• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ రంగాలు అత్యంత కీలకం

NTR: విజయవాడలో ఏపీఎండీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన “బీచ్ శాండ్ మినరల్స్ టు టైటానియం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, పై జరిగిన వర్క్‌షాప్‌లో మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏపీలోని బీచ్ సాండ్ ఖనిజాలు కేవలం ఆర్థిక వనరులు మాత్రమే కాకుండా గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ రంగాలు అత్యంత కీలకమని తెలిపారు.

February 25, 2026 / 03:30 PM IST

‘దివిసీమ అభివృద్ధి ప్రదాత ఎంవీ కృష్ణారావు’

కృష్ణా: దివిసీమ అభివృద్ధి ప్రదాత ఎంవీ కృష్ణారావు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. బుధవారం అవనిగడ్డ వంతెన సెంటర్లో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి సందర్భంగా కృష్ణారావు విగ్రహానికి నాగాయలంక మండలం టీ.కొత్తపాలెం కూటమి నాయకులు నివాళులు అర్పించారు.

February 25, 2026 / 03:30 PM IST

‘నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు మంజూరు’

ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి యన్.ఆర్.జి.ఎస్ నిధుల కింద రూ.50 లక్షలు నిధులు మంజూరు అయ్యాయని ఆలయ ఈవో విజయ రాజు బుధవారం మీడియాకు తెలిపారు. మండల ఇంఛార్జి గుమ్మనూరు నారాయణస్వామి, గ్రామస్తులతో కలిసి నూతన డ్రైనేజీ నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయన్నారు.

February 25, 2026 / 03:26 PM IST

మెగా ఉచిత వైద్య శిబిరం

ASR: అరకులోయ మండలం పరిధిలో ఇన్వెస్టు బ్రిర్జి పౌండేషన్ ద్వారా నిపుణులైన వైద్యుల చేత బుధవారం బస్కి గ్రామ పంచాయతీలో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులో కంటి పరీక్ష, దంత పరీక్షలు నిర్వహించారు. దీంతో పాటు కళ్ళద్దాలు, ఉచితంగా అందజేశారు. ఈ మేరకు పంచాయతీ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ సి.హెచ్ శ్రీనివాసరావు తెలిపారు.

February 25, 2026 / 03:26 PM IST

అల్లనేరేడు తోటలో అగ్ని ప్రమాదం

CTR: పుంగనూరు మండలం పట్రపల్లి గ్రామ సమీపంలో అల్లనేరేడు తోటలో బుధవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో 1,50,000 డ్రిప్ పైపులు, కేబుల్స్ కాలిపోయి నష్టం వాటిల్లినట్లు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు.

February 25, 2026 / 03:23 PM IST

చట్టాలను మరింత పటిష్టంగా చేయాలి: కమిషనర్

NLR: మహిళలు పని చేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం- 2013 మరింత పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. బుధవారం నెల్లూరు తిక్కన ప్రాంగణంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. 10 మంది పైన మహిళా ఉద్యోగులు పని చేస్తున్న చోట ఐ.సి.సి ఏర్పాటు చేయాలని ఆమె స్పష్టం చేశారు.

February 25, 2026 / 03:22 PM IST

సీఎం పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు

VZM: ఈనెల 28వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు చీపురుపల్లి మండలం రావివలస వద్ద పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి రానున్వారు. ఈ నేపథ్యంలో బుధవారం సభా స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి పరిశీలించి, పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వేదిక నిర్మాణం, పార్కింగ్ స్థలాలు, తాగునీరు తదితర ఏర్పాట్లను సమీక్షించారు.

February 25, 2026 / 03:22 PM IST

సాధకులకు పవన్ కళ్యాణ్ అండ.!

KRNL: జనసేన కార్యకర్తలను సాధకులుగా పిలవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు బుధవారం ఆదోని నియోజకవర్గం ఇంఛార్జ్ మల్లప్ప తెలిపారు. ఇప్పటికే 75 మంది సాధకులను నియమించామని, సభ్యత్వం తీసుకున్న వారందరికీ భీమా రక్షణ ఉంటుందని ఆయన వెల్లడించారు. మార్పు కోసం యువత పెద్ద ఎత్తున పార్టీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు.

