E.G: కడియం పల్ల వెంకన్న నర్సరీ శనివారం విశిష్ఠ అతిథి రాకతో సందడిగా మారింది. అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బాబాసాహెబ్ బోస్లే తన కుటుంబంతో కలిసి నర్సరీని సందర్శించారు. ఈ సందర్భంగా యువ రైతులు పల్ల వెంకటేశ్, వినయ్‌లు ఆయనకు బోన్సాయ్ మొక్కను బహూకరించి సాదర స్వాగతం పలికారు. నర్సరీలోని వివిధ రకాల అరుదైన మొక్కలను తిలకరించారు.
ELR: ఉంగుటూరు(మం) ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మండల పరిధిలో పూర్తైన అభివృద్ధి పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్రంగా సమీక్షించారు. అనంతరం వివిధ గ్రామాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధుల ద్వారా తెలుసుకున్నారు.
PLD: చిలకలూరిపేట మార్కెట్ యార్డ్‌లో మార్క్‌ఫెడ్, నాఫెడ్ ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శనివారం ప్రారంభించారు. ప్రభుత్వం శనగ రైతులకు క్వింటాల్‌కు రూ. 5,875 మద్దతు ధర కల్పిస్తోందని తెలిపారు. గతంలో పొగాకు, మిర్చి రైతులకు అండగా నిలిచినట్లే, శనగ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
BPT: ఇసుకదర్శిలోని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు క్యాంపు కార్యాలయంలో శనివారం దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఒక స్వచ్ఛంద ట్రస్ట్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దివ్యాంగుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ASR: డుంబ్రిగుడ మండల ఇంఛార్జ్ ఎంపీడీవోగా విశ్వనాథ్ శనివారం బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ ఎంపీడీవోగా పని చేసిన ప్రేమసాగర్ పదవి విరమణ చేశారు. మండల పరిషత్తు కార్యాలయంలోనే పరిపాలన విభాగ అధికారి(ఏవో)గా విధులు పడుతున్న ఆయనకు ఇంఛార్జ్ ఎంపీడీవోగా సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, గిరిజనుల సమన్వయంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
E.G: పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు పోలీస్ అవుట్ పోస్ట్ నూతన భవనం నిర్మాణం చేస్తున్నామని రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శనివారం కొంతమూరులో కేటాయించిన స్థలంలో పోలీస్ అవుట్ పోస్ట్ నూతన భవనం నిర్మాణానికి MLA శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి తన వంతు సహాయంగా రూ.50 వేలు అందిస్తానని తెలిపారు.
CTR: గుడిపాల మండలంలో ఇప్పటి వరకు 89.76% శాతం మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేసినట్లు ఎంపీడీవో శిరీష తెలిపారు. కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం రామాపురంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. 89.76% పెన్షన్లు పంపిణీ పూర్తి చేశామని, మండలంలో 6,730 వేల మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు.
E.G: అమెరికా విధానాలకు, ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు వల్ల దేశంలోని వ్యవసాయ, చేనేత రంగం నాశనం అయిపోతుందని.. ట్రంప్‌కు మోదీ బానిసగా మారారని CPI జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ కె.నారాయణ విమర్శించారు. శనివారం రాజమండ్రి సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేసి వాళ్లకు కోట్లాది రూపాయలను రుణాలు మాఫీ చేస్తుందన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ పంచాయతీ పరిధిలోని ఓడ్రుబంగి గ్రామానికి డోలి రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించడం కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
VSP: ఆధునికీకరించిన భీమిలి ఆర్డీవో కార్యాలయాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్‌లో ఎక్కువ ఫిర్యాదులు రెవిన్యూపైనే వస్తున్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు చేరువ కావాలని అధికారులకు సూచించారు. దివీస్ యాజమాన్యం కార్యాలయానికి సౌకర్యాలు కల్పించడం అభినందనీయమన్నారు.
SKLM: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జలుమూరు మండలం పలు పాఠశాలలో శనివారం ఘనంగా సైన్స్ దినోత్సవాన్ని జరుపుకున్నారు. పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులు చూపించిన అత్యున్నత విజ్ఞానంతో అనేక పరికరాలను చేసి పదిమందికి ప్రదర్శించారు. విద్యర్థుల ప్రగతికి సైన్స్ ఎంతో దోహదపడుతుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
VZM: జిల్లాలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన అత్యంత ఘనంగా, విజయవంతంగా ముగియడం పట్ల జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ పర్యటనను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన ప్రజా ప్రతినిధులకు, జెసి సేధు మాధవన్‌కి, జిల్లా యంత్రాంగానికి, పోలీస్ విభాగానికి మరియు వివిధ శాఖల అధికారులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
KDP: ఫిబ్రవరి నెలాఖరున పదవీ విరమణ పొందిన కడప టూ టౌన్ హెడ్ కానిస్టేబుల్ వీ.ఎస్. దేవ ప్రసాద్‌ను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. పోలీస్ శాఖకు ఆయన అందించిన క్రమశిక్షణతో కూడిన సేవలు చిరస్మరణీయమని ఎస్పీ కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కుటుంబంతో సమయం గడుపుతూ.. ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు.
W.G: తణుకు సబ్ జైలును నాలుగో అదనపు జిల్లా జడ్జి డీ.సత్యవతి శనివారం సందర్శించారు. సబ్‌జైలులో ఉన్న రిమాండ్ ముద్దాయిలకు అందుతున్న ఆహారం, వసతి, వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు న్యాయవాదిని కలిగి ఉండాలని, ఎవరికైనా న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేక పోతే వారికి మండల న్యాయ సేవల కమిటీ ద్వారా ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తామన్నారు.
CTR: విద్యార్థులు శాస్త్రీయ దృక్పధం అలవార్చుకోవాలని ఏంఈవో హరిప్రసాద్ వర్మ పేర్కొన్నారు. శనివారం విజయపురం క్లస్టర్ రిసోర్స్ సెంటర్ నందు జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. క్లస్టర్ పరిధిలోని పాఠశాలల విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు. వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలలో విజేతలైన విద్యార్థులకు HM సుమతి, సీఆర్‌సీ కార్యదర్శి వెంకమరాజు బహుమతులు అందజేశారు.