యక్తం చేశాడు. 50 ఏళ్లు దాటిన పురుషులందరూ తప్పనిసరిగా PSA పరీక్ష చేయించుకోవాలని, స్క్రీనింగ్ ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని ఆయన సూచించాడు.

March 16, 2026 / 02:42 PM IST

సల్మాన్‌ ఖాన్ సినిమా పేరు మార్పు

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’. తాజాగా ఈ మూవీ టైటిల్‌ను మార్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘మాతృభూమి’ పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలుపుతూ సరికొత్త పోస్టర్ షేర్ చేశారు. ఇక 2020 జూన్‌లో భారత్-చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో ఇరు సైన్యాల మధ్య జరిగిన భీకర ఘర్షణల ఆధారంగా ఈ చిత్రం రాబోతుంది.

March 16, 2026 / 02:02 PM IST

‘సినిమా వసూళ్లు దేశ జనాభా కంటే ఎక్కువ’

సినిమా విజయాన్ని కేవలం కలెక్షన్లతో కొలవడంపై బాలీవుడ్ దర్శకుడు ప్రియదర్శన్ అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం రూ.500-1000 కోట్ల క్లబ్ వేటలో పడి కథాబలాన్ని విస్మరిస్తున్నారని విమర్శించాడు. కొన్ని మూవీల వసూళ్లు దేశ జనాభా కంటే ఎక్కువగా కనిపిస్తున్నాయని అన్నాడు. బడ్జెట్ కంటే కంటెంట్‌నే తాను నమ్ముతానని, తక్కువ ఖర్చుతో అద్భుత సినిమాలను మలయాళ పరిశ్రమ తీసుకువస్తుందని తెలిపాడు.

March 16, 2026 / 02:00 PM IST

మార్చి 19న బాక్సాఫీస్ వద్ద పోరు.. గెలుపు ఎవరిది?

మార్చి 19న బాక్సాఫీస్ వద్ద పోరు నెలకుంది. ఉస్తాద్ భగత్ సింగ్ తెల్లవారుజామున బెనిఫిట్ షోలతో సందడి చేయనుండగా, ధురంధర్ 2 18నే ప్రీమియర్స్‌తో బరిలోకి దిగుతోంది. విభిన్న జానర్లలో వస్తున్న ఈ మూవీల్లో ఏది గెలుస్తుందో చూడాలి. అటు మార్చి 20న నెట్‌ఫ్లిక్స్‌లో బోర్డర్‌ 2, ఏ డిఫరెంట్‌ మ్యాన్, ప్రైమ్‌లో డెడ్‌లాక్ 2, అమోర్ యానిమల్ విడుదలవుతున్నాయి.

March 16, 2026 / 01:46 PM IST

‘వృషకర్మ’ సీక్వెల్‌పై నాగ చైతన్య క్లారిటీ

నాగచైతన్య ప్రస్తుతం ‘వృషకర్మ’ మూవీతో బిజీగా ఉన్నాడు. అయితే తనకు ఎప్పటి నుంచో భారీ మైథలాజికల్ మూవీ చేయాలని ఉందని చైతు తెలిపాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారతీయ పురాణాల పట్ల ఆసక్తి పెరుగుతోందని, అత్యాధునిక సాంకేతికతతో ఆ అద్భుత ప్రపంచాన్ని వెండితెరపై చూపించడం తన కల అని చెప్పాడు. ఇక ‘వృషకర్మ’ సీక్వెల్ గురించి స్పందిస్తూ.. అది మొదటి భాగం సాధించే విజయంపైనే ఆధారపడి ఉంటుందన్నాడు.

March 16, 2026 / 01:16 PM IST

ఆస్కార్ ..అత్యధిక అవార్డుల రికార్డులివే

ఆస్కార్ చరిత్రలో వాల్ట్ డిస్నీ 22 పోటీ అవార్డులు, 4 గౌరవ అవార్డులతో కలిపి మొత్తం 26 ఆస్కార్‌లతో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించారు. సినిమాల పరంగా చూస్తే.. బెన్-హుర్(1959), టైటానిక్(1997), ద లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ద రిటర్న్ ఆఫ్ ది కింగ్(2003) చిత్రాలు చెరో 11 అవార్డులతో అత్యధిక విజయాలను నమోదు చేసి చరిత్రకెక్కాయి.

March 16, 2026 / 12:47 PM IST

ఆస్కార్ అవార్డుల్లో జాన్ విలియమ్స్ అరుదైన రికార్డు

సంగీత దర్శకుడు జాన్ విలియమ్స్ ఆస్కార్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించారు. 1968-2024 వరకు కొన్ని దశాబ్దాల పాటు వరుసగా నామినేషన్లు పొందిన ఏకైక వ్యక్తిగా నిలిచారు. ‘స్టార్ వార్స్’ వంటి మూవీలకు అద్భుత సంగీతాన్ని అందించిన ఆయన.. ఇప్పటివరకు 54 నామినేషన్లు దక్కించుకున్నారు. అత్యధిక నామినేషన్లు పొందిన వ్యక్తిగా చరిత్ర సృష్టించడమే కాకుండా, 5 సార్లు ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు.

