• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘విలువలతో భవిష్యత్ అందించటమే జనసేన లక్ష్యం’

కృష్ణా: రేపటి తరానికి విలువలతో భవిష్యత్ అందించటమే జనసేన పార్టీ లక్ష్యమని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. శుక్రవారం నాగాయలంకలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు శిబిరాన్ని వెంకట్రామ్ సందర్శించి, సాధకులను అభినందించారు. సమాజం బాగుపడాలని కోరుకునే యువత ప్రతి ఒక్కరు జనసేన ఉద్యమి సభ్యత్వం తీసుకోవాలని కోరారు. ఇందులో జనసేన నాయకులు పాల్గొన్నారు.

February 27, 2026 / 05:59 PM IST

రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

GNTR: తెనాలి నియోజకవర్గంలో కీలకమైన నందివెలుగు – ఆటో నగర్ (తెనాలి–మంగళగిరి) రహదారి అభివృద్ధి పనులకు రూ. 2.00 కోట్ల వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టారు. రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

February 27, 2026 / 05:59 PM IST

పేదల సొంతింటి కలకు ప్రభుత్వం మద్దతు: ప్రత్తిపాటి

PLD: గృహ నిర్మాణ రంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.6,357 కోట్లు కేటాయించడం శుభపరిణామమని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇస్తామన్న సీఎం నిర్ణయం చరిత్రాత్మకమన్నారు. గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల పేరుతో జరిగిన అవినీతిపై ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

February 27, 2026 / 05:58 PM IST

వేములపాడులో వాహన తనిఖీలు చేపట్టిన ఎస్సై

ప్రకాశం: హనుమంతునిపాడు మండలం వేములపాడు రహదారిపై ఎస్సై మాధవరావు శుక్రవారం విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక సీటులో కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 27, 2026 / 05:58 PM IST

శ్రీకాళహస్తిలో శ్రీనివాస్ రెడ్డికి సన్మానం

TPT: వైసీపీ రాష్ట్ర ఇంటలెక్చువల్ ఫోరం జాయింట్ సెక్రటరీగా నియమితులైన కొత్తపాటి శ్రీనివాస్ రెడ్డిను శ్రీకాళహస్తిలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

February 27, 2026 / 05:58 PM IST

‘విద్యార్థులు ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలి’

ప్రకాశం: పదవ తరగతి విద్యార్థులు రానున్న పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలని ప్రకాశం జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డి అన్నారు. శుక్రవారం వెలిగండ్ల జిల్లా పరిషత్ పాఠశాలలో ఫేర్వెల్ పార్టీ జరిగింది. ఈ కార్యక్రమంలో కాశిరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదివి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు.

February 27, 2026 / 05:55 PM IST

లబ్ధిదారుడికి LOCని అందజేసిన మంత్రి

GNTR: కొల్లిపర మండలం సిరిపురం గ్రామానికి చెందిన గోసే రాజారావు వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 4 లక్షల ఆర్థిక సహాయం మంజూరైంది. మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో ఈ సహాయం లభించింది. మంజూరైన నిధులకు సంబంధించిన ఎల్‌ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్)ను శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులకు నాదెండ్ల మనోహర్ అందజేశారు.

February 27, 2026 / 05:53 PM IST

రిసెప్షన్ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి

NTR: విజయవాడ రూరల్ మండలం, జక్కంపూడి కాలనీ వాస్తవ్యులు శ్రీ అడపా లక్ష్మణరావు, వెంకటలక్ష్మి కుమార్తె, వివాహ రిసెప్షన్ వేడుకలో టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పాల్గొన్నారు. నూతన వధూవరులు ధనలక్ష్మీ, రుష్యేంద్ర శ్రీనివాస్‌లకు అక్షింతలు వేసి ఆశీర్వదించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

February 27, 2026 / 05:51 PM IST

వివేకా హత్య కేసులో మళ్లీ సీబీఐ విచారణ

కడప జిల్లా: వివేకా హత్య కేసులో రెండేళ్ల తర్వాత సీబీఐ మళ్లీ విచారణ ప్రారంభించింది. పులివెందుల పీఎస్‌కు చేరుకున్న అధికారులు కిరణ్ కుమార్ యాదవ్, మహేంద్ర యాదవ్‌లకు నోటీసులు ఇచ్చారు. మహేంద్ర యాదవ్ విచారణకు హాజరుకాగా, కిరణ్ యాదవ్ హాజరుకానున్నారు. సుప్రీంకోర్టు సూచన మేరకు కిరణ్–అర్జున్ రెడ్డి కాల్ డేటాపై సీబీఐ ప్రశ్నిస్తోంది.

