• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు’

VZM: జిల్లా వ్యాప్తంగా ఇవాళ నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా కె.ఎల్. పురంలోని శ్రీ లక్ష్మీగణపతి జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని ఆయన సందర్శించి, పరీక్షల నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న గదులను సందర్శించారు.

February 23, 2026 / 11:00 AM IST

పెట్రోల్ దాడిలో గాయపడిన వ్యక్తి మృతి

KKD: తునిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శ్రీరామ థియేటర్ సెంటర్లో బుధవారం జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన సైకిల్ మెకానిక్ నానాజీ సోమవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బైక్ మెకానిక్, సైకిల్ మెకానిక్ మధ్య జరిగిన ఘర్షణ ఆగ్రహానికి లోనైన బైక్ మెకానిక్, నానాజీపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో ఇవాళ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

February 23, 2026 / 11:00 AM IST

ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలు

కృష్ణా: గుడివాడలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకొని పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి, నిబంధనలకు అనుగుణంగా కేంద్రాల్లోకి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అధికారులు చర్యలు చేపట్టారు.

February 23, 2026 / 11:00 AM IST

గుత్తి ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ధర్నా

ATP: గుత్తి ICDS కార్యాలయం ఎదురుగా సోమవారం అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది CITU ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నాయకులు రమేష్ మాట్లాడుతూ.. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, అంగన్వాడి కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 11:00 AM IST

యువకుడి వివాహానికి కేశవరెడ్డి ఆర్థిక సాయం

ATP: గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన రామాంజనేయులు కుమారుడు రవి వివాహానికి ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి సోమవారం రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. నిరుపేద కుటుంబాల పెళ్లిళ్లకు తోడ్పాటు అందించడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. నూతన వధూవరులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

February 23, 2026 / 11:00 AM IST

డివైడర్ను ఢీకొట్టి నిలిచిపోయిన ట్రాలర్

VSP: భారీ వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యంతో హనుమంతువాక-మధురవాడ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎండాడ సిగ్నల్ వద్ద కంటైనర్ తీసుకెళ్తున్న భారీ ట్రాలర్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టి రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ ఎస్ఐ ధర్మేందర్ సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేపట్టారు.

February 23, 2026 / 10:52 AM IST

రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

కోనసీమ: అయినవిల్లి మండలం ముక్తేశ్వరం తొగరపాయ వంతెన వద్ద సోమవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న రెండు మోటార్ సైకిళ్ళు ఢీకొన్నాయి. ఈ విషయం తెలుసుకున్న అయినవిల్లి పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో కొలపర్తి అచ్యుత లోకేశ్వరరావు, పి.శ్రీనివాసరావులకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.

February 23, 2026 / 10:43 AM IST

కలుషిత నీటితో ఇబ్బందులు

KRNL: పెద్దకడబూరు LLC కాలువ పరిధి సళ్లమ్మ వంక సమీపంలో నీరు కలుషితమవుతోంది. కాలువలో ప్రవహిస్తున్న నీటిలో గుర్రపుడెక్కలు, చనిపోయిన జంతువుల కళేబరాలు పేరుకుపోయి తేలుతూ దుర్గంధం వెదజల్లుతోంది. పరిసర ప్రాంతమంతా అసహ్యకరమైన వాసనతో నిండిపోతోంది. చుట్టూ ప్రక్కల పొలాల కూలీలకు ఈ నీటినే ఉపయోగిస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే పరిశుభ్రత పనులు చేపట్టాలన్నారు.

February 23, 2026 / 10:42 AM IST

దేవుడితో వైసీపీ నీచ రాజకీయం: ఎమ్మెల్యే

PPM: కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. హిందూ విశ్వాసాలు, సంప్రదాయాలను వైసీపీ నేతలు గౌరవించలేదని ఆరోపించారు. శాసన మండలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోలతో చెప్పులు వేసుకుని నినాదాలు చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు.

February 23, 2026 / 10:41 AM IST

ఇంటర్ పరీక్షలను పరిశీలించిన ఎస్సై

ATP: శింగనమల నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు కట్టుదిట్టమైన నిఘా మధ్య జరుగుతున్నాయి. పరీక్ష కేంద్రాల్లో అక్రమాలకు తావులేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిరంతరం ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. నార్పలలోని పరీక్ష కేంద్రం వద్ద బందోబస్తు, విద్యార్థులు పరీక్షలు రాస్తున్న విధానాన్ని ఎస్సై సాగర్ పర్యవేక్షించారు.

February 23, 2026 / 10:40 AM IST

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ

AKP: ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. జిల్లాలో పలు పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భద్రత ఏర్పాట్లును పరిశీలించిన ఆయన మాట్లాడుతూ.. మాస్ కాపీయింగ్ జరక్కుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసామన్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత పేపర్లను భద్రంగా స్ట్రాంగ్ రూమ్‌లకు చేరుస్తామన్నారు.

February 23, 2026 / 10:38 AM IST

శ్రీ విరుపాక్షి మారెమ్మకు విశేష పూజలు

CTR: పుంగనూరులో ప్రజలు ఆరాధించే శ్రీ విరుపాక్షి మారెమ్మకు సోమవారం విశేష పూజలు నిర్వహించారు. ఉదయం అర్చకులు ఫల పంచామృతాలతో అభిషేకం చేసి పసుపు, వెండి ఆభరణాలతో అలంకరించారు. భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదం స్వీకరించారు.

February 23, 2026 / 10:36 AM IST

రాయచోటిలో ముగిసిన పార్వేట ఉత్సవం

అన్నమయ్య: రాయచోటిలో శ్రీవీరభద్ర స్వామివారి పార్వేట ఉత్సవం ప్రశాంతంగా ముగిసింది. గతేడాది నిర్వహించిన ఉత్సవ సందర్భంలో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకొని ఈసారి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయం నుంచి స్వామి, అమ్మవార్ల అశ్వవాహనంపై వేటకు వెళ్లే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముస్లిం, మైనారిటీలు స్వామివారి ఊరేగింపునకు ఆహ్వానం పలికి తాగునీరు అందజేశారు.

February 23, 2026 / 10:36 AM IST

అన్నా క్యాంటీన్‌ను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

KRNL: ఆదోనిలోని అన్నా క్యాంటీన్‌ను ఇవాళ మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్‌ను చేరుకున్న ఆయన, అక్కడ అందుతున్నసేవలపై ఆరా తీశారు. అక్కడ పాటిస్తున్న పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం అల్పాహారం చేస్తున్న సామాన్య ప్రజల వద్దకు వెళ్లి, ఆహారం రుచిగా ఉంటుందా అని అడిగి తెలుసుకున్నారు. నాణ్యత విషయంలో రాజీపడకూడదని స్పష్టం చేశారు.

February 23, 2026 / 10:35 AM IST

సామర్లకోటలో పోలీస్ బందోబస్త్

KKD: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నేపథ్యంలో సామర్లకోట పట్టణ పరిధిలో గల పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు పటిష్ట బందోబస్తులను చేపట్టినట్టు సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్ పేర్కొన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.

February 23, 2026 / 10:34 AM IST