• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నర్సీపట్నంలో న్యాయవాదులు నిరసన

AKP: నర్సీపట్నం న్యాయస్థానాల ఆవరణలో సోమవారం న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మెట్ట ప్రభాకర్ మాట్లాడుతూ కర్నూలు సిటీలో పవన్ కుమార్ అనే న్యాయవాది మీద సీఐ విక్రమ సింహ దాడి చేయడం అమానుషమని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

February 23, 2026 / 11:49 AM IST

చేనేత అంశంపై మంత్రి సవిత సమాధానం

సత్యసాయి: బడ్జెట్ సమావేశాల్లో సోమవారం మంత్రి సవిత పాల్గొన్నారు. చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. చీరాల చేనేత క్లస్టర్‌కు రూ.4.17 కోట్లు మంజూరు చేశామని, చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపు ప్రతిపాదన పరిశీలనలో ఉందని తెలిపారు. ధర్మవరంలో రూ.38.31 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

February 23, 2026 / 11:47 AM IST

గొడవ పడి తండ్రిపై దాడి చేసిన కొడుకు

కృష్ణా: పామర్రు మండలం కొండిపర్రు గ్రామంలో దారుణ ఘటన ఇవాళ చోటు చేసుకుంది. వేడి నీళ్లు కాస్తున్న సమయంలో తండ్రి సురేష్‌తో గొడవ పడిన కొడుకు మహేష్ కత్తితో దాడి చేశాడు. తండ్రిని మన వద్ద నరకడంతో తీవ్రంగా గాయపడిన సురేష్‌ను మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోని ఆయన మృతి చెందాడు. కొడుకు మహేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

February 23, 2026 / 11:46 AM IST

రెండేళ్లుగా మూలన బోరు.. తాగునీటికి ఇబ్బంది

ASR: డుంబ్రిగుడ సామాజిక భవనం వద్ద ఉన్న తాగునీటి బోరు రెండేళ్లుగా పాడై నిరుపయోగంగా మారిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోరు పాడవడంతో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామంటున్నారు.పలుమార్లు అధికారులకు తెలిపిన పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బోరును మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.

February 23, 2026 / 11:46 AM IST

జిల్లాలో పర్యటించనున్న శ్రీ వాగ్దేవి కళా పీఠం వ్యవస్థాపకులు

శ్రీ వాగ్దేవి కళా పీఠం వ్యవస్థాపకులు శ్రీనివాసమూర్తి ఈనెల 24న విజయనగరం జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారని తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ పేర్కొన్నారు. ఆరోజు ఉదయం 10 గంటలకు గురజాడ పాఠశాలలో జరుగనున్న కార్యక్రమంలో తెలుగు భాషా ప్రాశస్త్యం అనే అంశంపై ప్రసంగిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అందరు హాజరు కావాలని కోరారు.

February 23, 2026 / 11:45 AM IST

ఇస్వీ రైల్వే బ్రిడ్జిపై గుంతల ముప్పు

KRNL: ఆదోని శివారులోని ఇస్వీ రైల్వే బ్రిడ్జిపై ప్రమాదకర గుంతలు ఏర్పడి ప్రయాణికులకు ముప్పుగా మారాయి. రోజూ వాహనాలు ప్రమాదాలకు గురై పలువురు గాయపడుతున్నారు. గతంలో ప్రభుత్వం కేటాయించిన నిధులతో గుంతలు పూడ్చినా, నాణ్యత లోపంతో మళ్లీ పాత స్థితికి చేరాయి. ఆర్అండ్‌బీ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

February 23, 2026 / 11:42 AM IST

ఈనెల 24 నుండి ఏపీ అసెంబ్లీ క్రీడా మహోత్సవాలు

TPT: విజయవాడలోని ఏపీ అసెంబ్లీ క్రీడా మహోత్సవాలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, శాప్ (SAP) ఛైర్మన్ రవి నాయుడు గారితో క్రీడా వేదికలు, మైదానాల సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు. అలాగే శ్రీకాళహస్తిలో ఆర్ట్స్ కాలేజీ మైదానాన్ని అభివృద్ధి చేయాలని శాప్ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. యువ క్రీడాకారులకు క్రీడా పరికరాలు అందించాలని కోరారు.