February 27, 2026 / 05:49 PM IST

వంద శాతం ఫలితాలే లక్ష్యం: కలెక్టర్ మహేష్

కోనసీమ: జిల్లాలో మార్చి 16 నుండి ప్రారంభం కానున్న 10th పరీక్షలపై కలెక్టర్ మహేష్ కుమార్ శుక్రవారం సమీక్షించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘100 రోజుల ప్రణాళిక’ ద్వారా జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులను ‘షైనింగ్’, ‘రైజింగ్’ స్టార్లుగా విభజించి, వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.

February 27, 2026 / 05:47 PM IST

రేపే పెన్షన్ పంపిణీ: ఎంపీడీవో

CTR: పెనుమూరు మండలానికి మార్చికి గాను రూ. 2.97 కోట్ల పెన్షన్ నగదు మంజూరైనట్లు ఎంపీడీవో నీలకంఠేశ్వర్ రెడ్డి తెలిపారు. మండలంలోని 14 గ్రామ సచివాలయ పరిధిలో అర్హులైన 7,060 వేల మంది లబ్ధిదారులకు పెన్షన్లను అందజేస్తామన్నారు. గ్రామ సచివాలయ సిబ్బంది శనివారం ఉదయం 7 గంటల నుంచి ప్రతి గడపకు వెళ్లి లబ్ధిదారులకు నగదును అందజేసేలా ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు.

February 27, 2026 / 05:41 PM IST

పేకాట శిబిరంపై దాడి.. కేసు నమోదు

BPT: కొల్లూరు శివారులోని పొలాల్లో పేకాట ఆడుతున్న ఐదుగురిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్సై కోటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి దాడి చేసి, నిందితుల నుంచి రూ. 6,570 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామని, వారిని కోర్టులో హాజరుపరుస్తామని ఎస్సై పేర్కొన్నారు.

February 27, 2026 / 05:41 PM IST

అవినీతి అంతం ఆమ్ ఆద్మీ పార్టీ పంతం: వెంకటరమణ బాబు

అనంతపురం: లిక్కర్ అక్రమ కేసులో కడిగిన ముత్యంలా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బయట పడడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని రాయదుర్గం ఆమ్ ఆద్మీ పార్టీ ఇంచార్జి వెంకటరమణ బాబు పేర్కొన్నారు. మీడియాకి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీ కోర్టులో నేడు లిక్కర్ కేసులో ఎటువంటి సంబంధం లేదంటూ అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందన్నారు.

February 27, 2026 / 05:41 PM IST

ఎస్టీ హాస్టల్ సందర్శించిన జిల్లా కలెక్టర్

శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఉన్న ST హాస్టల్ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం పరిశీలించారు. హాస్టల్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రతను పాటించాలని విద్యార్థులకు సూచించారు. పరిసరాలలో చెత్తాచెదారం లేకుండా ఉంచాలని తెలియజేశారు. ఎటువంటి వ్యాధులు ప్రబలిన వెంటనే ప్రభుత్వ వైద్య శాఖ సిబ్బందికి తెలియజేయాలని సూచించారు.

February 27, 2026 / 05:40 PM IST

సాగునీటి ప్రాజెక్టులపై CM వ్యాఖ్యలు హాస్యాస్పదం

KDP: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ తమ హయాంలోనే నిర్మించబడ్డాయని CM చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పడం హాస్యాస్పదమని, అవాస్తవమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసి రెడ్డి అన్నారు. శుక్రవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు వ్యాఖ్యలు ‘బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయఅంత’ అన్నట్లున్నాయని విమర్శించారు.

February 27, 2026 / 05:38 PM IST