NDL: శ్రీ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి బనగానపల్లె మండలం పలుకూరు గ్రామానికి చెందిన ఉప్పరి సుబ్బరాయుడు కుటుంబ సభ్యులు కేజీ వెండి నాగపడగ(రూ.3.50 లక్షలు)తో పాటు సుమారు రూ.70 వేల విలువైన నిత్యావసర సరుకులు విరాళంగా ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, దాతలకు ఆలయ మర్యాదలతో తీర్థప్రసాదాలు అందజేశారు.
ASR: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారికి సహకరించినా, ఆశ్రయం ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం మంప ఎస్సై శ్రీనివాస్, ఏపీఎస్పీ సిబ్బందితో గరిమండ గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తులు గ్రామాల్లోకి ప్రవేశిస్తే సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
NLR: అల్లూరు మండల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. అల్లూరు మండలంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో ONGC కంపెనీ సీఎస్ఆర్ నిధులు 90 లక్షలతో ఏర్పాటు చేయనున్న సెంట్రల్ లైటింగ్‌కు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ రవిచంద్ర పాల్గొన్నారు.
కృష్ణా: మచిలీపట్నం-పెడన జాతీయ రహదారి 216పై ట్రాఫిక్ సీఐ నున్న రాజు హెల్మెట్ ధరించడంపై ద్విచక్ర వాహనదారులకు ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ హెల్మెట్ ధరించని వాహనదారులకు కేవలం ఫైన్ వెయ్యడమే కాకుండా, వారితో అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేయించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా జరిపించాలని సూచించారు.
ELR: పెదపాడు మండలం ఏపూరు గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా రూ.30 లక్షల విలువైన నిలువ ఉంచిన అక్రమ బాణాసంచాను పోలీస్, ఫైర్, రెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాణాసంచా నిల్వలో నిర్లక్ష్యం వహిస్తే అది భారీ ప్రాణ, ఆస్తి నష్టానికి దారితీస్తుందని అధికారులు తెలిపారు. నిల్వ కేంద్రం నివాస ప్రాంతాలకు దూరంగా, కేవలం కాంక్రీట్ భవనాల్లో మాత్రమే ఉండాలన్నారు.
NTR : వీరులపాడు మండలం అల్లూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఏఈగా వి. సురేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ముత్యాలంపాడు సబ్‌స్టేషన్ నుంచి బదిలీపై అల్లూరుకు వచ్చినట్లు తెలిపారు. ఇంతవరకు ఏఈగా విధులు నిర్వహించిన కృష్ణారెడ్డి ఇకపై సబ్ ఇంజనీర్‌గా సేవలందించనున్నారు. అధికారులు, సిబ్బంది నూతన ఏఈకు అభినందనలు తెలిపారు.
KRNL: రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్లకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పిఎస్.రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం చలో విజయవాడకు వెళ్తున్న అంగన్వాడీలను అడ్డుకోవడం, అరెస్ట్‌లు చేయడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుత నిరసనలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
NDL: బండి ఆత్మకూరు మండల పరిధిలోని కేసీ కెనాల్‌లో ప్రమాదవశాత్తు యువకుడు పడిపోయి గల్లంతయ్యాడని ఎస్సై జగన్మోహన్ తెలిపారు. ఆదివారం ఉదయం ఒంగోలు ప్రాంతానికి చెందిన హేమంత్ అనే వ్యక్తి (17) గల్లంతైనట్లు తెలిపారు. ఎస్సై జగన్మోహన్, పోలీస్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, డ్రోన్ టీం సాయంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ELR: ఉంగుటూరు మండలం నారాయణపురం ఉషోదయ హై స్కూల్లో ఉంగుటూరు మండల మానవత సమావేశం ఆదివారం జరిగింది. సమావేశానికి అధ్యక్షులు KVV.సత్యనారాయణ అధ్యక్షత వహించారు. వృద్ధుల, అనాధ బాలల ఆశ్రమకు మానవత సంస్థ రూ.50 వేల విలువైన 70 కుర్చీలను ఆనంద నిలయం ఛైర్మన్ గుణ్ణం బులెబ్బాయ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో రీజియన్ ఛైర్మన్ పుప్పాల గోపి, సర్వేశ్వరరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
NDL: కర్నూలు నగరంలో జిల్లా పరిషత్ సమావేశంలో ఆదివారం జిల్లా కలెక్టర్ రాజకుమారి పలు సమస్యలపై స్పందించారు. నూనెపల్లె-కోవెలకుంట్ల రహదారి విస్తరణలో బోర్లు దెబ్బతిన్న అంశంపై చర్యలు తీసుకుంటామని, ఎర్రగుంట్ల పాఠశాలలో వసతుల కొరతపై పరిశీలన జరిపించి వెంటనే సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. డోన్‌లో రేషన్ కార్డు సమస్యలు పరిష్కరించాలని అధికారుతకు ఆదేశించారు.
KRNL: జిల్లా పర్యటనలో భాగంగా, రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ ఛైర్మన్ తుల్జాపూర్ స్వప్న ఎమ్మిగనూరు మండలం కె.తిమ్మాపురం గ్రామంలోని “శ్రీ బసవేశ్వర కళ్యాణ మండపం” నిర్మాణానికి ఇవాళ ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమానికి తాలుకా “వీరశైవ లింగాయత్ సంక్షేమ సేవా సమితి” కమ్యూనిటీ వ్యవస్థాకాధ్యక్షులు బిసి.నాగరాజు అధ్యక్షత వహించారు.
అన్నమయ్య: అంగన్వాడీల వేతనాలను రెండుసార్లు పెంచామని, వారి సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజంపేట TDP అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు తెలిపారు. ఆదివారం TDP కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టినా, CM చంద్రబాబు, Dy. CM పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అంగన్వాడీల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.
KRNL: ఆలూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటుసారా, అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడిన 12 వాహనాలను ఈ నెల 4న వేలం వేయనున్నట్లు ఎక్సైజ్ సీఐ లలితాదేవి ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటలకు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో సెబ్ స్టేషన్ ఆవరణలో ఈ వేలం జరుగుతుంది. వేలంలో పాల్గొనాలనుకునేవారు రూ.5 వేలు చెల్లించి పాల్గొనవచ్చని సీఐ పేర్కొన్నారు.
KRNL: ఆదోని మండలం చిన్న హరివాణం గ్రామంలో పైడ్‌లైన్ పనులకు రూ.80 లక్షలు మంజూరు చేసినందుకు రాష్ట్ర కురవ కార్పొరేషన్ ఛైర్మన్ దేవేంద్రప్ప కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం కర్నూలులో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పనులు పూర్తై గ్రామానికి నీటి సరఫరా ప్రారంభమైందని తెలిపారు. ఎండాకాలం దృష్ట్యా ఎస్ఎస్ ట్యాంకుల మరమ్మతుల్లో నాణ్యత పాటించాలని సూచించారు.
W.G: భీమవరంలోని కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఆర్జీలు స్వీకరిస్తామన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని, అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.