February 23, 2026 / 11:39 AM IST

‘ఎర్రం నాయుడు ఆశయ సాధనలకు కృషి చేయాలి’

SKLM: కొత్తూరు మండల కేంద్రంలో దివంగత నేత, మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రం నాయుడు 69వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి వైస్ ఎంపీపీ, టీడీపీ సీనియర్ నాయకులు లోతుగడ్డ తులసి వరప్రసాద్ నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజాసేవ, నిబద్ధత, రాజకీయ విలువలను స్మరించుకుంటూ, నేటి యువత మాజీ కేంద్రమంత్రి ఆశయ సాధనాలకు కృషి చేయాలన్నారు.

February 23, 2026 / 11:30 AM IST

విజ్జిస్టేడియంను పరిశీలించిన గోవా గవర్నర్

విజయనగరం విజ్జిస్టేడియంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ముఖ్యఅతిథిగా విజయనగరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా విజ్జి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో గల అన్నీ డిపార్ట్‌మెంట్లను గవర్నర్ పరిశీలించారు. వాటి పనితీరును, అభివృద్ధి, తదితర అంశాలపై స్పోర్ట్స్ అభివృద్ధి అధికారితో వివరాలు అడిగారు.

February 23, 2026 / 11:30 AM IST

ట్రాఫిక్ జామ్‌ నివారణకు ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్

కృష్ణా: పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా పెడన పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై-2 సోమవారం బస్టాండ్ సెంటర్ వద్ద ఆటో డ్రైవర్లతో కౌన్సెలింగ్ నిర్వహించారు. రోడ్లపై ఆటోలను అడ్డంగా నిలిపివేయడం వల్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయని తెలిపారు. ప్రయాణికులను ఎక్కించడం, దింపడం కోసం నిర్ణయించిన ప్రదేశాలనే ఉపయోగించాలని డ్రైవర్లకు సూచించారు.

February 23, 2026 / 11:30 AM IST

అనంతపురంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ఓ.ఆనంద్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్ తదితర అధికారులతో కలిసి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.

February 23, 2026 / 11:23 AM IST

ఎమ్మిగనూరు వద్ద ట్రాక్టర్ ఢీ.. నలుగురికి గాయాలు

KRNL: గోనెగండ్ల మండలం అలువల గ్రామానికి చెందిన రఘు, రాముడు, ఖాసీంవలి, దశరథ పెళ్లికి వెళ్తుండగా ఎమ్మిగనూరు సమీపంలో ప్రమాదం జరిగింది. బండల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ వారి స్కూటర్ను ఢీకొనడంతో నలుగురు తీవ్రంగా ఇవాళ గాయపడ్డారు. రఘు, రాముడు పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

February 23, 2026 / 11:23 AM IST

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

PLD: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. స్థానిక నరసరావుపేటలోని శ్రీ కాసు రాఘవమ్మా బ్రహ్మానందరెడ్డి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తనిఖీ చేశారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

February 23, 2026 / 11:18 AM IST

నాటు బాంబు పేలి కుక్క మృతి..!

CTR: గుడిపల్లి మండలం సాల చింతనపల్లి గ్రామ సమీపంలో అడవి పందుల కోసం పెట్టిన నాటు బాంబు పేలి ఓ కుక్క మృతిచెందగా మరో కుక్కపిల్ల తీవ్రంగా గాయపడింది. కొంతమంది వేటగాళ్లు అడవి పందుల కోసం పెడుతున్న నాటు బాంబులు మూగజీవుల ప్రాణాలు తీస్తున్నాయ. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నారులు ఎవరైనా వీటిని తాకి ఉంటే పరిస్థితి ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.

February 23, 2026 / 11:18 AM IST

రేపు మేడికొండూరులో మెగా జాబ్ మేళా

GNTR: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో రేపు మేడికొండూరులో మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా అధికారి సంజీవరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 8వ తరగతి నుంచి పీజీ (MBA, M.Com) వరకు చదువుకున్న వారు, అలాగే ఐటీఐ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ మేళాకు హాజరుకావచ్చు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులన్నారు.

February 23, 2026 / 11:18 AM IST