• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

వేసవికి ముందే SC కాలనీలో తాగునీటి సమస్య

ASF: చింతలమానేపల్లి మండలం రణవెల్లి SC కాలనీలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. బోర్వెల్ సౌకర్యం లేకపోవడంతో నివాసితులు ట్రాక్టర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటున్నారు. ప్రతి వేసవిలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని మహిళలు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారంగా బోర్వెల్ ఏర్పాటు చేయాలని MLA హరీశ్ బాబును కోరారు.

February 27, 2026 / 01:29 PM IST

ALERT: భారీ ఉద్యోగాలు.. ఇవాళే లాస్ట్

DRDOలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్‌ను విడుద‌లైంది. ఇందుకు, ద‌ర‌ఖాస్తుల గ‌డువు నేటితో ముగియనుంది. బీటెక్ డిప్లొమా వంటి విద్యార్హ‌త‌లు ఉండి ఆస‌క్తి గల అభ్య‌ర్థులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.drdo.gov.inను సంప్రదించండి.

February 27, 2026 / 01:02 PM IST

పరీక్ష తేదీల్లో మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే!

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పారా మెడికల్ పోస్టులు పరీక్ష తేదీలను సవరించింది. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు మార్చి 10 నుంచి 12 వరకు జరగాల్సి ఉన్నాయి. కానీ, తాజా ప్రకటన ప్రకారం ఈ  పరీక్షలు మార్చి 11, 12, 13 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షకు 10 రోజుల ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్, 4 రోజుల ముందు అడ్మిట్ కార్ట్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

February 27, 2026 / 11:52 AM IST

వార్నర్ బ్రదర్స్‌తో డీల్‌.. వెనక్కి తగ్గిన నెట్‌ఫ్లిక్స్‌

వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని దక్కించుకునే రేసు నుంచి నెట్‌ఫ్లిక్స్ వెనక్కి తగ్గింది. కొనుగోలు ఆఫర్ మొత్తాన్ని పెంచేందుకు నెట్‌ఫ్లిక్స్ ఆసక్తి చూపకపోవడంతో ఈ డీల్ నిలిచిపోయింది. దీంతో, ట్రంప్‌తో అనుబంధం ఉన్న పారామౌంట్ స్కైడ్యాన్స్ సంస్థతో ఈ ఒప్పందం ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. భారీ వ్యయంతో కూడిన ఈ డీల్ ఇప్పుడు మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది.

February 27, 2026 / 11:46 AM IST

అమెరికాను అధిగమించనున్న భారత్

అంతర్జాతీయ ఇంధన వ్యవస్థలో భారత్ కీలక పాత్ర పోషించనుందని ‘షెల్ ఇండియా’ ఓ నివేదిక విడుదల చేసింది. 2040ల్లో అమెరికాను, 2060ల్లో చైనాను ఇంధన గిరాకీలో భారత్ అధిగమించగలదని అంచనా వేసింది. వచ్చే పదేళ్లలో సహజ వాయువు, LNG కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపింది. వీటి గిరాకీ 50% లేదా అంతకంటే ఎక్కువ పెరగొచ్చని పేర్కొంది.

February 27, 2026 / 09:26 AM IST

మాజీ సైనికులకు రైల్వేలో ఉద్యోగాలు

మాజీ సైనికులు, అగ్నివీరులకు అండగా నిలిచేందుకు భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సేవలో రిటైర్డ్ అయిన సైనికులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో భారత సైన్యంతో ఒక కొత్త సహకార ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా, తక్షణమే 5,000 మందికి పైగా మాజీ సైనికులను కాంట్రాక్టు పద్ధతిలో ‘పాయింట్స్‌మెన్‌’గా నియమించుకోనున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది.

February 27, 2026 / 09:12 AM IST

4000 మంది ఉద్యోగులకు లేఆఫ్స్

ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, ‘బ్లాక్’ సీఈవో జాక్ డోర్సే కీలక ప్రకటన చేశారు. ఏఐ బూమ్ నేపథ్యంలో తమ కంపెనీలో 4000 మందికిపైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో ఇది 40 శాతంగా ఉంది. ఈ నిర్ణయం చాలా కఠినమైనదని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

February 27, 2026 / 08:40 AM IST

అమెరికా డిమాండ్స్‌కు నో చెప్పిన ఆంథ్రోపిక్

అమెరికా డిమాండ్స్‌కు ఆంథ్రోపిక్ నో చెప్పింది. ఏఐ టూల్ క్లాడ్ నుంచి రక్షణలను తొలగించమని ఆంథ్రోపిక్ సీఈవో వెల్లడించారు. యూఎస్‌ బెదిరింపులు తమ నిర్ణయాన్ని మార్చలేవని స్పష్టం చేశారు. కాగా, సైనిక ప్రయోజనాల కోసం ఎలాంటి షరతులు లేకుండా ఏఐ సాంకేతికతకు యాక్సెస్ ఇవ్వాలని అమెరికా రక్షణ మంత్రి గడువు విధించారు. లేకపోతే కాంట్రాక్ట్ నుంచి బయటకు వస్తామని హెచ్చరించారు.

