• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

భారత్‌కు గ్యాస్ సరఫరా తగ్గించిన ఖతార్

భారతదేశానికి సహజవాయువు సరఫరాదారుగా ఉన్న ఖతార్, ఇరాన్ దాడులతో సతమతం అవుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు ఖతార్ LNG ఎగుమతులను 40% వరకు తగ్గించింది. ఖతార్ ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు ఉత్పత్తిదారుగా ఉంది. ఖతార్ నుంచి ఎగుమతి అవుతున్న నాచురల్ గ్యాస్ వినియోగదారుల్లో భారత్ అతిపెద్దది. భారతదేశం ఏటా సుమారు 27 మిలియన్ టన్నుల లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటుంది.

March 4, 2026 / 06:45 AM IST

యుద్ధం ఎఫెక్ట్‌.. ధరలు పెరిగే అవకాశం!

ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకు పెను సవాళ్లను విసురుతోంది. దాదాపు 88% చమురును దిగుమతి చేసుకునే భారత్‌కు ఇది మరింత తీవ్ర సమస్యగా మారింది. తాజాగా, హెూర్ముజ్ జలసంధిని ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో భారత్‌కు చమురు కొరత ఏర్పడుతుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

March 4, 2026 / 05:55 AM IST

అశ్లీల కంటెంట్‌పై నిషేధం విధించిన మస్క్

భారతదేశంలో ఎక్స్ వేదికపై అశ్లీల కంటెంట్‌పై నిషేధం అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనివల్ల చాలామంది వినియోగదారులు ఆ కంటెంట్‌ను చూడలేకపోతున్నారు. ఇది మస్క్ నిర్ణయమా, ప్రభుత్వ నిబంధనలా అనే చర్చ మొదలైంది. నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. దేశ డిజిటల్ చట్టాల నేపథ్యంలో ఈ కీలక మార్పు చోటుచేసుకుంది.

March 3, 2026 / 04:46 PM IST

తోగ్గూడెంలో స్వామివారికి విశేష అర్చనలు

BDK: పినపాక మండలం తోగ్గూడెం అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆలయాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ శాంతి, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

March 3, 2026 / 04:41 PM IST

ALERT: హాల్ టికెట్లు విడుదల

AP: పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసింది. విద్యార్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.in నుంచి పొందవచ్చని తెలిపింది. హాల్ టికెట్‌లో పేరు, రోల్ నంబర్, ఫొటో వంటి వివరాలను సరిచూసుకోవాలని.. ఏవైనా తప్పులుంటే పాఠశాల అధికారులకు తెలపాలని సూచించింది. కాగా, మార్చి 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

March 3, 2026 / 01:46 PM IST

మరోసారి పెరిగిన చమురు ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మరోసారి పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్‌లో బ్యారెల్ చమురు ధర 79.44 డాలర్లకు చేరుకుంది. నిన్న ఈ కాంట్రాక్టులు అత్యధికంగా 82.37 డాలర్లకు తాకినట్లు అధికారులు తెలిపారు. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ బ్యారెల్‌ ధర 72.40 డాలర్లు తాకింది.

March 3, 2026 / 11:02 AM IST

GOOD NEWS: దరఖాస్తు గడువు పెంపు

ఏపీ ఈఏపీసెట్-2026 దరఖాస్తు గడువును ఈనెల 17 వరకూ పొడిగించినట్లు సెట్ కన్వీనర్ మోహనరావు వెల్లడించారు. రూ.1,000 ఆలస్య రుసుముతో ఈనెల 21 వరకు, రూ.10 వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 3 వరకు గడువు ఉందని తెలిపారు. తప్పుల సవరణకు వచ్చే నెల 4 నుంచి 6 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు cets.apsche.ap.gov.in/eapcet వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు.

March 3, 2026 / 07:27 AM IST

నీట్ సాధించాలంటే.. ఇలా చేయండి!