February 25, 2026 / 03:21 PM IST

రైలు నుంచి జారిపడి వృద్ధురాలు మృతి

TPT: నాయుడుపేట, దొరవారిసత్రం రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం ఉదయం ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి చెన్నై వైపు వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న వృద్ధురాలు ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఆమె వద్ద ఉన్న తిరుచ్చి టికెట్ ఆధారంగా ఆమెది తమిళనాడుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

February 25, 2026 / 03:20 PM IST

ఘనంగా ప్రారంభమైన పారా బాడ్మింటన్ పోటీలు

VZM: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 7వ రాష్ట్ర స్థాయి పారా బాడ్మింటన్ పోటీలు బుధవారం స్థానిక రాజీవ్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు ముఖ్య అతిధిగా రోటరీ మాజీ గవర్నర్ డాక్టర్. ఎం. వెంకటేశ్వరరావు హాజరై పోటీలను ప్రారంభించారు. వైకల్యం శరీరానికే తప్పా సంకల్పానికి కాదని దివ్యాంగ క్రీడాకారులు నిరూపిస్తున్నారని అన్నారు.

February 25, 2026 / 03:19 PM IST

‘మీటర్ రీడర్స్‌కు న్యాయం చేయండి’

W.G: విద్యుత్ మీటర్ రీడర్స్‌కు ఎస్ర్కో అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించాలని, విద్యుత్ మీటర్ రీడర్స్‌కు పీఎఫ్, ఇఎస్ఐ అమలు చేయాలని కోరుతూ.. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జేసీకి వినతి పత్రం అందచేశారు. వేతనాల చెల్లింపులో పీఎఫ్, ఇఎస్ఐ అమలులో కాంట్రాక్టర్లు తీవ్ర అవినీతికి పాల్పడుతూ మీటర్ రీడర్స్‌కు తీవ్ర అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు.

February 25, 2026 / 03:18 PM IST

27న నిడదవోలు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం

E.G: ఈ నెల 27న నిడదవోలు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ బుధవారం తెలిపారు. ఈ సమావేశం ఆరోజు ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతుందన్నారు. పట్టణాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలను ఎజెండా రూపంలో సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. సభ్యులు వివిధ శాఖల అధికారులు హాజరు కావాలని కోరారు.

February 25, 2026 / 03:17 PM IST

ఇంటర్ పరీక్షకు 96.51% హాజరు

SKLM: జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు మొత్తం 21,101 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 20,364 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా ఆర్ఎ ఓ ఆర్. సురేష్ తెలిపారు.మొత్తం 737 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షకు 96.51 శాతం హాజరు నమోదైందని వెల్లడించారు.

February 25, 2026 / 03:16 PM IST

జమ్మలమడుగులో బైక్ దొంగలు అరెస్ట్

KDP: బైక్ దొంగలను అరెస్ట్ చేసి, వారి నుంచి 16 బైక్‌లను స్వాధీనం చేసుకున్నామని రూరల్ సీఐ భాస్కర్రెడ్డి తెలిపారు. స్థానిక అర్బన్ పోలీస్టేషన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కోవెలకుంట రోడ్డులో వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానంగా ఉన్న వ్యక్తులను పట్టుకుని విచారించామన్నారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి 16 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

February 25, 2026 / 03:14 PM IST

తడి-పొడి చెత్త గురించి విద్యార్థులకు అవగాహన

కృష్ణా: మచిలీపట్నం 45వ డివిజన్ నారాయణ స్కూల్ విద్యార్థులకు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ గోపాల్ రావు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నతనం నుండి విద్యార్థులు తడి-పొడి చెత్తపై, ప్లాస్టిక్ వాడకం నిషేధంపై అవగాహన కలిగి ఉండాలని ఉన్నారు. వ్యర్ధాలను వేరే వేరే రంగుల డబ్బాలలో వేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు.

February 25, 2026 / 03:05 PM IST