E.G: నిబద్ధతగా పనిచేసే సేవా సంస్థలపై చిన్నచూపు తగదని.. ప్రభుత్వం తమను గుర్తించాలని ఎన్జీవోలు కోరారు. రాజమండ్రిలోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఎన్జీవో ఐ.కుమార్ అధ్యక్షతన ప్రపంచ స్వచ్ఛంద సేవా సంస్థల దినోత్సవ వేడుకలు జరిగాయి. స్వర్ణాంధ్ర సంస్థ నిర్వాహకులు గుబ్బల రాంబాబు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో 36 ఎన్జీవో సంస్థలు పాల్గొన్నాయి.
కర్నూలు: జిల్లా లక్కవరం గ్రామానికి చెందిన సంగీత ఉపాధ్యాయురాలు పార్వతి ‘మహిళా కీర్తి రత్న ఉమెన్స్ ఎక్సలెన్సీ–2026’ అవార్డుకు ఎంపికయ్యారు. శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో మార్చి 8న విజయవాడలో జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమెకు ఈ పురస్కారం అందజేయనున్నారు. జీ తెలుగు సరిగమప కంటెస్టెంట్‌గా రాణించిన పార్వతిని పలువురు అభినందించారు.
KDP: YVU విశ్వవిద్యాలయం 11,12,13,14వ స్నాతకోత్సవం నిర్వహణ తేదీని రాష్ట్ర గవర్నర్ కార్యాలయ సూచన మేరకు మార్పు చేసినట్లు YVU ఉప కులపతి ఆచార్య రాజశేఖర్ తెలిపారు. గతంలో మార్చి 11వ తేదీ నిర్వహిస్తామని తీసుకున్న నిర్ణయాన్ని అదే నెల 13వ తేదీకి మార్పు చేసినట్లు వివరించారు. కాన్వకేషన్ కు హాజరయ్యే విద్యార్థులు ఈ మార్పును గమనించాలన్నారు.
SKLM: NTR భరోసా పింఛన్లు పేదలకు వరం అని ఏపీ టీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు అన్నారు. శనివారం పలాస పట్టణంలో పలు వార్డుల్లో ఆయన పర్యటించారు. ఈ మేరకు ఎన్టీఆర్ పింఛన్ భరోసా పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు ప్రతి నెల ఒకటో తేదీనే ఇంటి వద్దకే పింఛన్లు అందజేస్తున్నారని అన్నారు.
TPT: చంద్రగిరిలో శుక్రవారం రాత్రి డిజిటల్ పన్నుల వసూళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈవో చంద్రశేఖర్‌రెడ్డి సిబ్బందితో కలిసి గృహాలు, దుకాణాల వద్దకు వెళ్లి డిజిటల్ విధానంలో పన్నులు వసూలు చేశారు. మార్చి 5 లోపు బకాయి పన్నులు చెల్లించాలని ఆయన ప్రజలను కోరారు. డిజిటల్ చెల్లింపుల ద్వారా పారదర్శకతతో పాటు సులభతరం అవుతుందని తెలిపారు.
KRNL: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మార్చ్ 1న ఆదివారం సెలవు కావడంతో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఈనెల 28వ శనివారం పంపిణీ చేశారు. ఆలూరు టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్ ఆదేశాలతో ఆలూరు టౌన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు వాల్మీకి బోయ గుండయ్య పింఛన్ పంపిణీ చేశారు.
కృష్ణా: మచిలీపట్నంలోని ఆర్కే ప్యారడైజ్‌లో జనసేన ఉద్యమి దిశా నిర్దేశం కార్యక్రమం శుక్రవారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ.. జనసేన పార్టీ బలోపేతం కోసం గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే విధానాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
NLR: సోమశిలకు చెందిన వేలమూరి శ్రీరామ్‌కు కేంద్ర ప్రభుత్వ పురస్కారం లభించింది. అతి ఉత్కృష్ట సేవా పథకంలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఫర్ ది ఔట్ స్టాండింగ్ ఇన్ ఇంటలిజెన్స్ ఇన్-2025 పురస్కారాన్ని అందుకోనున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా జోనల్ ఇన్ స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కానిస్టేబుల్‌గా ప్రస్థానం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు.
PLD: పెదకూరపాడు నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు ఒకరోజు ముందే పింఛన్ల పంపిణీ చేపట్టారు. ఒకటవ తేదీ ఆదివారం కావడంతో శనివారం ఉదయం నుంచి అధికారులు నాయకులు లబ్ధిదారుల ఇళ్లకు చేరుకొని వారికి పింఛన్లు అందించారు. పింఛను చేతికి రావడంతో అవ్వ తాతల ముఖంలో ఆనందాన్ని చూసామని స్థానిక నేతలు అన్నారు.
అనంతపురం నియోజకవర్గం 19వ డివిజన్‌లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. మార్చి 1న ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేశారు. వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ తుల్జాపూర్ స్వప్న, క్లస్టర్ ఇంఛార్జ్ శ్రీనివాస్ ఆచారి, సచివాలయం సిబ్బంది కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
KKD: బాలికల రక్షణే మనందరి బాధ్యత అని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ పోలీసు కన్వెన్షన్ హాల్లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ, పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో “డిస్ట్రిక్ట్ లెవెల్ వర్క్ షాప్ ఆన్ లెజిస్లేషన్ ఆఫ్ పోక్సో (POCSO), బాల్య వివాహాల నిర్మూలన అక్రమ రవాణాపై అవగాహన కల్పించారు. బాలికలు, మహిళా భద్రతపై ఎస్పీ దిశానిర్దేశం చేశారు.
VZM: బొబ్బిలి ఇంఛార్జి డీఎస్పీగా ఎస్.రాఘవులుకు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ఆయన చీపురుపల్లి డీఎస్పీగా విధులు నిర్వహిస్తూ అదనంగా బొబ్బిలి డీఎస్పీగా కొనసాగుతారు. ఇప్పటివరకు బొబ్బిలి డీఎస్పీగా విధులు నిర్వహించిన భవ్యారెడ్డి హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర DGP కార్యాలయానికి బదిలీ చేశారు.
అన్నమయ్య: సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామంలోని హరిజనవాడలో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న సిద్ధవటం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అన్నమయ్య: మదనపల్లి పట్టణంలో బిటి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రాఘవ రెడ్డి చేతులమీదుగా విశాలాంధ్ర సంచారక పుస్తకాలయం శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాఘవ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ గతిని, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, మానవ సమాజంలో విప్లవాత్మక మార్పులను తెచ్చింది పుస్తకమేనని, నేటి యువతకు పుస్తక పఠనం చాలా అవసరమని ఆయన అన్నారు.
KRNL: పెద్దకడబూరు మం. జాలవాడి గ్రామంలో ఆపరేషన్ వజ్ర పహార్‌లో భాగంగా ఇవాళ కార్టెన్ సెర్చ్ నిర్వహించారు. DSP భార్గవి పర్యవేక్షణలో CI మంజునాథ్, SI నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో అనుమానిత ప్రాంతాలు, ఇళ్లు, పంట పొలాల్లో గంజాయి, నాటుసారా, మద్యం, గుట్కాలపై సోదాలు చేపట్టారు. 4 గురు సీఐలు, 4 గురు ఎస్సైలు సహా 30 మంది సిబ్బంది పాల్గొన్నారు.