• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కొవ్వూరి సుబ్బారెడ్డికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

E.G: అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మామ కొవ్వూరి సుబ్బారెడ్డి స్వర్గస్తులయ్యారు. ఎమ్మెల్యే సతీమణి మహాలక్ష్మితో కలిసి సుబ్బారెడ్డి పార్థివ దేహానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బుధవారం నివాళులర్పించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకొన్నారు. అందరికీ సుపరిచిత వ్యక్తి కావడంతో నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు.

February 25, 2026 / 12:30 PM IST

జాబ్ మేళాలతో లక్ష మందికి ఉద్యోగాలు

GNTR: సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని మంత్రి లోకేశ్ శాసనసభలో బుధవారం తెలిపారు. ఇందుకోసం క్లస్టర్ బేస్డ్ విధానంతో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగ కల్పన చేపడుతున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా యువతకు శిక్షణ ఇస్తున్నామన్నారు.

February 25, 2026 / 12:24 PM IST

అమర సైనికుడి కుటుంబానికి పరామర్శ

ATP: గార్లదిన్నె మండలంలో మరణించిన భారత సైనికుడు సాకే నరేష్ భౌతికకాయానికి ఏడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మొంటిమడుగు కేశవరెడ్డి సతీమణి విజేత నివాళులర్పించారు. గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని నరేష్ కుటుంబ సభ్యులను అక్కున చేర్చుకుని పరామర్శించారు. ప్రభుత్వం నుంచి తగిన సాయం అందేలా చూస్తామని, ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

February 25, 2026 / 12:20 PM IST

‘చెరువులకు నీరు వెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’

CTR: చెరువులకు గ్రావిటీ ద్వారా నీరు వెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అసెంబ్లీలో బుధవారం కోరారు. పశ్చిమ ప్రాంతాలలో కరువును తీర్చేందుకు హంద్రీనీవా జలాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. కుప్పానికి వెళ్తున్న నీరు పలమనేరు నియోజకవర్గంలోని పలు చెరువులకు చేరుతున్నట్టు ఆయన చెప్పారు.

February 25, 2026 / 12:19 PM IST

గవర్నర్‌‌కి ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్

గుంటూరు జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌కి జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఘన స్వాగతం పలికారు. చినకొండ్రుపాడులో నిర్వహించిన ప్రైవేట్ వైద్య కళాశాల స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరైన గవర్నర్‌ని కలెక్టర్ పుష్పగుచ్ఛంతో ఆహ్వానించారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

February 25, 2026 / 12:18 PM IST

‘రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి’

VZM: తెర్లాం మండలంలోని గోపాలవలస, జగన్నాథవలస, సతివాడ రోడ్లు దుర్భరంగా ఉన్నాయని వాటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని బుధవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే బేబినాయన కోరారు. వైసీపీ హయాంలో PR రోడ్లను R&Bలో విలీనం చేసినా నిధులకు ప్రతిపాదనలు చేయలేదన్నారు. పణుకువలస జంక్షన్ నుంచి వంతరాం రోడ్డుకు రూ.3కోట్లతో ప్రతిపాదనలు చేశామని నిధులు మంజూరు చేయాలన్నారు.

February 25, 2026 / 12:18 PM IST

వాహనదారులకు హెల్మెట్ కొనుగోలు చేయించిన సీఐ

కృష్ణా: మచిలీపట్నం–పెడన NH216 జాతీయ రహదారిపై ట్రాఫిక్ సీఐ నున్న రాజు బుధవారం వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ హెల్మెట్ లేని వాహనదారులకు జరిమానా విధించి, వారితో అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేయించారు. నంబర్ ప్లేట్లు లేని వాహనాలకు తక్షణమే నంబర్ ప్లేట్లు అమర్చేలా చర్యలు తీసుకున్నారు.కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

February 25, 2026 / 12:15 PM IST

అన్న క్యాంటీన్‌ తనిఖీ చేసిన కమిషనర్

E.G: అన్న క్యాంటీన్ల నిర్వహణలో ఎటువంటి లోపాలు ఉండకూడదని రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ సూచించారు. బుధవారం రాజమండ్రి జీజీహెచ్ సమీపంలోని అన్న క్యాంటీన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అల్పాహారం తీసుకుంటున్న ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడారు. క్యాంటీన్ సమయానికి తెరుస్తున్నారా.? అని ప్రశ్నించారు. ఆహార పదార్థాల నాణ్యత ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు.