విద్యార్థులు NCERT పాఠ్యపుస్తకాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్షలో సుమారు 90 శాతం కంటే ఎక్కువ ప్రశ్నలు వీటి నుంచే వస్తాయి. డయాగ్రమ్స్, పట్టికలు వదలకుండా నేర్చుకోవాలి. వీటిలోని సమాచారం ఆధారంగా ప్రశ్నలుండవచ్చు. బయాలజీలో స్మార్ట్ స్టడీ టెక్నిక్‌ను అమలు చేయాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీని కాన్సెప్టుల వారీగా చదవాలి. చదివిన అంశాలను వారం రోజులకొకసారి రివిజన్ చేసుకోవాలి.

March 2, 2026 / 07:39 PM IST

667 ఉద్యోగాలు.. మార్చి 16 నుంచి దరఖాస్తులు

కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (MCL), నిరుద్యోగులకు భారీ ఊరటనిస్తూ 667 పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో టెక్నీషియన్, మైనింగ్ సిర్దార్, సర్వేయర్ వంటి కీలక విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. మార్చి 16 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

March 2, 2026 / 05:39 PM IST

ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలు.. గడువు పొడిగింపు

TG: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల ప్రవేశాల దరఖాస్తు గడువును ఈ నెల 10 వరకు విద్యాశాఖ పొడిగించింది. 6వ తరగతిలో పూర్తిస్థాయి సీట్లను భర్తీ చేయనుండగా 7, 8, 9, 10వ తరగతులలో మిగిలి ఉన్న ఖాళీ సీట్లను ఈ ప్రవేశాల ద్వారా భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఆసక్తి గల విద్యార్థులు https://tgms.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

March 2, 2026 / 05:03 PM IST

‘నన్నయ వర్సిటీలో 9న ప్రాంగణ ఎంపికలు’

E.G: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 9న హెటిరో డ్రగ్స్‌, ఎంఆర్‌ఎఫ్‌ టైర్స్‌ సంస్థల ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించనున్నట్లు వీసీ ఆచార్య పి.ప్రసన్నశ్రీ తెలిపారు. పదో తరగతి, ఇంటర్‌, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, బీటెక్‌ చదివిన 18-25 ఏళ్ల పురుష అభ్యర్థులు వీటికి అర్హులన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

March 2, 2026 / 04:50 PM IST

భగ్గుమన్న చమురు ధరలు

ఇరాన్-అమెరికా యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భగ్గుమన్నాయి. ముడి చమురు ధర 80 డాలర్ల పైనే ట్రేడ్ అవుతోంది. దీంతో దేశీయంగా చమురు రంగ షేర్లు పతనమయ్యాయి. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ 5 శాతం మేర కుంగింది. మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్ వంటి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు హర్ముజ్ జలసంధిలో నౌకల రవాణాను ఇరాన్ అడ్డుకోవడంతో ధరలు 10 శాతం మేర పెరిగాయి.

March 2, 2026 / 01:25 PM IST

దారుణంగా పతనమైన సూచీలు

దేశీయ స్టార్ మార్కెట్లు దారుణంగా పతనమయ్యాయి. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 1,565.54 పాయింట్ల నష్టంతో 79,721.65 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 500 పాయింట్ల నష్టంతో 24,698.50 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్- 30లో BEL, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్ మినహా మిగిలిన అన్ని స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

March 2, 2026 / 01:06 PM IST

HYD వర్సిటీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(UOH) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 47 ఫ్యాకల్టీ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఫ్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉండగా.. PG, MPhil, PhD ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గలవారు ఈ నెల 6 వరకు అప్లై చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు రూ.1000. SC/ST/PwBDలకు మినహాయింపు కలదు. వెబ్‌సైట్: uohyd.ac.in

March 2, 2026 / 12:56 PM IST

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో జాబ్స్.. గడువు ముగుస్తోంది

కోల్ ఇండియా(CIL) అనుబంధ సంస్థ నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(NCL)లో 270 అసిస్టెంట్ ఫోర్‌మెన్(గ్రేడ్ C) ట్రైనీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మరో 3 రోజుల్లో(మార్చి 4) ముగియనుంది. E&T, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఖాళీలు ఉండగా.. డిప్లొమా/డిగ్రీ ఉత్తీర్ణత గలవారు అప్లై చేసుకోవచ్చు. UR/OBC/EWSలకు పరీక్ష ఫీజు రూ.1180. SC/ST/PwBD/ESMలకు ఫీజు లేదు.

March 2, 2026 / 10:57 AM IST