• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కొల్లిపరలో రోడ్డు ప్రమాదం.. ఒకరికి గాయాలు

GNTR: కొల్లిపర మండలం అత్తులూరి వారి పాలెం వద్ద గురువారం రాత్రి జరిగిన బైక్ అదుపుతప్పి ప్రమాదంలో తూములూరు గ్రామానికి చెందిన రాజా అనే వ్యక్తి గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించారు. సిబ్బంది క్షతగాత్రుడిని కొల్లిపర సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, ఆయనకు ప్రథమ చికిత్స అందించారు.

February 27, 2026 / 06:36 AM IST

ఎన్‌హెచ్ఏఐ అధికారులతో కలెక్టర్ సమీక్ష

NTR: విజయవాడలోని కలెక్టరేట్లో ఎంపీ కేసినేని చిన్నితో కలిసి నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా స్టేట్ హోల్డర్స్ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేషనల్ హైవే MH 65 ఆరు లైన్ల విస్తరించే పురోగతిపై సమీక్షించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఫ్లై ఓవర్ నిర్మాణం, రోడ్ల నిర్మాణం గురించి చర్చించారు.

February 27, 2026 / 06:35 AM IST

పాలు కల్తీ చేస్తే కఠిన చర్యలు

KDP: చెన్నూరు, రామనపల్లెల్లోని పాల కేంద్రాల్లో పశుసంవర్ధక శాఖ ఏడీ డా. శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాలలో యూరియా, ఫార్మలిన్ కలపడం, పశువులకు ఆక్సిటోసిన్ ఇవ్వడం వల్ల ప్రజల ఆరోగ్యం, ముఖ్యంగా మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆయన హెచ్చరించారు. పాల కల్తీకి పాల్పడేవారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.

February 27, 2026 / 06:32 AM IST

సీఎంను కలిసిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ

KKD: ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ MLA వరుపుల సత్యప్రభరాజా గురువారం అమరావతిలో CM నారా చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై CM సానుకూలంగా స్పందించినట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే ఎమ్మెల్యే.. పలువురు మంత్రులు, అధికారులను కలిసి నియోజకవర్గంలో పనులను వేగవంతం చేయాలని కోరారు.

February 27, 2026 / 06:30 AM IST

హైవేపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ATP: గుత్తి మండలం టీ.కొత్తపల్లి గ్రామ సమీపంలోని 63 హైవేపై శుక్రవారం తెల్లవారుజామున బైకు, బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఈసురాళ్లపల్లి గ్రామానికి చెందిన బెస్త రంగస్వామి, బెస్త పవన్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

February 27, 2026 / 06:30 AM IST

వీబీజీరామ్‌జీ ఉద్దేశం.. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించడం

కృష్ణా: వీబీజీరామ్‌జీ యాక్ట్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఫీల్డ్ అసిస్టెంట్స్ ఎంపీడీవో ఇమ్రాన్ గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీబీజీరామ్‌జీ ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన సేవలు అందించడం అని అన్నారు. ఈ చట్టం ద్వారా గ్రామస్థాయిలో అమలయ్యే పథకాల పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యం సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.

February 27, 2026 / 06:30 AM IST

నేడు ఫైనల్ మ్యాచ్

VSP: యూసీసీ క్రికెట్ పోటీల్లో భాగంగా శుక్రవారం ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో గెలాక్సీ సీసీ జట్టు, వైజాగ్ కోల్ట్స్ జట్టు మధ్య ఫైనల్ పోరు జరుగుతుందని యూసీసీ అధ్యక్ష, కార్యదర్శులు మూర్తి, వెంకటేష్ సంయుక్తంగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి జిల్లా వాసులు మ్యాచ్‌ను తిలకించేందుకు తరలిరావాలని కోరారు.

February 27, 2026 / 06:30 AM IST

వైభవంగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు గురువారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలతో, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీసీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. తొలిరోజు స్వామి పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు. వేడుకలో వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.

