ELR: మాదకద్రవ్యాల వినియోగంతో యువత భవిష్యత్తు అంధకారమవుతుందని కలెక్టరు వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ హెచ్చరించారు. జిల్లా స్థాయి నిరోధక కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు పిల్లలు బానిసలు కాకుండా తల్లిదండ్రులు నిఘా ఉంచాలని సూచించారు. వీటిపై సమాచారం లేదా సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లు 14446, 1972లను సంప్రదించాలన్నారు.
అన్నమయ్య: రాయచోటి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం పై దాడి చేసిన వారిని, వారి వెనుక ఉన్న కుట్రదారులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర పోలీస్ శాఖను జనసేన నాయకుడు పప్పిరెడ్డి మహేశ్వర్ రెడ్డి కోరారు. రాయచోటిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
PPM: పోలీసు సిబ్బంది యొక్క శాఖాపరమైన, ఆరోగ్య పరమైన పరిష్కారానికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ఎస్పీ ఎస్.వి మాధవరెడ్డి తెలిపారు. శుక్రవారం పోలీసు కార్యాలయంలో పోలీసు వెల్ఫేర్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా విన్నవించారు. వినతులను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.
AKP: గొలుగొండ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకు మిగులు ఖాళీలు భర్తీ చేసేందుకు మార్చి 2న జరగాల్సిన ప్రవేశ పరీక్ష 8వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని ప్రిన్సిపాల్ కోటేశ్వరరావు తెలిపారు. 9వ తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్ 2 పరీక్షలు జరుగుతున్నందున ఈ మార్పు చేశారన్నారు.
TPT: మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులకు ఆదేశించారు. మాల్ ప్రాక్టీస్‌కు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో సుమారు 33 వేల మంది విద్యార్థులు 179 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలకు హాజరవుతారని అధికారులు తెలిపారు.
CTR: కుప్పం-పలమనేరు జాతీయ రహదారిలోని శాంతిపురం వద్ద లారీ ముందువైపు వెళుతున్న ద్విచక్ర వాహనంపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో కెనమాకన పల్లికి చెందిన లోకేశ్ రెడ్డి(25) తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్ర వాహనంలో ఇంటికి వెళ్తుండగా తమిళనాడు సేలం నుంచి కలకత్తా వెళ్తున్న లారీ ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించారు.
EG: కోరుకొండ గ్రామంలో వేంచేసియున్న స్వయంభు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవంలో శుక్రవారం జరిగిన భారీ రధోత్సవం కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రతి ఏటా జరిగే మహోత్సవాలలో నిర్వహించే రథోత్సవానికి పరిసర గ్రామ ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు.
TPT: గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందినట్లు గూడూరు ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు. ఈనెల 5వ తేదీన నరసింహారెడ్డి అనే వ్యక్తి అనారోగ్యంతో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. అతనికి వైద్య చికిత్స అందిస్తున్న నేపథ్యంలో శుక్రవారం గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారని ఒకటవ పట్టణ ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు.
ELR: నూజివీడు పట్టణంలోని స్త్రీ శక్తి భవన్ లో పారిశుద్ధ్య కార్మికులకు శిక్షణ సర్టిఫికెట్స్ శుక్రవారం అందించారు. జిల్లా కోఆర్డినేటర్ గొట్టుముక్కల సీతారామాంజనేయ రాజు, ట్రైనర్ బీవి రావులు మాట్లాడుతూ.. నిత్యం కాలువలు రోడ్లను పరిశుభ్రం చేయడంలో పారిశుద్ధ్య కార్మికుల ఇబ్బందులు అనేకం అని అన్నారు. సానిటరీ ఇన్‌స్పెక్టర్ సంతోష్ పాల్గొన్నారు.
WG: గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా దెందుకూరి చిదంబర్ వెంకటరాజు అలియాస్ వంశీ, షేక్ అక్బర్‌లను ఆరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ ఆది ప్రసాద్ తెలిపారు. శుక్రవారం తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. ముందస్తు సమాచారం మేరకు పట్టణంలోని బల్బు మేడ రోడ్డులో వీరిని అదుపులోకి తీసుకుని కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
కడప: నగర పాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర శుక్రవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆస్తి పన్ను వసూళ్లను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో యూఎఫ్‌ఎస్ సర్వేను త్వరగా పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేసి, సిబ్బంది పనితీరును మెరుగుపరచుకోవాలని సూచించారు.
CTR: పుంగనూరు శ్రీకళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం స్వామివారు కోదండరామ అలంకారంలో హనుమంత వాహనంపై పుర వీధులలో తిరుగుతూ భక్తులను కటాక్షించారు. వాహనం ముందు మంగళ వాయిద్యాలు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి భజన, కోలాటాలు, డప్పు వాయిద్యాలు అందరినీ అలరించాయి.
ATP: జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సర బోటనీ, హిస్టరీ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. జనరల్ విభాగంలో 945 మందికి 861 మంది హాజరుకాగా, 84 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 2,255 మందికి 2,124 మంది హాజరుకాగా, 131 మంది పరీక్షకు రాలేదని పర్యవేక్షణాధికారి ఎం.వెంకటరమణ నాయక్ తెలిపారు.
VSP: రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేయాలని రౌండ్‌టేబుల్ సమావేశం తీర్మానించింది. అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. గంజాయి వ్యాప్తి యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసారు.
KDP: దువ్వూరులో శుక్రవారం జిల్లా విజిలెన్స్ అధికారులు భారీగా గుట్కాను పట్టుకున్నారు. హైదరాబాదు నుంచి ప్రొద్దుటూరుకు లారీలో గుట్కా రవాణా అవుతుండగా దువ్వూరులో పట్టుకున్నారు. 5 గుట్కా బండిల్లు పట్టుకుని, రూ.1.50 లక్షలు పెనాల్టీ విధించారు. జీరోలో రవాణా అవుతున్న ఇతర వస్తువులకు మరో రూ.1.65 లక్షలు పన్ను విధించారు.