• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మైనింగ్ ఉద్యోగం పేరిట రూ. 15 లక్షల మోసం

BPT: కారంచేడు మండలం జరుబులవారిపాలెంకు చెందిన మనోజ్ కుమార్‌ను మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.15 లక్షలు వసూలు చేశారు. నియామక పత్రం, ఐడీ కార్డు ఇచ్చి క్వారీలో పని పెట్టి నెలరోజులకు రూ.18 వేలు ఇచ్చారు. తర్వాత క్వారీ మూసేయడంతో మోసం బయటపడింది. చెక్ బౌన్స్ కావడంతో మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

February 26, 2026 / 06:02 AM IST

రైలు ఢీకొని వ్యక్తి మృతి

NLR: కోవూరు మండల పరిధిలోని పడుగుపాడు రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం సాయంత్రం రైలు ఢీ కొని యువకుడు మృతి చెందాడు. గూడూరు వైపు నుంచి విజయవాడ వైపు వెళుతున్న రైలు ఢీ కొనడంతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన యువకుడు చిన్నపడుగుపాడు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా స్థానికుల సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అని పోలీసులు తెలిపారు.

February 26, 2026 / 06:01 AM IST

రాజంపేటలో పశువులకు వింత వ్యాధి

అన్నమయ్య: రాజంపేట పట్టణంలో ఆవులు, లేగదూడలు వింత చర్మ వ్యాధితో బాధపడుతున్నాయి. వాటి శరీరాలపై దద్దుర్లు ఏర్పడి, చర్మం ఊడిపోయి పుండ్లు అవుతున్నాయి. దీంతో పశువులు మేత మేయలేక నీరసించిపోతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని, లేదంటే మూగజీవాలు నరకయాతన అనుభవిస్తాయని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేశారు.

February 26, 2026 / 06:00 AM IST

ఎక్సైజ్ అధికారుల దాడులు.. స్కూటీ సీజ్

NLR: మిడుతూరు మండలం తిమ్మాపురం వద్ద స్కూటీపై 5 లీటర్ల నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించినట్లు నందికొట్కూరు ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు నాయక్ తెలిపారు. ఈ ఘటనలో నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తి స్కూటీని వదిలి పరారైనట్లు చెప్పారు. అదేవిధంగా లక్ష్మాపురంలో కాలియ అనే వ్యక్తి నుంచి 5 లీటర్ల నాటుసారా స్వాధీనం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

February 26, 2026 / 06:00 AM IST

క్రికెట్ ఆడి అలరించిన మంత్రి అచ్చెన్నాయుడు

SKLM: విజయవాడలోని శాప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఏపీ అసెంబ్లీ క్రీడా మహోత్సవం ఆట విడుపు’ పోటీల్లో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం పాల్గొన్నారు. ఈ మేరకు మంత్రి బ్యాట్ పట్టి క్రికెట్ ఆడుతూ, మైదానంలో సందడి చేశారు. స్టేడియం మొత్తం క్రీడా స్ఫూర్తితో కళకళలాడింది. క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం అని మంత్రి తెలిపారు.

February 26, 2026 / 06:00 AM IST

ఆదోని డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకం

KRNL: ఆదోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న తెలుగు, ఎకనామిక్స్, కంప్యూటర్ అప్లికేషన్ పోస్టులకు అతిథి అధ్యాపకుల నియామకం చేపట్టనున్నట్లు ప్రిన్సిపాల్ S.శివారెడ్డి తెలిపారు. PGలో 55% మార్కులు ఉన్నవారు అర్హులని, నెట్, సెట్, PHD ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 27 నుంచి కళాశాలలో డెమో ఇవ్వాలన్నారు.

February 26, 2026 / 05:52 AM IST

ఏకీకృత కుటుంబ సర్వేను పూర్తి చేయాలి: కలెక్టర్

W.G: యలమంచిలి మండలంలో ఏకీకృత కుటుంబ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం యలమంచిలి తహశీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. మండలంలో సాగుతున్న ఏకీకృత కుటుంబ సర్వే, ఈ-కేవైసీ, పీ-4 కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. సర్వేలో పొరపాట్లు లేకుండా పారదర్శకంగా నిర్వహిచాలన్నారు.