February 25, 2026 / 12:11 PM IST

రేపు బహిరంగ వేలం పాట

CTR: పుంగనూరు పురపాలక కార్యాలయంలో రేపు బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు కమిషనర్ మధుసూదన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026-27 సంవత్సరానికి గాను వారపు సంత, దినసరి కూరగాయల మార్కెట్టు, బస్టాండులోనికి వచ్చు ప్రవేటు వాహన దారుల నుంచి ఫీజు వసూలు, PMC బస్టాండ్, పబ్లిక్ యూరినల్స్ మొదలగు వాటికీ వేలం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

February 25, 2026 / 12:05 PM IST

రోడ్డు ప్రమాదంలో జింక మృతి

అన్నమయ్య: మదనపల్లి మండలం బెంగళూరు రోడ్డులో బుధవారం విషాదం చోటుచేసుకుంది. రెడిఫుడ్స్ ఫ్యాక్టరీ సమీపంలోని చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద రోడ్డు దాటుతున్న జింకను గుర్తుతెలియని వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జింక అక్కడికక్కడే మరణించింది. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని జింకను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పశువుల ఆసుపత్రికి తరలించారు.

February 25, 2026 / 12:00 PM IST

సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ

KRNL: పెద్దకడబూరు మండలంలోని హనుమాపురం గ్రామంలో మంత్రాలయం టీడీపీ ఇన్‌ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి ఆదేశాల మేరకు ఉపాధి హామీ పథకం కింద విడుదలైన నిధులతో ఇవాళ సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. టీడీపీ నాయకుడు బీపీ ఈరన్న కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.

February 25, 2026 / 12:00 PM IST

అంతర్జాతీయ వేదికపై ఎంపీ శబరి

NDL: భారత్–జర్మనీ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యురాలిగా నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి నియమితులయ్యారు. దీంతో ఆమె మరోసారి అంతర్జాతీయ వేదికపై అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఎంపీ మాట్లాడుతూ..  రెండు దేశాల సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానన్నారు. తనను ఎంపిక చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

February 25, 2026 / 12:00 PM IST

బాపట్లలో జనసేన సభ్యత్వ నమోదుపై కీలక భేటీ

BPT: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు బాపట్ల పట్టణంలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు బుధవారం గౌతం గ్రాండ్ హోటల్‌లో సమావేశం నిర్వహించారు. పార్టీ సభ్యత్వ సమన్వయకర్త పచ్చమట్ల ధర్మరాజు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించాలని సూచించారు.

February 25, 2026 / 11:53 AM IST

అమరావతిలో రెండో రోజు ఏడీబీ బృందం పర్యటన

GNTR: రాజధాని అమరావతిలో ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ప్రతినిధుల బృందం బుధవారం కూడా పర్యటించింది. తాడేపల్లి మండలం ఉండవల్లి పంప్ హౌస్ వద్ద పనుల పురోగతిని సీఆర్డీఏ, ఏడీసీఎల్ అధికారులు వారికి క్షుణ్ణంగా వివరించారు. రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనపై ఏడీబీ అధికారులు ఈ పర్యటన ద్వారా పూర్తి అవగాహన చేసుకున్నారు.

February 25, 2026 / 11:50 AM IST

మహానందిలో క్యాన్సర్ వ్యాధి నిర్మూలన సర్వే

NDL: మహానందిలో క్యాన్సర్ వ్యాధి నిర్మూలనపై బుధవారం ఇంటింటి సర్వే నిర్వహించారు. MPHEO హుస్సేన్ రెడ్డి, తదితరులు ఆధ్వర్యంలో సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ వ్యాధి లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానిత లక్షణాలు ఉన్న వారి నుంచి నమూనాలను సేకరించారు. క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని, ప్రజలు సర్వేకు సహకరించాలని అధికారులు కోరారు.

February 25, 2026 / 11:49 AM IST