February 27, 2026 / 08:08 AM IST

మార్చి 2 నుంచి పరీక్షలు

AP: రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు గ్రాండ్ టెస్ట్, తొమ్మిదో తరగతి విద్యార్థులకు SA-2 పరీక్షలు మార్చి 2 నుంచి నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను RJDలు, డీఈవోలు క్షేత్రస్థాయి సిబ్బందికి చేరవేయాలని ఆదేశించింది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది.

February 27, 2026 / 06:22 AM IST

మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

సత్యసాయి: జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు డీఈవో కృష్ణప్ప తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 31లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఐదో తరగతి స్థాయిలోనే తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఈ పరీక్ష ఉంటుందని వివరించారు.

February 27, 2026 / 06:00 AM IST

ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

NLR: ASపేటలో ఉన్న ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతిలో 2026-27 ఏడాది ప్రవేశానికి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని గురువారం ప్రిన్సిపల్ కే. శ్రీదీప్ కోరారు. ప్రవేశ పరీక్ష కోసం ఓసీ, బీసీ రూ. 200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 125 ఆన్ లైన్‌లో రుసుము చెల్లించి దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 31 వరకు దరఖాస్తుకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

February 27, 2026 / 05:30 AM IST

గురుకుల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

ఏపీ గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 5వ తరగతిలో ప్రవేశానికి, 6,7, 8 తరగతలలో మిగిలి ఉన్న సీట్లలో ప్రవేశానికి, ఇంటర్, డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నారు. మార్చి 31 వరకు ఆన్లైన్‌లో దరఖాస్తులు చేయవచ్చని, ఏప్రిల్ 24న ప్రవేశ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పూర్తి వివరాలకు apcfss.inను సంప్రదించండి.

February 26, 2026 / 09:49 PM IST

ఇక నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్: రేవంత్ రెడ్డి

TG: నర్సరీ నుంచి యూనివర్సిటీ వరకు ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయాలని ప్రభుత్వానికి విద్యాకమిషన్ సూచనలు చేసింది. DEIED కోర్సు రద్దు చేయాలని.. బీఈడీ విద్యార్థులకు 150 రోజుల టీచింగ్ ట్రైనింగ్ ఉండాలని పేర్కొంది. మరోవైపు వచ్చే విద్యాసంవత్సరం నుంచి 100 నియోజకవర్గాల్లోని 200 ప్రభుత్వ పాఠశాలలను ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’గా అప్ గ్రేడ్ చేయనున్నట్లు CM రేవంత్ ప్రకటించారు.

February 26, 2026 / 09:29 PM IST

భారత్‌లో పనిచేసేందుకు ఉత్తమమైన 10 కంపెనీలు

ప్రముఖ ప్లాట్‌ఫామ్ బ్లైండ్ 2026 సంవత్సరానికి భారత్‌లో పనిచేసేందుకు ఉత్తమమైన టాప్ 10 కంపెనీల జాబితాను ప్రకటించింది. ఇందులో ఎన్విడియా (NVIDIA) అగ్రస్థానంలో నిలిచింది. గూగుల్, ఆపిల్ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. సుమారు 40,686 మంది ఉద్యోగుల సమీక్షల ఆధారంగా ఈ ర్యాంకింగ్‌ను రూపొందించారు. ఈ కంపెనీలు మెరుగైన పని వాతావరణాన్ని అందిస్తున్నాయి.

February 26, 2026 / 08:20 PM IST

ఈడీ ఎదుట హాజరైన అనిల్ అంబానీ

రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ ఈడీ ఎదుట హాజరయ్యారు. అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ నకు ప్రమేయం ఉన్న రూ.40 వేల కోట్ల బ్యాంకింగ్, కార్పొరేట్ మోసం కేసులో ఈడీ ఆయనను విచారిస్తోంది. కాగా, ఇటీవల ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

February 26, 2026 / 03:21 PM IST