March 16, 2026 / 12:26 PM IST

అజిత్ వంట చేసి పెట్టారు: తమన్నా

స్టార్ హీరో అజిత్‌పై నటి తమన్నా ప్రశంసలు కురిపించింది. ‘వీరం’ షూటింగ్ సమయంలో అజిత్ తన క్యారవాన్‌లో స్వయంగా ఇడ్లీలు చేసి పెట్టారని, ఒక అగ్ర హీరో అలా చేయడం చూసి తాను షాక్ అయ్యానని తెలిపింది. అజిత్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ మెన్ అని, ఆయనకు వంట అంటే ప్రాణమని చెప్పింది. అంతేకాదు సినీ రంగంలో 21 ఏళ్లు పూర్తి చేసుకున్న తమన్నా, తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.

March 16, 2026 / 12:06 PM IST

2026 ఆస్కార్ వేడుకలు.. ఖర్చు ఎంతంటే?

లాస్ ఏంజిల్స్‌లో 98వ ఆస్కార్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కేవలం ఒక్క రాత్రి జరిగే ఈ ఈవెంట్ కోసం దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేయడం విశేషం. 2024లో రూ.477 కోట్లుగా ఉన్న బడ్జెట్ ఈసారి ఆ మార్కును దాటేసింది. నామినీ కార్డుల ప్రింటింగ్, లైటింగ్, అతిథుల విందు ఇలా ప్రతి విషయంలోనూ అత్యున్నత ప్రమాణాలు పాటించడంతో ఈ వేడుక ఖర్చు ఆకాశాన్నంటుతోంది.

March 16, 2026 / 11:38 AM IST

‘ఉస్తాద్’ ఈవెంట్‌లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా హరీష్ ష‌ర్ట్‌

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందడిగా సాగింది. అయితే, ఇందులో హరీష్ ధరించిన ప్రత్యేకమైన బ్లాక్ షర్ట్ హైలైట్‌గా నిలిచింది. పవన్ ఐకానిక్ మేనరిజమ్స్, ‘గబ్బర్ సింగ్’, ‘ఉస్తాద్’ మాస్ పోస్టర్లు, పవర్‌ఫుల్ డైలాగ్స్ గ్రాఫిక్స్‌తో ఉన్న ఆ షర్ట్ పవన్‌పై ఆయనకున్న అభిమానాన్ని చాటింది. ఈ షర్ట్ సోషల్ మీడియాలో వైరల్...

March 16, 2026 / 11:29 AM IST

‘కాంచన’ రీ-రిలీజ్.. 3 డేస్ కలెక్షన్స్

నటుడు రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో నటించిన హర్రర్ థ్రిల్లర్ మూవీ ‘కాంచన’. 2011లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా రీ-రిలీజ్ కాగా..మంచి రెస్పాన్స్ అందుకుంది. మూడు రోజుల్లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద  రూ.5.54 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు.

March 16, 2026 / 11:22 AM IST

ఆస్కార్ అవార్డును అమ్మడం సాధ్యమేనా?

ఆస్కార్ ట్రోఫీ తయారీకి 400 డాలర్లు ఖర్చవుతుంది. అకాడమీ నిబంధనల ప్రకారం దాని విలువ కేవలం ఒక డాలర్ మాత్రమే. విజేతలు దీనిని ఇతరులకు అమ్మకూడదు. ఒకవేళ వదులుకోవాలనుకుంటే అకాడమీకే తిరిగి ఇవ్వాలి. నగదు రాకపోయినా, ఈ పురస్కారం తెచ్చే అంతర్జాతీయ గుర్తింపు, గౌరవం వెలకట్టలేనిది. ఇది ప్రతి కళాకారుడి జీవితకాల కల, అరుదైన గౌరవం.

March 16, 2026 / 11:07 AM IST

ఆస్కార్ అవార్డుల్లో చరిత్ర సృష్టించిన మహిళ

మార్చి 16, 2026న జరిగిన ఆస్కార్ వేడుకల్లో అమెరికన్ సినిమాటోగ్రాఫర్ ఆటం డ్యూరాల్డ్ అర్కాపావ్ అరుదైన చరిత్ర సృష్టించారు. ‘సినర్స్’ చిత్రానికి గాను ‘బెస్ట్ సినిమాటోగ్రఫీ’ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న తొలి మహిళగా ఆమె రికార్డు నెలకొల్పారు. గతంలో ‘వకాండా ఫరెవర్’ వంటి చిత్రాలకు పనిచేసిన ఆమె, ఈ విజయంతో సినిమాటోగ్రఫీ రంగంలో ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు.

March 16, 2026 / 10:52 AM IST