February 26, 2026 / 05:49 AM IST

కారంపూడి మోడల్ స్కూల్‌లో 6వ తరగతి ప్రవేశాలు

PLD: కారంపూడి ఏపీ మోడల్ స్కూల్‌లో వచ్చే ఏడాది 6వ తరగతిలో చేరడానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపల్ సుహాసిని బుధవారం తెలిపారు. ప్రవేశ పరీక్ష ఫీజుగా ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.125 చెల్లించాలని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, ఆ కాపీని పాఠశాలలో అందజేయాలని సూచించారు.

February 26, 2026 / 05:44 AM IST

పెండింగ్ మ్యుటేషన్ల త్వరిత పరిష్కారానికి కలెక్టర్ ఆదేశం

NDL: భూసమస్యలకు సంబంధించిన పెండింగ్ మ్యుటేషన్లను గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ జి.రాజకుమారి రెవెన్యూ అధికారులను బుధవారం ఆదేశించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో తహాశీల్దార్లతో సమీక్ష నిర్వహించి, ప్రభుత్వ ఆదేశాల అమలు, క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం, ప్రజాసేవల మెరుగుదలపై స్పష్టమైన దిశానిర్దేశాలు జారీ చేశారు.

February 26, 2026 / 05:40 AM IST

అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

BPT: నిజాంపట్నం మండలం పల్లపట్లలో పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు సీడీపీఓ అనసూయ బుధవారం తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పరిధిలో ఒక కార్యకర్త, నలుగురు ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 5వ తేదీ లోపు పల్లపట్ల ఐసీడీఎస్ కార్యాలయంలో తమ దరఖాస్తులను సమర్పించాలన్నారు.

February 26, 2026 / 05:40 AM IST

జిల్లాలో ముగ్గురు అధికారుల బదిలీ

KDP: జిల్లాలో ముగ్గురు అధికారుల బదిలీలు జరిగాయి. కడప మున్సిపల్ కమిషనర్ నిమనపల్లి మనోజ్ రెడ్డి, జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ, కడప ఆర్డీవో జాన్ ఇర్విన్ బదిలీ అయ్యారు. తదుపరి పోస్టింగ్ కోసం జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీకి రిపోర్ట్ చేయాలని సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పరిపాలనలో భాగంగా ఈ బదిలీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

February 26, 2026 / 05:30 AM IST

కోడి పందాల స్థావరంపై దాడి.. ఐదుగురు అరెస్ట్

అన్నమయ్య: మదనపల్లి మండలం సీటీఏం ఆంజనేయుని గుడి సమీపంలో కోడి పందాలు ఆడుతున్న ఐదుగురిని తాలూకా పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సీఐ కళావెంకటరమణ ఆదేశాలతో ఎస్సై రామకృష్ణారెడ్డి సిబ్బందితో కలిసి మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పందెం రాయుళ్ల నుంచి రెండు కోళ్లు, 5 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

February 26, 2026 / 05:20 AM IST

నాగార్జున వర్సిటీలో స్పేస్ టెక్నాలజీపై సదస్సు

GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ‘స్పేస్ అండ్ టెక్నాలజీ’పై బుధవారం గెస్ట్ లెక్చర్ నిర్వహించారు. తిరువనంతపురం స్పేస్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ రామారావు హాజరై, అంతరిక్ష రంగంలో విద్యార్థులకు ఉన్న అవకాశాలను వివరించారు. స్పేస్ టెక్నాలజీలో కావాల్సిన నైపుణ్యాలు, ప్రభుత్వ పథకాలు, ఇంటర్న్‌షిప్ ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించారు.

February 26, 2026 / 05:15 AM IST

ఉద్యోగ మేళాలో 69 మంది ఎంపిక

నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేళాలో 69 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ శశికళ బుధవారం తెలిపారు. మొత్తం 132 మంది అభ్యర్థులు హాజరయ్యారని ప్రిసిపల్ పేర్కొన్నారు. ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు తమ భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలని ఆమె సూచించారు.

February 26, 2026 / 05:10 AM IST

అంగన్వాడీల సమస్యలపై మంత్రికి వినతి

ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత బుధవారం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని కలిశారు. నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాల దుస్థితిని వివరించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, అసంపూర్తి పనులు, కాంపౌండ్ గోడల లేమి వంటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కొత్త కేంద్రాల ఏర్పాటుతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరారు.

February 26, 2026 / 05:09 AM IST