• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

బస్సు బోల్తా.. తప్పిన ప్రమాదం

AP: నెల్లూరు జిల్లా సంగం మండల పరిధిలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. కొలగట్ల గ్రామం వద్ద లారీని తప్పించబోయి బస్సు పక్కకు పడింది. దీంతో ఐదుగురికి గాయాలు కాగా.. వారందరినీ సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 4, 2026 / 09:30 AM IST

BREAKING: బావిలో పడ్డ కారు.. 9 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాసిక్‌ జిల్లాలో ఓ కారు బావిలో పడింది. ఈ ఘటనలో ఆరుగురు పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతిచెందారు. నాసిక్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని దిండోరిలో నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది. కారు నడుపుతున్న వ్యక్తి చీకట్లో బావిని గుర్తించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 4, 2026 / 09:07 AM IST

యువకుడిని రాళ్లతో కొట్టి చంపిన దుండగులు

TG: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షలతోనే హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కారులో వెళ్తున్న యువకుడిని గుర్తుతెలియని దుండగులు టిప్పర్‌తో వెంబడించి ఢీకొట్టారు. ఆ యువకుడు తీవ్రంగా గాయపడటంతో రాళ్లతో కొట్టి చంపారు. హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 4, 2026 / 08:38 AM IST

కాసేపట్లో పెళ్లి.. వరుడు మృతి

ATP: అనంతపురానికి చెందిన లోకేశ్(29) హైదరాబాద్ కేపీహెచ్‌బీ పరిధిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే ఫార్మా కంపెనీలో పనిచేసే యువతితో రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఆయన, పెళ్లికి సిద్ధమయ్యారు. పెళ్లి దుస్తులు ధరించి, భోజనం తీసుకురావాలని ప్రియురాలిని బయటకు పంపారు. ఆమె తిరిగి వచ్చేసరికి ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

April 4, 2026 / 08:04 AM IST

గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లో అగ్నిప్రమాదం

KKD: సామర్లకోటలో రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్‌లో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. సామర్లకోట, వేట్లపాలెం గ్రామాల ప్రజలు అగ్ని ప్రమాదం పట్ల ఉలిక్కిపడ్డారు. అగ్నిమాపక బృందాలు, గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ సిబ్బంది మంటల్ని అదుపు చేయటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్లాంట్‌లో భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. వేట్లపాలెం, కొత్తూరు,సామర్లకోట వరకు పొగ వ్యాపించింది.

April 4, 2026 / 08:03 AM IST

ఫ్యాక్టరీ బస్సు ఢీకొని విద్యార్థిని మృతి

TG: సంగారెడ్డి జిల్లా రుద్రారం శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పరిశ్రమ బస్సు ఢీకొని పదోతరగతి విద్యార్థిని మృతి చెందింది. రుద్రారం నుంచి బైకుపై వెళ్తున్న విద్యార్థిని బస్సు ఢీకొట్టింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

April 3, 2026 / 09:33 PM IST

దారుణం.. మహిళను కత్తితో బెదిరించి అత్యాచారం

AP: పల్నాడు మాచర్లలో అమానుష ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఒక వ్యక్తి దాహంగా ఉందని.. మంచినీళ్లు కావాలని నమ్మించి లోపలికి ప్రవేశించాడు. ఆమెపై లైంగిక దాడికి యత్నించగా.. తనకు HIV ఉందని మొరపెట్టుకున్నా వినకుండా.. ఆమెను స్కార్ఫ్‌తో కట్టేసి, కత్తితో బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

April 3, 2026 / 09:16 PM IST

మాచర్ల అత్యాచార ఘటన.. దర్యాప్తు వేగవంతం

AP: పల్నాడు జిల్లా మాచర్లలో ఒంటరిగా ఉన్న మహిళపై జరిగిన అత్యాచార ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. CCTV ఫుటేజ్ ఆధారంగా అనుమానితుడిని గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు, అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారితో విచారణకు ఆదేశించారు. క్లూస్ టీమ్ ఘటనాస్థలి నుండి కీలక సాక్ష్యాలను సేకరించింది.