February 27, 2026 / 06:26 AM IST

రేపు మత్స్యకారులకు బోట్లు, వలల పంపిణీ

W.G: పెదమైనవానిలంకలో  శనివారం రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో మత్స్యకారులకు బోట్లు, వలల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ పంపిణీ ఏర్పాట్లను జేసీ టి. రాహుల్ కుమార్ రెడ్డి గురువారం పర్యవేక్షించారు. సుమారు 100 బోట్లను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమం విజయవంతం చేసేలా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

February 27, 2026 / 06:25 AM IST

TTD ఛైర్మన్ బీ.ఆర్.నాయుడును కలిసిన ఈవో

TTD: ఛైర్మన్ బీ.ఆర్.నాయుడును ఈవో ముద్దాడ రవిచంద్ర గురువారం సాయంత్రం తిరుమలలోని ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్రను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఛైర్మన్‌తో పాటు బోర్డు సభ్యులు నరేష్ కుమార్ ఉన్నారు.

February 27, 2026 / 06:23 AM IST

గొందిలో జనసేన సభ్యత్వ నమోదు

W.G: గొంది గ్రామంలో జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చల్లపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. జనసేన సభ్యత్వం తీసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే జానకి రామ్, పాలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి సునీల్ పాల్గొన్నారు.

February 27, 2026 / 06:21 AM IST

మీ ఊరి రోడ్డు బాగుపడుతోంది.. నిధుల వివరాలివే!

E.G: అనపర్తి నియోజకవర్గంలో బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం నిమిత్తం రూ. 10.04 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కార్యాలయం గురువారం వెల్లడించింది. అనపర్తి మండలానికి రూ. 3 కోట్లు, బిక్కవోలుకు రూ. 4.52 కోట్లు, రంగంపేట మండలానికి రూ. 2.52 కోట్లు కేటాయించారు. ఎమ్మెల్యే చొరవతో రహదారులకు మహర్దశ పట్టిందని కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

February 27, 2026 / 06:20 AM IST

ఉమ్మడి కృష్ణాజిల్లా నేతలలో విజేతలు వీరే.!

NTR: ఉమ్మడి కృష్ణాజిల్లా లెజిస్లేటివ్ క్రీడా పోటీల్లో నేతలు తమ క్రీడా ప్రతిభను చాటారు. జావెలిన్ త్రో, షాట్‌పుట్ విభాగాల్లో MLAలు శ్రీరామ్ తాతయ్య, గద్దె రామ్మోహన్ విజేతలుగా నిలిచారు. క్యారమ్స్‌లో వర్ల కుమార్ రాజా, గద్దె రామ్మోహన్ గెలుపొందగా, బ్యాడ్మింటన్‌లో కాగిత కృష్ణ ప్రసాద్, శ్రీరామ్ తాతయ్య, వర్ల కుమార్ రాజా విజేతలుగా నిలిచారు.

February 27, 2026 / 06:18 AM IST

నేడు సి.క్యాంపు రైతుబజారుకు సెలవు

KRNL: కర్నూలులోని సీ. క్యాంపు రైతుబజారుకు నేడు సెలవు ప్రకటించినట్లు ఎస్టేటు అధికారి కళ్యాణి, హార్టీకల్చర్ కన్సల్టెంటు శివకుమార్ తెలిపారు. రైతుబజారుకు వినియోగదారులు, రైతుల తాకిడి ఎక్కువగా ఉంటున్నందున శ్రుభతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలిపారు. కేవలం రైతుబజారులో క్లీనింగ్ పనులు పకడ్బందీగా చేపట్టేందుకే ఒక్క రోజు సెలవు ప్రకటిం చినట్లు పేర్కొన్నారు.

February 27, 2026 / 06:12 AM IST

సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

TPT: తిరుచానూరు సమీపంలోని మహిళా ప్రాంగణంలో నాని కేర్ సర్వీసెస్ సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ ఫర్జానా ప్రకటించారు. పదో తరగతి పాస్ అయిన, 25-50 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు అర్హులు. ఈ కోర్సు వ్యవధి 6 నెలలు కాగా, శిక్షణ పూర్తయ్యాక అభ్యర్థులకు మహిళా ప్రాంగణంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.

February 27, 2026 / 06:07 AM IST