April 3, 2026 / 06:47 PM IST

క్వాక్ ఎరీనా డ్రగ్స్ కేసులో ట్విస్ట్

TG: HYDలోని క్వాక్ ఎరీనా డ్రగ్స్ కేసులో ట్విస్ట్ నెలకొంది. పట్టుబడ్డ 8 మందిలో ఏడుగురికే డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. రిత్విక్ అనే యువకుడికి యూరిన్ టెస్ట్‌లో పాజిటివ్ రాగా ఆ తర్వాత బ్లడ్ రిపోర్ట్‌లో నెగిటివ్‌గా తేలింది. డిప్రెషన్ కారణంగా నిద్రమాత్రలు వాడటంతో రిత్విక్‌కు పాజిటివ్ వచ్చింది. 8 మందిలో ఏడుగురినే కన్జ్యుమర్లుగా పోలీసులు చూపారు.

April 3, 2026 / 05:29 PM IST

పెళ్లి దుస్తుల్లో ప్రేమ జంట ఆత్మహత్య

MP సాగర్ జిల్లాకు చెందిన రాజేంద్ర(22)-కాజల్ పటేల్(21) దంపతులు పెళ్లి బట్టలు ధరించి సూసైడ్ చేసుకున్నారు. ప్రస్తుతం కాజల్ గర్భవతి కాగా.. ఇద్దరూ రాత్రి భోజనం చేశాక బలవన్మరణానికి పాల్పడ్డారు. మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. సూసైడ్ లెటర్ కూడా రాయకుండా చనిపోయేంత కష్టం ఏం వచ్చిందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

April 3, 2026 / 12:04 PM IST

అమానుషం.. దాహమంటూ వచ్చి అత్యాచారం

AP: పల్నాడు జిల్లా మాచర్లలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంటికి ‘దాహంగా ఉంది, నీళ్లు కావాలి’ అంటూ వచ్చిన ఓ వ్యక్తి.. ఇంట్లోని మహిళ మెడపై కత్తి పెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలిని ఓ ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించారు. ప్రస్తుతం ఆమె నరసరావుపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

April 3, 2026 / 07:59 AM IST

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన టూరిస్టు బస్సు

AP: మార్కాపురం జిల్లా దోర్నాల సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని గుజరాత్ టూరిస్ట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. నలుగురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 3, 2026 / 07:03 AM IST

కన్న కూతురిని హతమార్చిన తండ్రి

AP: పల్నాడు జిల్లా మాచర్లలో పరువు హత్య కలకలం రేపింది. నాగరాజు అనే వ్యక్తిని ప్రేమించి, గత నెలలో ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్న చౌడేశ్వరిని ఆమె తండ్రే దారుణంగా చంపాడు. సర్దిచెబుదామని ఇంటికి పిలిపించగా.. భర్తతోనే ఉంటానని ఆమె తెగేసి చెప్పింది. దీంతో ఆగ్రహం చెందిన తండ్రి, పరువు పోయిందన్న కోపంతో కన్నకూతురిని అంతమొందించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

April 3, 2026 / 05:23 AM IST

సైబర్ నేరాలు.. అప్రమత్తంగా ఉండాలి: శిఖా గోయల్

వృద్ధులే లక్ష్యంగా సాగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని TGCSB డైరెక్టర్ శిఖా గోయల్ హెచ్చరించారు. APRను వృద్ధుల అవగాహన మాసంగా ప్రకటించి, ‘అన్‌లైన్ బట్ అన్‌ఫ్రైడ్’ నినాదంతో సదస్సులు నిర్వహిస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ వంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, మోసపోతే ‘1930’కు కాల్ చేయాలన్నారు. గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు చేస్తే సొమ్ము దక్కే అవకాశముందన్నారు.

April 3, 2026 / 04:47 AM IST

ప్రైవేట్ బస్సు దగ్ధం.. పరుగులు తీసిన ప్రయాణికులు

AP: తిరుపతి బాలాయపల్లి మండలం మేల్చూరు వద్ద బస్సు దగ్ధమైంది. ఓ ప్రైవేట్ బస్సును బైక్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. బస్సు కిందకు బైక్ వెళ్లడంతో పెట్రోల్ ట్యాంకర్ పేలి మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు దిగి పరుగులు తీశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 2, 2026 / 06:39 PM IST